గొప్ప సాధువైన కబీర్ ఇలా అన్నాడు “ఒకవేళ భగవంతుడే నా ముందు సాక్షాత్కరించినా, నేను నా గురువు పాదాలనే కోరుకుంటాను, ఎందుకంటే నన్ను భగవంతుడి వద్దకు చేర్చింది నా గురువే” అని. ఒకరు ఎంత సంపద, జ్ఞానం, కీర్తి లేదా యోగ సిద్ధులను గడించినా సరే, గురువు అనుగ్రహం లేకపోతే ఇవి ఉన్నా ఉపయోగం లేదు అన్న విషయాన్ని ఈ స్తోత్రం మనకు చెబుతోంది.

గురు అష్టకం

 

శరీరం సురూపం తథా వా కళత్రం

యశఃశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్

 

చక్కని రూపం గల అందమైన భార్య ఉన్నప్పటికి, గొప్ప కీర్తి, మేరు

పర్వతమంత డబ్బు ఉన్నప్పటికీ గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి

ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

 

కళత్రం ధనం పుత్ర పౌత్రాధి సర్వం

గృహం బాంధవా సర్వ మేతాధి జాతం,

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్

 

భార్య, సంపద, పుత్రులు, మనుమలు, మంచి ఇల్లు, బంధువులు ఉండి

గొప్ప కుటుంబములో పుట్టినప్పటికీ, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి

ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

 

షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్య

కవిత్వాది గద్యం, సుపదయం కరోతి

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్

 

నీవు ఆరు అంగములలోను, నాలుగు వేదములలోను, పారంగతుడవైనా కాని,

గద్య, పద్య రచనలో ప్రజ్ఞావంతుడైన గాని, గురువు పాదాల వద్ద నిలపలేని

మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

 

విదేశేషు మాన్యః, స్వదేశేషు ధన్యః

సదాచార వృత్తేషు మత్తో న చాన్యః

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్

 

నిన్ను విదేశములో గొప్పగా, స్వదేశములో ధనవంతునిగా, సదాచార వృత్తి

గలిగి జీవించువాడవని పొగడబడినా, గురువు పాదాల వద్ద నిలపలేని

మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

 

క్షమా మండలే భూప భూపాల వృందై

సదా సేవితం యస్య పాదారవిందం

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్

 

నీవు ఒక దేశానికి రాజువైనా, ఎందరో రాజులు, రారాజులు

నీ పాదాలు సేవించినను, గురువు పాదాల వద్ద నిలపలేని

మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

 

యశో మే గతమ్ దీక్షు దాన ప్రతాప

జగద్వస్తు సర్వమ్ కరే యః ప్రసాదత్

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్

 

దానగుణం వలన నీ కీర్తి అన్ని దిశల వ్యాపించినా,

ప్రపంచం మొత్తం నీ పక్షాన ఉన్నప్పటికీ,

గురువు పాదాల వద్ద నిలపలేని

మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

 

న భోగే, న యోగే, న వా వాజి రాజౌ

న కాంతా ముఖే నైవ విత్తేషు చిత్తమ్

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్

 

భోగము, యోగము, అగ్నిహోమము, స్త్రీ సుఖము, ధనము నందు నీవు శ్రద్ధ

చూపనప్పటికీ, గురువు పాదాల వద్ద నిలపలేని

మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

 

అరణ్యే న వాసస్య గేహే న కార్యే

న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యె

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్

 

అడవిలో, ఇంటిలో ఉండాలని కోర్కెలేని వారైనా,

ఏదైనా సాధించాలని గాని, తన వంటి మీద శ్రద్ధగాని లేని వారైన గాని,

గురువు పాదాల వద్ద నిలపలేని

మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

 

సంపాదకుని సూచన:
ఈ సంవత్సరం, గురు పౌర్ణమి 16జూలైన రానుంది. ఇక్కడ క్లిక్ చేసి ప్రత్యక్ష ప్రసారానికి రిజిస్టర్ చేసుకోండి.