భక్తి అనేది ఈ విశ్వంతో మన సరిహద్దులను చేరిపివేసే ప్రక్రియ ఎలా అవుతుందో సద్గురు వివరిస్తున్నారు.


భక్తి అనేది ఈ సృష్టితో ప్రేమ వ్యవహారం లాంటిది. సాధారణంగా, జనాలు పక్షపాతాన్ని ప్రేమ అని అనుకుంటారు. మీరు ఒకరిని చూస్తే మధురమైన భావనలతో నిండిపోతారు. మరొకరిని చూస్తే మీరు పూర్తిగా ప్రతికూల భావనలతో నిండిపోతారు. ఇది ప్రేమ కాదు, వివక్ష మాత్రమే. మీరు తీర్చుకోవాల్సిన కోరికలు ఏవో ఉన్నాయి కనుక మీరు ఈ కిటుకు వాడుతున్నారు. మీ అవసరాలను తీర్చకపోతే మీరు నన్ను కూడా ద్వేషిస్తారు.

ఎక్కడో మీకు శారీరిక, భావోగ్వేద, మానసిక లేక ఆర్ధికమైన అవసరాలో లేక వేరే అవసరాలో ఉన్నయి. మీరు ప్రేమిస్తున్నాను అని మీరు చెప్పే వారు ఈ అవసరాలు తీర్చకపోతే మీ ప్రేమ వ్యవహారం కాస్తా ద్వేషంగా మారుతుంది.

మీరు నిజంగా ప్రేమలోని మాధుర్యాన్ని తెలుసుకోవాలంటే మీకు భక్తి అవసరం. భక్తి అంటే, మొదటిగా కనీసం ఎటువంటి వివక్ష చూపించకుండా ఉండటాన్ని సాధన చేయటం. అది ఒక చెట్టు,పురుగు, పక్షి, జంతువు, పురుషుడు, స్త్రీ లేక ఒక పిల్లవాడైన – అన్నిటినీ ఒకేలా చూడటం నేర్చుకోండి.

సృష్టిలోని ఒక జీవి గొప్పది లేక మరొకటి అల్పమైనది అని అనుకుంటే మీరు ఈ సృష్టిని అస్సలు అర్ధం చేసుకోనట్లే. ఈ విశ్వానికి  సృష్టి మూలమైనది. ఒక మనిషిని సృష్టించటంలో ఎంత ధ్యాస వహించిందో ఒక చీమనుసృష్టించటంలో కూడా అంతే ధ్యాస వహించింది. సృష్టికర్త ఒక చీమ మీద అంత ధ్యాస పెట్టటానికి సుముఖంగా ఉంటే దాని మీద మీరు ధ్యాస పెట్టలేరా? భక్తి అంటే ఎటువంటి వివక్ష లేకుండా ఉండటం.

అన్నిటినీ సమదృష్టితో చూడటం.....

మీకు ఎటువంటి భావాలూ లేకపోతే అన్నిటినీ ఏ భావాలు లేకుండా చూడండి. మీకు భావాలు ఉంటే అన్నిటినీ అదే భావాలతో చూడండి. ఈ రెండూ నాకు సమ్మతమే. మీలో లేని తియ్యదన్నాని బలవంతంగా వాడటానికి మీరు ప్రయత్నం చేయకండి. మీకు కచ్చితంగా దేనిమీద ఎటువంటి భావాలూ లేకపోతే అన్నిటినీ ఏ భావాలు లేకుండా చూడటం కూడా పని చేస్తుంది. ముఖ్యమైనది ఏమిటంటే మీరు ఈ విశ్వాన్ని ఇంకా చిన్నగా విభజించకుండా ఉండటం.

ప్రస్తుతానికి ఏది మీరు, ఏది మీరు కాదు అనే దానిలో ఒక విభజన ఉంది. యోగా అంటే ఈ విభజనను అధిగమించటానికి చేసే ప్రయత్నమే. “నాకు ఇది ఇష్టం – నాకు అది ఇష్టం లేదు. ఇది సరైనది – అది మంచిది కాదు. నాకు ఇది ఇష్టం – అది ఇష్టం లేదు” లాంటి ఆలోచనలతో మీరు ఈ ప్రపంచాన్ని మరింత ఎక్కువగా విభజన చేస్తున్నారు. అటువంటి ధోరణితో అది కేవలం ఒక పిచ్చి వ్యాయామం మాత్రమే అవుతుంది, మరి మీరు దాన్ని యోగ అని పిలుస్తారు – అది అలా పని చేయదు.

యోగా లో ఉన్నారని అంటే మిమల్ని ఈ సృష్టి నుంచి విడిగా ఉంచిన మీ సరిహద్దులను ఎలా చేరిపివేయాలా అని నిరంతరంగా చూస్తున్నారని అర్ధం. ఒక వ్యక్తి తనను తాను ఒక సర్వాత్మగా రూపాంతరం చేసుకోవటమే యోగ. మీరు ఈ సరిహద్దులను చేరిపివేయకుండా మరింత బలంగా ఏర్పరుచుకుంటే మీరు ఉదయం, సాయంత్రం సర్కస్ చేయవచ్చు కానీ మీరు దాన్ని యోగ అని అనలేరు.

పరిపూర్ణమైన జీవితాన్ని, జ్ఞానాన్ని పొందిన జీవితాన్ని, ఈ విశ్వంతో ఐక్యమైన జీవితంగా, ఈ భౌతిక అస్థిత్వానికి మించిన దానికంటే ఎక్కువగా జీవించటమే విలువగలిగినది. మీరు మీ జీవితం మీద ధ్యాస పెడితే, మీరు ఒక నిర్ధన వ్యక్తి కాకపోతే మీకు తెలుస్తుంది, ఈ ప్రపంచంలో మీ శరీరమనే పంజరానికి మించిన జీవితాన్ని పొందటమే అసలు విలువైనది అని. ఈ విచక్షణ కలిగిన మెదడును దాటి, దేన్నైనా సమదృష్టితో చూడగలిగే స్థితిని ఏర్పరుచుకునేంత వరకూ మీరు ఒక యోగి కాలేరు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు