Join Us And Watch Yaksha Live Performances

Yaksha 2021 Archives

శ్రీ సందీప్ నారాయణ్, కర్నాటిక్ వోకల్ (గాయకుడు)

హిందుస్థానీ, శ్రీమతి. కౌశిక చక్రవర్తి

detail-seperator-icon

యక్ష-సంగీత, నాట్యాల దివ్యోత్సవం

2021 మార్చి 8-10 వరకు (మహాశివరాత్రికి ముందు) ఈశా యోగా కేంద్రంలో

మన దేశ సాంప్రదాయ కళల ప్రత్యేకతను, స్వచ్ఛతను ఇంకా వైవిధ్యాన్ని పరిరక్షించే ప్రయత్నంలో, ఈశా ఫౌండషన్ ప్రతి ఏడాది యక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇది సంస్కృతి, సంగీతం ఇంకా నృత్య కళలకు సంబంధించి ప్రఖ్యాత కళాకారుల ప్రదర్శనలతో సాగే మూడు రోజుల ఉత్సవం. భారతీయ పురాణాలలోని దివ్యలోక వాసుల పేరు మీదుగా యక్ష అని పేరు పెట్టడమైనది. యక్ష అనేది ప్రసిద్ధ కళాకారుల ప్రదర్శనకు ఇంకా ఈ ప్రాచీన కళలను పోషించేందుకు ఒక వేదికను కల్పిస్తుంది.

detail-seperator-icon

2021 సంగీత ప్రదర్శనలు

ఈ సంవత్సరం, యక్ష మార్చి 8 నుండి 10 వరకూ జరుగుతుంది. ప్రదర్శనలన్నీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఉచితంగా స్ట్రీమ్ చేయబడతాయి.

1 వ రోజు – మార్చి 8, 2021

శ్రీమతి. కౌశిక చక్రవర్తి

హిందుస్థానీ

శ్రీమతి. కౌశికి చక్రవర్తి భారత శాస్త్రీయ గాయకురాలు. సంగీత్ రీసెర్చ్ అకాడమీలో తర్ఫీదు పొందిన ఆమె, పాటియాలా ఘరానాకు ప్రాతినిధ్యం వహించి ప్రశంసలు పొందారు. అలాగే ఆమె కచేరీలో ఖయాల్స్ ఇంకా సెమీ-క్లాసికల్ తుమ్రిస్ కూడా ఒక భాగం. 2005లో ఆసియా-పసిఫిక్ విభాగం నుండి ఆమె బిబిసి రేడియో 3 అవార్డ్స్ ఫర్ వరల్డ్ మ్యూజిక్ అందుకున్నారు.

2 వ రోజు – మార్చి 9 2021

శ్రీ సందీప్ నారాయణ్

కర్నాటిక్ వోకల్ (గాయకుడు)

ఈ రోజు కర్నాటిక్ సంగీతంలో ప్రియమైన గాయకులలో సందీప్ నారాయణ్ ఒకరు. అమెరికాలో పుట్టి పెరిగి, కర్నాటక సంగీతాన్ని పూర్తి స్థాయి వృత్తిగా స్వీకరించేందుకు భారతదేశానికి వచ్చిన సంగీతకారులలో ఆయన మొదటివాడు. అవధులను అధిగమిస్తూండడంతో పాటు ఎందరో ఔత్సాహిక సంగీతకారులకు సందీప్ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన సంగీత నాటక అకాడమీ అందించే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం, కళా రత్న మరియు యువ పురంధర అవార్డులతో సహా అనేక అవార్డులను అందుకున్నారు.

3వ రోజు – మార్చి 2021

ఈశా సంస్కృతి

భరతనాట్యం

ఈశా సంస్కృతి సద్గురుచే స్థాపించబడి, పిల్లల కోసం ఒక సమర్పణగా రూపొందించబడింది. పిల్లలు తమలో తాము ఇంకా వారి చుట్టూ ఉన్న ప్రపంచంతో సామరస్యంతో వికసించేందుకు ఇది అనువైన వాతావరణాన్ని కల్పిస్తుంది.

యోగాభ్యాసాల యొక్క ప్రత్యేకమైన సమ్మేళనం, భారత శాస్త్రీయ కళలైన భరతనాట్యం, శాస్త్రీయ సంగీతం మరియు కలరిపైట్టు వంటి యుద్ధ కళలు పిల్లల శరీరం ఇంకా మనసులలో సమతుల్యతను మరియు స్థిరత్వాన్ని తీసుకువస్తాయి. ఈ గూఢమైన కళారూపాలు వినోదం లేదా అభిరుచిగా కాకుండా, ఆధ్యాత్మిక ప్రక్రియగా వేలాది సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్నాయి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలో అసమానమైన భాషగా ఉన్న సంస్కృతం, వారి అభ్యాస ప్రక్రియలో ప్రధాన భాగం. పిల్లలు ఇంగ్లీష్ మరియు ప్రాథమిక స్థాయి గణితం కూడా అభ్యసిస్తారు.

detail-seperator-icon

యక్ష 2020 కార్యక్రమాలు

Hyderabad Brothers, Carnatic Classical Vocals

Kala Ramnath, Hindustani Classical Violin

యక్ష 2019 కార్యక్రమాలు

Kalapini Komkali, Hindustani Vocal Performance