యక్ష-సంగీత, నాట్యాల దివ్యోత్సవం

2022 (మహాశివరాత్రికి ముందు) ఈశా యోగా కేంద్రంలో

మన దేశ సాంప్రదాయ కళల ప్రత్యేకతను, స్వచ్ఛతను ఇంకా వైవిధ్యాన్ని పరిరక్షించే ప్రయత్నంలో, ఈశా ఫౌండషన్ ప్రతి ఏడాది యక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇది సంస్కృతి, సంగీతం ఇంకా నృత్య కళలకు సంబంధించి ప్రఖ్యాత కళాకారుల ప్రదర్శనలతో సాగే మూడు రోజుల ఉత్సవం. భారతీయ పురాణాలలోని దివ్యలోక వాసుల పేరు మీదుగా యక్ష అని పేరు పెట్టడమైనది. యక్ష అనేది ప్రసిద్ధ కళాకారుల ప్రదర్శనకు ఇంకా ఈ ప్రాచీన కళలను పోషించేందుకు ఒక వేదికను కల్పిస్తుంది.

Watch Archived Webstream

detail-seperator-icon

2022 Music Performances

Performers for Yaksha 2022 will be announced soon.

detail-seperator-icon

యక్ష 2022 లో పాల్గొనండి

భారతదేశంలోని ఈశా యోగా కేంద్రం వద్ద
6:30 pm -8:30 pm (6.20 pm కల్లా ఆశీనులు కండి)
మరిన్ని వివరాలు కోసం సంప్రదించండి:
ఫోన్: 83000 83111 or ఈ-మెయిల్: info@mahashivarathri.org

detail-seperator-icon

గత ప్రదర్శనలు

‘యక్ష’ అన్న పేరుకు భారత పురాణాలలోని దివ్య యక్షులే స్ఫూర్తి. యక్ష అనేది ఈశా ఫౌండేషన్ చేత నిర్వహించబడుతున్న ఒక అద్భుతమైన సంగీత, నృత్య కళల, మూడు రోజుల మనో రంజక వేడుక. ఫిబ్రవరి లేదా మార్చ్ మాసాల్లో గొప్ప కళాకారుల ప్రదర్శనలతో నిర్వహించబడే యక్షలో వేలాది ప్రేక్షకులు పాల్గొంటారు.

Kalapini Komkali

శ్రీమతి కలాపిని కొంకలి

హిందుస్తానీ గాత్ర సంగీతం

స్వచ్ఛమైన, శ్రావ్యమైన, సమృద్ధమైన గాత్రంతో, కలాపిని కొంకలి యువతరంలో అత్యుత్తమమైన సాంప్రదాయ హిందూస్థానీ గాయనిగా సర్వత్రా గుర్తింపబడ్డారు. సుప్రసిద్ధ హిందూస్థానీ గాయకులు, పండిట్ కుమార గంధర్వ కుమార్తెగా, శిష్యురాలిగా, కలాపిని తండ్రి సృజనాత్మకత, కళా పరిజ్ఞానం వారసత్వంగా సంతరించుకున్నారు. వారసత్వంగా వచ్చిన కళా పరిజ్ఞానాన్ని తన అవగాహనతో పటిష్టం చేసుకుంటూ, తనదైన కల్పనతో గత దశాబ్ద కాలంలో సున్నితత్వం, ప్రగాఢత గల్గిన కళాకారిణిగా పరిణితి చెందారు. ఆవిడ ప్రదర్శనలు సృజనాత్మకతతోనూ, వివిధ సంగీత బాణీలలో ఆమెకున్న నైపుణ్యంతోనూ, తొణికిసలాడతాయి.

Ranjani-Gayatri

శ్రీమతి రంజని & శ్రీమతి గాయత్రి

కర్ణాటక గాత్రం

ఉన్నత శ్రేణి రసజ్ఞులకేగాని, సామాన్య శ్రోతలకు అందుబాటులోలేని పరిథిలో కూడా ఈ రంజని, గాయత్రి సోదరీమణులు ప్రేక్షకులను రంజింపజేసే మార్గాన్ని, వారిని సంతృప్తి పరచే విధానాన్ని కనుగొన్నారు. కర్ణాటక గాత్ర విద్వాంసులలో ఉన్నత శ్రేణికి చెందిన వీరు సాంప్రదాయాలను పరిరక్షిస్తూనే, మరిన్ని కొత్తపోకడలను సృష్టిస్తున్నారు. వారు వాషింగ్టన్ లోని కెన్నడీ సెంటర్, ఇటలీలోని రవెన్న మ్యూజిక్ ఫెస్టివల్, వార్సా(పోలెండ్) లోని క్రాస్ కల్చర్ ఫెస్టివల్, ఢాకాలోని బెంగాల్ మ్యూజిక్ ఫెస్టివల్, సింగపూర్ లోని ఎస్ప్లాండ్ ధియోటర్ వంటి ఎంతో విశిష్టమైన వేదికల మీద ప్రదర్శనలు ఇచ్చారు.

యక్ష ఉత్సవంలో చివరి రోజంతా వివిధ భారతీయ కళా ప్రదర్శనలు ఉంటాయి.
Leela-Samson

లీల శాంసన్ & స్పంద డాన్స్ కంపెనీ
నది

లీల సామ్సన్ భరత నాట్యంలో గొప్ప నర్తకి, వ్యాఖ్యాత కూడా. ఆమె సోలో ప్రదర్శనలను ఇవ్వడమే కాకుండా, స్పంద డాన్స్ కంపెనీతో భారతదేశంలోనూ ఇంకా విదేశాలలోనూ ప్రదర్శనలు ఇస్తుంటారు. ఆమె 1982 లో ‘సంస్కృతి’ పురస్కారాన్ని, 1990 లో ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని, 1997 లో ‘నృత్య చూడామణి’ పురస్కారాన్ని, 2000 లో ‘సంగీత నాటక అకాడెమీ’ పురస్కారాన్ని ఇంకా 2015 లో చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ ద్వారా ‘నాట్య కళా ఆచార్య’ పురస్కారాన్ని అందుకున్నారు.

ఈశా సంస్కృతి వారి ప్రదర్శన
ఫకీర ఖేత ఖాన్ ఇంకా వారి బృందంచే రాజస్థాన్ జానపద నృత్య ప్రదర్శన

సారీస్
ట్రెడిషన్ అండ్ బియాండ్” పుస్తక రచయిత ఆర్ టి ఎ కపూర్ చిస్తిచే నిర్వహింపబడే, ‘చీరను 108 రకాలుగా ధరించడం’ అనే వర్క్ షాప్ లో పాల్గొనండి.

Vidushi Bombay Jayashri – Carnatic Vocal

Shri Ganesh and Shri Kumaresh – Carnatic Violin

Padmashri Geeta Chandran – Bharatanatyam

Padma Bhushan TV Sankaranarayanan – Carnatic Vocal

Ustad Sayeeduddin Dagar – Hindustani Vocal

Malladi Brothers – Carnatic Vocal

Rajan Mishra and Sajan Mishra – Hindustani Vocal

Rama Vaidyanathan – Bharatanatyam

Pandit Ajoy Chakrabarty – Hindustani Vocal

Mysore Brothers – Carnatic Violin

Padmashri Meenakshi Chitharanjan – Bharatanatyam

Bijayini Satpathy and Surupa Sen – Odissi

detail-seperator-icon