ఆధ్యాత్మిక జీవితం కోసం 6 సూత్రాలు!
ArticleMay 14, 2016
రండి! అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటో ఈ ఆరు సూత్రాల ద్వారా తెలుసుకుందాం.
- ఆధ్యాత్మిక మార్గంలో ఉండటం అంటే అర్థం, మీరు దైవానికి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నారని కాదు – మీరు దైవంతో ఏకమవ్వాలనుకుంటున్నారని.
- మనుషులు తమలోనే ఉన్నసృష్టికర్తను అనుభూతి చెందరు కాబట్టే, మతాలు మనుతున్నాయి. లేకపోతే, దేవుడు స్వర్గంలో కూర్చున్నాడని ఎవరు నమ్ముతారు?
- అనుగ్రహం కిందికి దిగిరాదు – అది ఎల్లప్పుడూ ఉంటుంది. దానిని గ్రహించేలా మిమ్మల్ని మీరు తయారుచేసుకోవాలి.
- ఆధ్యాత్మికత అంటే భౌతికాన్నిత్యజించడం కాదు, దానిని అధిగమించడం.
- ఆధ్యాత్మిక ప్రక్రియ ఓ వెనకడుగు కాదు. ఇతరులింకా వెళ్ళని చోటుకు వేసే ఒక పెద్ద ముందడుగు.
- ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఏదో ఒక రోజు స్వర్గానికి పోవడం గురించి కాదు. అది జీవితం యొక్క పూర్తి ఔన్నత్యాన్ని తెలుసుకోవడం గురించి.