పాల్గొనండి
గత కొన్ని సంవత్సరాల నుండి ఈశా యోగా కేంద్రంలో మహాశివరాత్రి ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అధ్భుతమైన సంగీత నృత్య ప్రదర్శనలు ఇంకా సద్గురు నిర్వహించే శక్తివంతమైన ధ్యానాలతో, ఈ కార్యక్రమం కొన్ని వందల వేల మందిని ఆకర్షిస్తోంది. ఇక్కడ ప్రత్యక్షంగానే కాక, టీవిలో, ఇంటర్నెట్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా మరెంతో మంది కార్యక్రమంలో పాల్గొంటారు.
మహాశివరాత్రి
1 మార్చి 2022 : సాయంత్రం 6గంటల నుండి రాత్రంతా
మహాశివరాత్రికి రిజిస్ట్రేషన్ చేసుకోండి
స్వయంగా పాల్గొనండి
అందరూ ఆహ్వానితులే.
మరింత సమాచారం కోసం
ఫోన్: 83000 83111
ఈ-మెయిల్: info@mahashivarathri.org
భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం:
Hindi
Tamil
సత్సంగం
ఈశా యోగా కేంద్రంలో మహాశివరాత్రి ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భారతదేశంలో నుంచే కాక ప్రపంచం నలుమూలల నుండి లక్షల సంఖ్యలో ఇక్కడకు వచ్చే ప్రజలు రాత్రంతా సద్గురుతో జరిగే సత్సంగం లో పాల్గొంటారు.
ధ్యానం
సద్గురు రాత్రంతా శక్తివంతమైన ధ్యానలను నిర్వహిస్తారు, అంతే కాదు, రసవంతమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి.
నడిరేయి ధ్యానం
ఈ నాటి రాత్రి, అందరూ ఎంతగానో ఎదురుచూసే కార్యక్రమమైన నడిరేయి ధ్యానం లోకి , కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ సరిగ్గా అర్ధరాత్రి అయ్యేసరికి సద్గురు ఉపదేశిస్తారు.
శక్తివంతమైన మంత్రోఛ్ఛారణ
జ్ఞానోదయం పొందిన గురు సాన్నిధ్యంలో ఒక సాధారణ మంత్రం కూడా పరిణమింపజేసే ఒక శక్తివంతమైన ప్రక్రియ అవుతుంది. ఈ మహాశివరాత్రి రోజున సద్గురుచే నిర్వహించబడే ఈ గైడెడ్ ధ్యానంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనండి. ఇంకా చదవండి
మహాశివరాత్రికి సిద్ధం కండి – మహాశివరాత్రి సాధన
ఎన్నో ఆవశ్యకతలకు నిలయమైన మహాశివరాత్రికి, మహాశివాత్రి సాధన మిమ్మల్నిసిద్ధం చేస్తుంది. ఏడు సంవత్సరాలకు పైబడిన వారు ఎవరైనా సరే ఈ సాధనను చేయవచ్చు. ఇంకా తెలుసుకోండి
ఇంటనే మహాశివరాత్రి
ఈ రోజున మనవ దేహంలో సహజంగానే చైతన్యం ఉప్పొంగడం వల్ల కొన్ని శక్తివంతమైన సాధనలు చేయడానికి సాధ్యపడుతుంది. ఇతర రోజుల్లో తగినంత సాధన లేని వారికి ఇలాంటి సాధనలు చేయడం శ్రేయస్కరం కాదు.
మీలో చాలా మందికి తెలుసుండవచ్చు. సాధారణ పరిస్థితులలో మహామంత్రమైన “ఓం నమఃశివాయ” ని పఠించవద్దని మేము ఎల్లప్పుడూ ప్రజలకు నిర్దేశిస్తున్నాము. కానీ మహాశివరాత్రిన మాత్రం మీరు ఈ సాధన ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చును.
మహాశివరాత్రిన ఈశా యోగా కేంద్రం వద్ద ఉండటం కుదరనివారు, ఈ కింది తెలిపిన విధంగా ఈ రాత్రిని సద్వినియోగ పరుచుకోవచ్చును.
- రాత్రంతా ఎరుకతో జాగారం చేస్తూ, వెన్నెముకను నిటారుగా ఉంచాలి, పడుకోకూడదు. ఇది ఎంతో శ్రేయోదాయకం.
- మీరు ఉండే గదిలో ఒక దీపాన్ని లేదా లింగ జ్యోతిని వెలిగించి, ధ్యానలింగ యంత్రం లేదా సద్గురు చిత్రపటం, పువ్వులు, ధూపం, మొదలగునవి ఉంచండి.
- మీరు భక్తి కీర్తనలు పాడటం లేదా వినడం చేయవచ్చును.
- మీరు ఒంటరిగా ఉంటే, కొంచెం నడక లేదా ప్రకృతితో ఉండండి. ఒక బృందంతో ఉంటే, సాధ్యమైనంత వరకు మౌనంగానే ఉండండి.
- నడిరేయి సాధనను ఈ విధంగా చేయవచ్చును. 11:10 pm నుంచి 11:30 pm Nadi Shuddhi; 11:30 pm నుండి 11:.50 pm వరకు – “ఆమ్“ మంత్రం పఠించడం; 11:50 pm – 12:10 am – మహామంత్రమైన “ఓం నమఃశివాయ” ను పఠించండి.”
- ఒకవేళ మీరు వేడుకలను టివి లేదా వెబ్ ప్రత్యక్ష ప్రసారాల్లో అనుసరిస్తుంటే, ధ్యాన సూచనలను అందులో చెప్పిన విధంగా చేయండి.