మనం చక్కెరలో దాగున్న అత్యంత విషపూరితమైన వాటి గురించి మాట్లాడుకుందాం. అలాగే దానికి చేర్చదగ్గ ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నయాలను కూడా తెలుసుకుందాం. 

వెనకటి కాలంలో చక్కెరని చెరుకు రసం నుండి నేరుగా తీసుకుని, శుద్ధిచేయని ముడి రూపంలో వాడేవారు. వడగట్టిన రసాన్ని గడ్డకట్టేంత వరకూ కాచి, దాన్ని ఒక మోస్తరు రాళ్ళుగా విడగొట్టి చక్కెరగా స్వీకరించేవారు. కానీ ఈరోజున, వాణిజ్యపరంగా దొరుకుతున్న చక్కెర చాలావరకూ రసాయన ప్రక్రియలకు గురైనది, శుద్ధి చేయబడింది. అలాంటి శుద్ధి చేయబడిన చక్కెర కేవలం “ఖాళీ క్యాలరీలను” అందిస్తుంది ఎందుకంటే శుద్దీకరణ ప్రక్రియ దాదాపు అన్ని విటమిన్లని, ఖనిజాలని తొలగించి, చక్కెర పోషక విలువలను నాశనం చేస్తున్నది.

పళ్ళు, కూరగాయలు పాల ఉత్పత్తులలో సహజంగా లభ్యమయ్యే చక్కెర, విడి చక్కెరకూ  మధ్య తేడా ఉందని పేర్కొంటోంది. అధిక మోతాదులో చక్కెరను స్వీకరించడం రక్తనాళాలు గట్టిపడడాన్నితీవ్రం చేస్తుంది, మధుమేహ వ్యాధి నియంత్రణను కష్టతరం చేస్తుంది అలాగే పోషక లోపాలను కలుగజేస్తుంది.

చక్కెరకు ప్రత్యామ్నాయాలు:

బెల్లం - చెరుకు రసంలో ఉన్న ఖనిజాలను, పోషకాలను, విటమిన్లనూ బెల్లం తయారీలో కోల్పోదు. ఆయుర్వేదంలో దీన్ని జీర్ణ వ్యవస్థ మెరుగుదలలో, పొడి దగ్గు మొదలైన ఎన్నో ఆరోగ్య సమస్యల వైద్యాలలో ఉపయోగిస్తారు. ఈరోజున, కొన్ని రకాల బెల్లంలో సూపర్-ఫాస్ఫేట్ కలపడం జరుగుతోంది. తెల్లగా, చాలా శుభ్రంగా కనిపించే బెల్లం సూపర్-ఫాస్ఫేట్ బెల్లం. దీన్ని మానుకోవాలి. దీనికంటే, “వికారంగా”, నల్లగా కనిపించే బెల్లాన్ని వాడండి.

తేనెను ఎలా స్వీకరిస్తున్నాం అనేదాన్ని బట్టి తేనె మానవ వ్యవస్థ మీద వివిధ రకాల ప్రభావాలను చూపిస్తుంది.

తేనె: తేనె కూడా చక్కెరకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నయం. ప్రతీ రోజూ తేనె స్వీకరించడం ఎంతో మేలు చేస్తుంది, ముఖ్యంగా అధిక శ్లేష్మం మరియు ఆస్తమా ఉన్నవారికి మంచిది. తేనె గుండెకూ, మెదడుకూ చాలా మంచిది అలాగే బుర్రని చురుగ్గా ఉంచుతుంది.

తేనెను ఎలా స్వీకరిస్తున్నాం అనేదాన్ని బట్టి తేనె మానవ వ్యవస్థ మీద వివిధ రకాల ప్రభావాలను చూపిస్తుంది. గోరువెచ్చని నీటితో కలిపి ప్రతీరోజూ తీసుకుంటే, తేనె రక్తప్రసార వ్యవస్థలోని ఎర్ర రక్త కణాల సంఖ్యను, రక్తంలోని  హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. దీని వల్ల పాండు రోగం ( అనేమియా, రక్తహీనత) సమస్యలు అదుపులో ఉంటాయి.

తేనెను వండకూడదు. అలా చేయడం దాన్ని విషపూరితంగా మారుస్తుంది. తేనెని గోరు వెచ్చని లేదా వెచ్చని నీటిలో కలపండి, మరిగే వేడి నీటిలో కాదు. అలాగే తేనెను ఒక సంవత్సరంలోపు పిల్లలకు ఇవ్వకూడదు.

‘నేను ఇది తింటాను, ఇది తినను. నేను ఇలానే తినాలి, నేను అలానే తినాలి’ అంటూ సరిగ్గా తినడం కంటే కూడా ఆనందంగా తినడం చాలా ముఖ్యం. ఆహరం మీపై ప్రభావాలను చూపిస్తుంది, కానీ అది అంత ముఖ్యమైన అంశం కాదు. తినడంలో నిజమైన ఆనందం అంటే, మరో జీవం మీలో భాగమవ్వడానికి, లీనమవ్వడానికి, కలగలసిపోవడానికి, మీరుగా మారడానికి సిద్ధంగా ఉందన్న విషయం పట్ల ఎరుకతో ఉండడమే. మనిషికి తెలిసిన అతిగొప్ప సంతోషం ఇదే - ఎదో ఒక రీతిలో, తనది కానిది తనలో భాగమవ్వడానికి సిద్ధంగా ఉందన్న విషయం”  ~ సద్గురు

 pc:flickr.com