ఇరవై సంవత్సరాల క్రితం ఈశా మొదటి హోల్ నెస్ ప్రోగ్రామము మొదలయ్యింది. నలభై మంది అందులో పాల్గొన్నారు, కొద్దిమంది వాలంటీర్లు కూడా ఉన్నారు. వీరందరికీ 90 రోజుల పాటు భోజనం సరస్వతి పాటి దాదాపుగా ఒక్కరే చూసుకున్నారు.

"ఆ రోజులలో ఒక చిన్న గుడిసె దానిమీద రేకులు మాత్రమే ఉండేవి. వంట చేయడానికి తగిన పరికరాలు కూడా లేవు. ఒక గొల్ల కాపరి వద్ద చిన్న స్టవ్ తీసుకుని అదే ఉపయోగించాము." "హోల్ నెస్ ప్రోగ్రాము సమయంలో అన్ని చిన్న మోతాదులో జరిగిపోయాయి, ఒక వాలంటీర్ కూరగాయలు తీసుకువచ్చేవారు, పాలకూర ఇక్కడే పెరిగేది, దానితో ఎదో ఒకటి చేసేదానిని, ఆడాయి, ఉప్మా ఇంకా అన్నం. నాకు గుర్తుంది ఒక వాలంటీర్ కి తీపి బాగా ఇష్టంగా ఉండేది, అతని కోసం ఉన్న పదార్థాలతో ఎదో వీలైనది చేసేదానిని" అని పాటి గుర్తుతెచ్చుకున్నారు.

“అప్పట్లో, మూడు గదులు మాత్రమే ఉండేవి: రెండు గదులు రాతితో కట్టినవి, ఒకటి చిన్న గుడిసె, దానిని వంటకి ఉపయోగించేవాళ్ళము. సద్గురు ఇక్కడ అరుదుగా తినేవారు - అప్పుడు కోయంబత్తూరులో ఉండేవారు.ఆయన వచ్చినప్పుడు ఒక గదిలో ఉండేవారు, నేను ఆయనకి వంట చేసేదానిని. ఆయనకి మాత్రమే ఒక సలాడ్, చపాతీలు చేసేదానిని. ‘విజ్జీ’ మా ఇక్కడకు వచ్చిన తరువాత నేను వారికి రసం చేసేదానిని. సద్గురుకి పాలకూర అంటే ఇష్టం అనుకుని ఆయనకి దానిని తరుచుగా వండేదానిని.”

సరస్వతి పాటి మొదటి ముప్పై రోజులు హోలెన్స్ ప్రోగ్రాములో పాల్గొన్నారు. అప్పుడు ఆసనాలు, అంగమర్దన, మహత్ప్రాణాయామం నేర్చుకున్నారు. " సద్గురు చెపుతున్నది నాకు అర్ధమయ్యేది కాదు, ఆయన ఎక్కువగా ఇంగ్లీషులో సంభాషించేవారు. కానీ ఆయన భాష అవరోధం కాదు, నాతో ఉంటే, మీకు దానంతట అదే అర్ధం అవుతుంది అని ప్రోత్సహించారు. అది నిజమే, ఆయన చెప్పదలచుకున్నది నాకు ఎప్పుడూ అర్ధం అయ్యేది"

ముప్పయి రోజుల తరువాత, టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాము ఒక అరవై రోజుల పాటు జరిగింది. దీనికి (సరస్వతి)పాటి వాలంటీర్ గా ఉన్నారు. కూరగాయలు కోయడం, వండటం వంటివి చూస్తూ వంటగదిలో ఎన్నో గంటలు గడిపారు. అంతమాత్రమే కాదు, సరస్వతి పాటి వంటమాత్రమే కాక, గదులు, ప్రోగ్రాం ప్రదేశాలు శుభ్రం చేయడంతో పాటు వీలయినంత తోట పని కూడా చేశారు. "ఎన్నో మందార చెట్లు ఉండేవి, నేను వాటి సంరక్షణ చూస్తూ ఎంతో సమయం గడిపేదానిని" అని చెప్పారు.

మరి ఈశాతో ఆవిడ ప్రయాణం ఎలా మొదలయ్యింది? "నా కొడుకు ఇక్కడ వాలంటీర్, ఇరవై సంవత్సరాల క్రితం వంట చేయడానికి ఎక్కువ మంది లేరు, అందువల్ల నన్ను ఆహ్వానించాడు వచ్చి వంటలో సహాయం చెయ్యమని. నేను ఒప్పుకున్నాను, అప్పటినుండి ఇక్కడే ఉండిపోయాను. నేను వచ్చినప్పుడు నా వయసు అరవై రెండు." అని పాటి గుర్తుచేసుకున్నారు.

“ఎప్పుడైనా నేను ఆశ్రమం చూసినప్పుడు ఇంత త్వరలో ఇంత విశాలంగా విస్తరించడం చూసి నాకిది అద్భుతంగా అనిపిస్తుంది. నేను వచ్చినప్పుడు స్నానం చేయడానికి కూడా స్థలం లేదు, ఇప్పుడు ఇంత బాగా నిర్వహించబడుతున్న ఎన్నో బాత్రూములే కాక, సూర్యకుండం చంద్రకుండం కూడా ఉన్నాయి. అప్పట్లో కూరగాయలు, పండ్లు కోయడానికి కొన్ని చాకులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అదే పనికి యంత్రాలు, పరికరాలు ఇంకా విశాలమైన ప్రదేశం కూరగాయలు కోయడానికి ప్రత్యేకంగా ఉంది. ఈ మార్పు నమ్మశక్యం కాకుండా ఉంటుంది".

1994 లో పాటి వండి వడ్డించిన కొద్దిమందినుండి ఇప్పటికి ఈశా నిజంగానే ఎంతో పెరిగింది. ఈ రోజు భిక్ష హాలులో దాదాపుగా 2000 మంది ప్రతి భోజన సమయంలో ఉంటారు. సరస్వతి పాటి వండిన ఇరవై సంవత్సరాల తరువాత మహాలయ అమావాస్య నాడు ఈశా భిక్షని ప్రారంభించారు. ఈశా భిక్ష దాతలకు సంవత్సరంలో ఒక రోజున, అలా ఇరవై సంవత్సరాల వరకు భోజనం అందచేయడానికి అవకాశం ఇస్తుంది. అటువంటి దాతలను వారికి ప్రత్యేకమైన సందర్భ సమయంలో గుర్తించి, సద్గురు ఆశీర్వాదం ఉన్న కార్డు ఇంకా శుభాకాంక్షలు అందచేస్తాము.

మహాలయ అమావాస్య కార్యక్రమంలో భాగంగా ఆదియోగి ఆలయంలో ఇది మొదలయ్యింది. ఈ కార్యక్రమం ప్రశంసల మధ్య పండుగలా సరస్వతి పాటి చేతులమీద ప్రారంభం కావడం విశేషం.

సద్గురు