మహాశివరాత్రి

February 21st, 2020 – 6pm – 6am

ఈశా యోగా కేంద్రం

మహాశివరాత్రినాడు, వెల్లెంగిరి పాదాల వద్ద ఉండడం అంటే, మీరు సరైన సమయంలో, సరైన స్థలంలో ఉన్నారని. మిమ్మల్ని మీరు గ్రహణశీలురుగా ఉంచుకుంటే, ఇది మిమ్మల్ని జాగృతం చేసే రాత్రి కాగలదు – సద్గురు

స్వయంగా పాల్గొనడానికి

రాత్రంతా జరిగే ఉత్సవంలోని వివిధ కార్యక్రమాలు:

Midnight Meditation

నడిరేయి ధ్యానం

ఈ నాటి రాత్రి, అందరూ ఎంతగానో ఎదురుచూసే కార్యక్రమమైన నడిరేయి ధ్యానం లోకి , కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ సరిగ్గా అర్ధరాత్రి అయ్యేసరికి సద్గురు ఉపదేశిస్తారు.

Musical Performances

సంగీత కార్యక్రమాలు

అందరూ ఉత్సాహంగా పాల్గొనేందుకు, తద్వారా లబ్ధి పొందేందుకు ప్రతియేటా ఈశా యోగాకేంద్రంలో ప్రముఖ కళాకారుల సంగీత నృత్య కార్యక్రమాలతో, మహాశివరాత్రిని ఎంతో వైభవంగా జరుపుకుంటాము.

Rudraksh Prasadam

రుద్రాక్ష ప్రసాదం

లక్షా ఎనిమిది రుద్రాక్షలు మాల రూపంలో గత సంవత్సరం పాటు ఆదియోగి కంఠాన్ని అలంకరించి ఉన్నాయి. ఈశా యోగా కేంద్రంలో జరిగే పవిత్ర మహాశివరాత్రి ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు ఈ మాలలో నుండి ఒక రుద్రాక్షను ప్రసాదంగా అందజేస్తారు

Sarpa Sutra

సర్ప సూత్ర

మహాశివరాత్రి నాడు ఈశా యోగా కేంద్రంలో జరిగే ఉత్సవాలకు వచ్చిన భక్తులకు ఒక సర్ప సూత్ర ఇవ్వడం జరుగుతుంది. రాగితో తయారుచేసిన ఈ సూత్రాన్ని ఎడమ ఉంగరం వేలికి పెట్టుకోవాలి. ఇది శ్రేయస్సును, సమతుల్యతను తెచ్చేందుకు సహాయపడుతుంది

Bhairavi Maha Yatra

భైరవి మహా యాత్ర

మహాశివరాత్రి నాడు లింగ భైరవి ఉత్సవ మూర్తిని, లింగభైరవి స్థానం నుండి ఆదియోగికి వద్దకు ఉరేగింపుగా తీసుకుని వెళతారు. ఈ ఉత్సాహభారితమైన మహా యాత్రలో మీరూ పాల్గొనండి. పారవశ్యంతో దేవీ అనుగ్రహంలో ఓలలాడండి.

Adiyogi Pradakshina

ఆదియోగి ప్రదక్షిణ

ప్రదక్షిణ అంటే శక్తిని గ్రహించేందుకు ఎదైనా శక్తిస్థానం చుట్టూ సవ్య దిశలో తిరగే ప్రక్రియ. ఆదియోగి అనుగ్రహానికి పాత్రులమయ్యేందుకు మనం ఆదియోగి ప్రదక్షిణను చేయవచ్చు. మోక్షసాధన కోసం కృషి చేసేవారికి ఇది తోడ్పడుతుంది.

ఈశా యోగా కేంద్రంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవంలో ఉచితంగా పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమానికి మీరు అందించే విరాళం, ఈ రాత్రి అందించే అవకాశాన్ని ప్రపంచమంతటా ఎన్నో లక్షలాది మందికి అందించేందుకు మాకు సహాయపడుతుంది.

సామాన్యంగా వచ్చే ప్రశ్నలు

మరింత సమాచారం కోసం:

ఫోన్: 83000 83111

ఈ-మెయిల్: