సామాన్యంగా వచ్చే ప్రశ్నలు

రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ప్రశ్నలు

నేను ఈ కార్యక్రమానికి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లోకల్ సెంటర్ లోనా,ఆన్ లైన్ లోనా?

మీరు లోకల్ సెంటర్ లోనైనా,ఆన్ లైన్ లోనైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు: మీరుమహాశివరాత్రి పేజీ వెళ్ళి ‘ATTEND IN PERSON’’ లోకి వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. మీకేమైనా ప్రశ్నలు ఉంటే, మీ ప్రశ్నని అడగండి, 4-7 రోజులలో ఒక వాలంటీరు సీటింగ్ వివరాల గురించి మీతో ఫోన్ లో మాట్లాడతారు. గమనిక: ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు రిజిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నిచడం వల్ల, పైన తెలిపిన సమయం లోపల మీకు ఫోన్ రాకపోతే, మీరు మీ ప్రాంత రిజిస్ట్రేషన్ పాయింట్ కు ఫోన్ చేస్తే మీకు లోకల్ సెంటర్ వివరాలు ఇస్తారు. మీరు మీకు కావలసిన కేటగిరీ ఏమిటో మీ ఈ మైల్ లో తెలియపరిస్తే, మీకు 24-48 గంటల్లో‘please complete your donation’. డొనేషన్ లింక్ పంపిస్తాము. దయచేసి మీ స్పామ్ ఫోల్డర్ చూడండి. డొనేషన్ లింక్ 30 రోజులు పనిచేస్తుంది.


ఫొటో ఐడి కార్డ్ తేవాలా?

అవును, మీరు మహాశివరాత్రి సీటింగ్ పాస్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడువాడిన గవర్నమెంట్ ఫొటో ఐడెంటిటీ కార్డు తీసుకురండి. విదేశీ యాత్రీకులకు పాస్ పోర్ట్, వీసా తీసుకురావాలి.


కార్యక్రమ స్థలానికి నేను ఎన్నిగంటలకు రావాలి?

కార్యక్రమం రోజు రిజిస్ట్రేషన్ చేసినవారికి చెక్ ఇన్ కౌంటరు మధ్యాహ్నం 12 గం తెరవబడుతుంది. టాయిలెట్స్, రిఫ్రెష్మెంట్ సదుపాయాలు కార్యక్రమ స్థలంలో ఉంటాయి, మీకు వచ్చిన ఈ-మైల్ ప్రింట్ ఔట్ తీసుకురండి.


నాకు తమిళ భాష రాదు, నేను కార్యక్రమంలో పాల్గొనవచ్చా?

మహాశివరాత్రి ఇంగ్లీషు, తమిళ భాషల్లో జరపబడుతుంది. హిందీ, మాండరీన్ అనువాదాలు ఉంటాయి.


డయాబెటిస్, హృదయ సంబంధిత వ్యాధులు, హెర్నియాతో ఉన్నవారు పాల్గొనవచ్చా?

పాల్గొనవచ్చు, మీతో మీ మందులు తెచ్చుకోండి.


నేను నేలమీద కూర్చోలేను

కార్యక్రమం జరుగుతున్నంత సేపూ కుర్చీలో కూర్చోవచ్చు.


మా పిల్లలను తీసుకురావచ్చా? పాల్గొనడానికి కనీస వయస్సు ఎంత?

మహాశివరాత్రి సమయంలో చిన్న పిల్లలు లేదా పసిపిల్లలను చూసుకోవడానికి మా దగ్గర సౌలభ్యాలు లేవు. మీరు కార్యక్రమానికి వచ్చేటప్పుడు వారిని చూసుకోవడానికి ఇంటిదగ్గరే ఏదైనా సదుపాయం చూసుకోమని మా ప్రార్థన. కార్యక్రమంలో పాల్గొనడానికి కనీసం 10 సంవత్సరాల వయస్సు ఉండాలి. మీరు కోయంబత్తూరులో ఉండి కుటుంబంతో సహా కార్యక్రమానికి రావాలంటే రావచ్చు.


నేను మహాశివరాత్రి కార్యక్రమ స్థలానికి వచ్చి సీటింగ్ పాస్ కోసం విరాళం ఇవ్వవచ్చా?

కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి, మీరు కనీసం 15 రోజుల ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది, అలా చేస్తే మీకు ఆశాభం ఉండదు. సీట్ల లభ్యతను బట్టి ఆ రోజు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది.


నా రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యిందని నాకు ఎలా తెలుస్తుంది?

మీరు విరాళం ఇచ్చిన తరువాత ఒక్కరోజులోపలే మీకు రిసీట్, మీ రిజిస్ట్రేషన్ నంబరుతో సహా మీకు ఈ మైల్ వస్తుంది. కార్యక్రమానికి ముందు మీకు ఈ మైల్ లో ఈ-పాస్ వస్తుంది.


నేను ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం చేయలేదు. నేను మహాశివరాత్రి కార్యక్రమంలో పాల్గొనవచ్చా?

పాల్గొనవచ్చు, మహాశివరాత్రి కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చు.


ఒక్క సీటింగ్ పాస్ తో ఎంతమంది పాల్గొనవచ్చు?

అన్ని విభాగాల్లోనూ, ఒక్కొక్కరికీ ఒక్కొక్క సీటింగ్ పాస్. సీటింగ్ పాస్ లు ఒకరరినుంచి మరొకరికి మార్పిడి చేయకూడదు.


నేను కార్యక్రమంలో పాల్గొనడానికి మరొకరు విరాళం ఇవ్వవచ్చా?

చేయవచ్చు, విరాళం ఎవ్వరైనా ఇవ్వవచ్చు. అందుకు రసీదు, విరాళం ఇచ్చి వారి పేరు మీద వస్తుంది. మీరు విరాళాన్ని భాగాలుగా చేయకూడదు.


నేను ప్రోగ్రాము ముందు కొంత విరాళం, తరువాత మిగతాదీ ఇవ్వవచ్చా?

లేదు


కార్యక్రమస్థలానికి నా వాహనం తీసుకురావచ్చా?

పార్కింగ్ కు మితమైన స్థలమే ఉంది. మీ వాహనాలకు మీరే జవాబుదారీ, కార్యక్రమం నిర్వహించేవారికి ఏ బాధ్యతా ఉండదు.


పాల్గొనటానికి సంబంధించిన ప్రశ్నలు

నేను గర్భంతో ఉన్నా, నెలసరితో ఉన్నా ఈ ప్రక్రియలో పాల్గొనవచ్చా?

మీరు పాల్గొనవచ్చు.


కార్యక్రమంలో పాల్గొనడానికి ఏ విధమైన వస్త్రధారణ చేయాలి?

సాంప్రదాయ వస్త్రాలు ఉత్తమం. ఆశ్రమంలో ఉన్నప్పుడు నిరాడంబర వస్త్రధారణ చేయండి. మగవారు, ఆడవారు భుజాలు, మోచేయి దాకా, కాలి మడమల వరకు, నడుము కప్పే వస్త్రధారణ చేయాలి. పాశ్చాత్య వస్త్రధారణ అయితే మగవారు, ఆడవారు మడమలదాకా ఉన్న పాంట్లు(కురచ లాగూలు వేసుకోరాదు), మోచేతుల దాకా కప్పే చొక్కాలు వేసుకోవాలి. మీ సౌఖ్యం కోసం, ఇక్కడి సంస్కృతిని గౌరవిస్తూ వంటిని అట్టిపెట్టుకుని ఉండే వస్త్రాలు ధరించకండి. యక్ష ఇంకా మహాశివరాత్రి సమయాల్లో భారతీయ సాంప్రదాయ వస్త్రాలు ధరించమని ప్రోత్సాహిస్తాము.


రాత్రి సమయాల్లో వెచ్చగా ఉండే వస్త్రాలు, ఒక దుప్పటి మీతో ఉంచుకోండి.

డిసెంబర్ నుంచి మార్చి వరకు ఆశ్రమంలో రాత్రిళ్ళు కాస్త చల్లగానూ, పగళ్ళు వెచ్చగానూ ఉంటాయి. కనీస ఉష్ణోగ్రత 17°C (62.6°F) గరిష్ట ఉష్ణోగ్రత 35°C (95°F) దాకా ఉండవచ్చు.


బట్టలు ఉతుక్కోవడానికి అవకాశం ఉందా?

ఈశాయోగా కేంద్రంలో నీటి ఎద్దడి ఉన్నందవల్ల, బట్టలు ఉతుక్కోవడం సాధ్యం కాదు. లాండ్రీ సదుపాయం కూడా లేదు. కార్యక్రమం పూర్తయ్యేవరకు కావలసిన బట్టలు తెచ్చుకోండి.


కోయంబత్తూరు వచ్చాక ఈశాయోగా కేంద్రానికి ఎలా చేరుకోవాలి?

కోయంబత్తూరు నుంచి ఈశాయోగా కేంద్రానికి టాక్సీలు, బస్సులు ఉంటాయి. గాంధీపురం టౌన్ బస్ స్టాండు నుంచి ఈశాయోగా కేంద్రానికి 14D, 14G బస్సులు ఉన్నాయి, ఉదయం 5.30 నుంచి ప్రతి అరగంటకు ఒక బస్ ఉంటుంది. ఈశా ట్రావెల్ ఫోన్:9442615436, 0422-2515430

  • టాక్సి: 0422-40506070, ఎయిర్ పోర్టు ప్రీ పైడ్: 99764 94000,
  • ఫాస్ట్ ట్రాక్ టాక్సి: 0422-2200000 (ఛార్జెస్ ముందుగానే తెలుసుకోండి).
  • ఓలా, ఊబెర్ మొబైల్ ఆప్స్.

మహాశివరాత్రి కార్యక్రమంలో పాల్గోడానికి ఏమన్నా విధి విధానాలు ఉన్నాయా?

లేవు, 10 సంవత్సరాలు వయస్సు పైనున్న వారు సామాన్య ఆరోగ్యంతో ఉంటే చాలు.


ఫోను వాడవచ్చా?

కార్యక్రమ స్వభావాన్ని బట్టి, దాని నుంచి మీరు సంపూర్ణంగా లభ్యి పొందడానికి, మీరు ప్రోగ్రాం సమయంలో ఫోన్ వాడకాన్ని వీలైనంత తగ్గించడం ఉత్తమం. గమనిక: మొబైల్ ఫోన్ ఛార్జంగ్ సదుపాయం ఉండదు.


కార్యక్రమ సమయంలో మేము ఏ రకమైన ఆహారం తెచ్చుకోవాలి?

కార్యక్రమంలో పాల్గొనేవారి అందరికీ మహా అన్నదానం జరుగుతుంది. మీ ఆరోగ్య రీత్యా, మీరు మీ ఆహారం తెచ్చుకోవాలనుకుంటే, శాకాహార భోజనం తెచ్చుకోవచ్చు.


నేనేమైనా యోగా మాట్ తెచ్చుకోవాలా?

అఖ్కర లేదు.


కార్యక్రమం సమయాలు తెలియపరచగలరా?

కార్యక్రమం సాయంత్రం 6-గం ప్రారంభమౌతుంది. దయచేసి 5గం కల్లా మీ సీటులో కూర్చోండి. దేవి ఊరేగింపు 7 గం ప్రాంతంలో ప్రారంభమౌతుంది.


కార్యక్రమం సమయంలో కాని, ఆ తరువాత గాని సద్గురుతో సంభాషించవచ్చా?

సద్గురు పూర్తిగా కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు, అందువల్ల వీలుకాదు. మీరు పూర్తిగా కార్యక్రమ ప్రక్రియలో నిమగ్నం కండి, మీరు పూర్తిగా సూచనలు పాటించడం ద్వారా కార్యక్రమం నిర్వహించడంలో సహకరించండి. ఆయన కార్యక్రమ సమయంలో మనల్ని గైడ్ చేస్తుంటారు, మనం అందుకు సహకరిద్దాం.


కార్యక్రమానికి సంబంధించిన ప్రశ్నలు

ఆదియోగి ప్రదిక్షణ గురించి నేను మరింత సమాచారం పొందవచ్చా?

ప్రదక్షిణం అంటే ఒక గొప్ప మూల శక్తిని గ్రహించగలగడానికి మనం దాని చుట్టూ సవ్యదిశలో తిరిగే ప్రక్రియ. ఈశా యోగా కేంద్రం భూమి ఉత్తరాంశంలో 11‘డిగ్రీల అక్షాంశం దగ్గర ఉన్నందున ఇది మరింత ప్రబలంగా ఉంటుంది. ఈ ఆదియోగి ప్రదిక్షణ సద్గురుచే రూపకల్పన చేయబడింది. ఇది ఆదియోగి అనుగ్రహానికి పాత్రులవ్వడానికి అనువుగా మార్చి, ముక్తి దిశగా వారు కృషిచేసేందుకు త్వరితం చేస్తుంది. ఇది అందరికీ అందుబాటులో ఉంచబడింది. ప్రదక్షణ సమయాలు: 4 మార్చి 2019, ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఇంకా 2019 మార్చ్ 5న ఉదయం 6 నుంచి ప్రారంభం.


ఈ ప్రోగ్రాం కాల వ్యవధి ఏమిటి?

మూడు రోజుల యక్ష కార్యక్రమాల తరువాత మహాశివరాత్రి కార్యక్రమం రాత్రంతా జరగనుంది. మార్చి 1 – 3: యక్ష (సాయంత్రం 6 నుండి రాత్రి 8 వరకు) మార్చి 4: మహాశివరాత్రి (సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు)


సీటింగ్ పాస్ తో కాకుండా అన్నదానం, లేక ఇతర విరాళాలు ఇవ్వడానికి అవకాశం ఉందా?

ఉంది, మీరు విరాళంఇక్కడ ఇవ్వవచ్చు. గమనిక: ఈ లింక్ ద్వారా చేసిన విరాళం మీ సీటింగ్ పాస్ కు గాని, కాటేజి బుకింగ్ కు గాని వేరే ఏ ఇతర ఉద్దేశానికి ఉపయోగించకూడదు.


నేను చేసే విరాళాన్ని సగం విదేశీ ఎకౌంట్ ద్వారానూ, సగం భారతదేశ ఎకౌంట్ ద్వారానూ చేయవచ్చా?

చేయవచ్చు, మామూలు విరాళం అలా చేయవచ్చు, మీరు భారతీయ ఖాతానుండి విరాళం ఇస్తున్నప్పుడు, మీరు భారతీయ మొబైల్ నం, ఇక్కడి అడ్రస్, PAN నం ఇవ్వవలసి ఉంటుంది. మీరు విదేశీ ఖాతానుండి విరాళం ఇస్తున్నప్పుడు, మీరు విదేశీ మొబైల్ నం, విదేశీ అడ్రస్, పాస్ పోర్టు కాపీ ఇవ్వవలసి ఉంటుంది. సీటింగ్ పాస్ విషయంలో చేసే విరాళం జాతీయత లేక నివాసం ఆధారంగా దానినికి తగిన స్వదేశి లేదా విదేశీ బ్యాంక్ ఎకౌంట్ నుంచి చేయాలి.


గర్భిణులు మహాశివరాత్రి సాధన చేయవచ్చా?

మంత్ర పఠనం చేయవచ్చు.


పాల్గొనేవారు మార్చ్ 01 – 03 వరకు సాయంత్రాలు జరిగే యక్ష కార్యక్రమాల్లో పాల్గొనవచ్చా?

పాల్గొనవచ్చు


నేను మహాశివరాత్రి కార్యక్రమంలో వాలంటీరింగ్ చేద్దామనుకుంటున్నాను, దయచేసి రిజిస్టర్ చేయడానికి లింక్ పంపగలరా?

ఈశాయోగా కేంద్రంలో ప్రతి మహాశివరాత్రి ప్రత్యేకమైనదే. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది TV ల్లోనూ, వెబ్ స్ట్రీమ్ ద్వారానూ చూస్తారు, ఇంకా కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొంటారు. ఈశాయోగా కేంద్రంలోనూ, మహాశివరాత్రి జరిగే ప్రదేశంలోనూ జరిగే గొప్ప ముందస్తు తయారీలో పాల్గోనగలగడం, వచ్చే స్వదేశ, విదేశీయులను ఆహ్వానించి, వారికి కావలసిన సహాయం అదించడగలగడం ఒక వరం. క్రియాశీలంగా మీకు మీరు సమర్పించుకోవడం కూడా, ఈ శక్తివంతమైన ప్రక్రియలో మీ గ్రాహ్యతను పెంచే విధానం. వాలంటీర్ రిజిస్ట్రేషన్ త్వరలో ప్రకటించబడుతుంది. వాలంటీర్ లింక్


మహాశివరాత్రి సాధన గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఉంది.

మహాశివరాత్రి సాధన ఎన్నో అవకాశాలను అందించే మహాశివరాత్రికి ముందస్తు తయారీ. ఈ సాధన ఎనిమిది ఏళ్లు దాటిన వారెవరైనా చేయవచ్చు, ఈ సాధనని 2019 మర్చి 4 న వచ్చే మహాశివరాత్రికి ముందు 40,21,14, 7 లేక 3 రోజుల ముందు ప్రారంభం చేయవచ్చు.. ఈ సాధన ఉద్యాపన ధ్యానలింగం దగ్గర (లేక మీ ఇంటి దగ్గర) చేయవచ్చు. మరింత సమాచారం కొరకు ఈ .లింక్ చూడండి మీరు మంత్ర పఠనాన్ని, శివనమస్కారాన్ని ఈ వీడియోలో చూడవచ్చు


యక్ష అంటే ఏమిటి?/h3>
మహాశివరాత్రికి ముందు జరిగే అద్భుతమైన సంగీత, నృత్య కార్యక్రమం. యక్ష కార్యక్రమం 2019 మార్చ్ 1 నుండి 3 వరకు ఈశాయోగా కేంద్రంలో జరుగుతుంది. భారతీయ కళల ప్రత్యేకతను, వైవిధ్యాన్ని సంరక్షించి వాటిని ప్రచారంలోకి తీసుకు రావడంకోసం ప్రఖ్యాత కళాకారులు ప్రదర్శించే సంగీత, నృత్య ప్రదర్శనలను మూడురోజుల యక్ష కార్యక్రమం ఈశా ఫౌండేషన్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. విశిష్టమైన భారత ప్రాచీన సంస్కృతిని ఆస్వాదించడానికి మిమ్మల్ని మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాము

సాధనకు సంబంధించిన ప్రశ్నలు.

సుఖాసనంలో కూర్చుని స్తుతి చేస్తున్నప్పుడు చేతులు/ అరచేతులు ఎలా ఉంచుకోవాలి?

సద్గురు చేతుల ఎలా పెట్టాలో ఏ విధమైన సూచనా ఇవ్వలేదు. మీకు సౌఖ్యంగా ఉండేలా మీరు చేతులని ఎలాగైనా పెట్టుకోవచ్చు.


తెల్లవి లేక లేత రంగు బట్టలు ఉద్యాపన రోజున మాత్రం వేసుకుంటే చాలా లేక సాధన కాలం అంతా అలాంటివే వేసుకోవాలా?

సాధన కాలం అంతా అలాంటివే వేసుకోవాలి.


నేను స్నానం చేసేటప్పుడు లేక సముద్ర స్నానం చేస్తున్నప్పుడు చేతికి కట్టుకున్న నల్ల వస్త్రం తీయవచ్చా?

సాధనా కాలంలో ఏ కారణం గానూ ఆ నల్ల గుడ్డను తీయకూడదు.


విభూతి దొరక్కపోతే వేరే ఏదైనా పెట్టుకోవచ్చా లేక ఏమీ పెట్టుకోకుండా ఉండడమే ఉత్తమమా?

విభూతి మాత్రమే పెట్టుకోండి. అదికూడా ఈశా నుంచి తెప్పించుకున్నదే, ఎందుకంటే అది నమ్మకమైంది, శక్తివంతం చేసింది.


నాకు వేప లేక బిల్వ పత్రాలు దొరకవు, వాటిని ఆర్డర్ చేయడం, రాత్రి నాన బెట్టడం కూడా వీలుకాదు. నేను వేరే ఏమైనా వాడవచ్చా?(యూరోప్ లో మాకు బే ఆకులు దొరుకుతాయి) లేక ఈ విషయాన్ని వదిలేయమంటారా? ఉద్యాపన రోజున వేపాకుల బదులు ధ్యానలింగానికి ఏ ఆకులు అర్పించమంటారు?

వేప, బిల్వ పత్రాలు ప్రపంచంలో అన్ని చోట్లా ఇండియన్ స్టోర్సులో దొరుకుతుంటాయి. అవి దొరక్కపోతే మీరు ఆన్ లైన్ లో వేప పొడి తెప్పించుకోవచ్చు. దానిని చిన్న ఉండలు చేసి తీసుకోవచ్చు. అవి రెండూ దొరక్కపోతే ఉద్యాపనలో ఆ విషయాన్ని వదిలివేయవచ్చు.


నేను ఉదయం చేయవలసిన శివనస్కారం, స్తుతి ప్రాక్టీసుల మధ్యలో చేయాలా, లేక ముందు, వెనక చేయాలా?

వరుస క్రమం అంటూ ఏమీ లేదు. కాని శివనమస్కారాన్ని సూర్యోదయానికి ముందుగాని, సూర్యాస్తమయం తరువాత గాని చేయాలి.


మహాశివరాత్రి సాధన చేసేటప్పుడు సూచనలేమిటి?

సూచనలు. మీరు 8 నుంచి 10 మిరయాల గింజలు, రెండు మూడు బిల్వ లేక వేప ఆకులు తేనెలోనూ, గుప్పెడు వేరుశెనగ పప్పులు నీళ్లలోను, ఆ ముందురోజు రాత్రి నాన బెట్టాలి. ఉదయం శివనమస్కారం, స్తుతి అయిన తరువాత ఆకులు నమిలివేయాలి, మిరియాలను తేనె కాస్త నిమ్మరసంతో కలిపి తినేయండి. వేరుశనగ పప్పులు కూడా తినండి. మీకు వేప, బిల్వ ఆకులు దొరక్క పోతే, వేప పొడి IshaShoppe.com లో దొరుకుతుంది. మీరు వీటిని తీసుకునేముందే శాంభవీ మహాముద్ర, రోజువారి సాధనలు పూర్తి చేయండి.


ఉదయం, సాయంత్రం సాధనల అనంతరం మీరు దీపాన్ని (మైనపు వత్తిని)ఊదివేయాలా? లేక అలా వెలగనివ్వాలా? సాధనలకు ముందే ఈ దీపాన్ని వెలిగించాలా?

సాధనను ఆరంభించేముందు దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని అలా వెలగనివ్వడం ఉత్తమం. మీరు పెద్ద మైనం వత్తి వాడితే అలా వదిలేయడం ప్రమాదంగా భావిస్తే, మీరు సాధన తరువాత ఒక పువ్వుతోనే, చేతితోనో గాలి విసిరి ఆర్పివేయండి, ఊది వేయవద్దు.


సాధన సమయంలో నల్ల బట్టను ఎప్పుడు వేసుకోవాలి, స్తుతి సమయంలోనా, సాధన సమయంలోనా, శివనమస్కారం సమయంలోనా?
మీరు నల్లగుడ్డను సాధన సమయం అంతా(40, 21, 14, 7 లేక 3 రోజులు) వేసుకోవాలి, ఆ సమయంలో మీరు ఆ గుడ్డతీయగూడదు.


స్నానానికి ఏ రకమైన హెర్బల్ పౌడర్ వాడాలి?

ఈశా కేంద్రంలో దొరికే స్నానం పౌడర్ వాడవచ్చు. అది మీకు దొరక్క పోతే మీరు ఏ కెమికల్స్ లేకుండా ఉన్న ఏ ఆర్గానిక్ పౌడరైనా వాడవచ్చు.


విభూతిని ఇంట్లో తయారుచేయడం ఎలా? అది చేయడానికి కావలసిన వస్తువులు ఏమిటి? దానిని ఎప్పుడు పెట్టుకోవాలి సాధన ముందా, తరువాతా? దానిని రోజంతా అలానే ఉంచుకోవాలా?

సాధన మొదలు పెట్టేముందు పెట్టుకోండి, తరువాత దానిని అలాగే వదిలేయండి. మీరు ఇంట్లో విభూతిని తయారు చేయలేరు, దానిని నమ్మకమైన చోటునుండి తెప్పించుకోండి. మీరు ఈశా యోగా కేంద్రం నుంచి తెప్పించుకున్నదైతే మంచిది, అది శక్తిమంతం చేసింది కూడా.


నేను ఫిబ్రవరి 19న ఆశ్రమానికి వస్తున్నాను. మహాశివరాత్రి సాధన లో ఉన్నప్పుడు భోజనం మద్యాహ్నం 12 తరువాత చెయ్యాలి కాబట్టి, మరి ఆ సమయంలో భోజనం దొరుకుతుందా? మరి మిరియాలు, వేరుశనగ పప్పులు లాంటివి తెచ్చుకోవాలా?

సాధన చేసేవారికి మద్యాహ్నం 12 తరువాత భోజనం దొరుకుతుంది. మిరియాలు, వేరుశనగ పప్పులు, నిమ్మకాయలు లాంటివి మాత్రం మీరు ఏర్పాటు చేసుకోవాలి.


నల్ల బట్టను కట్టుకోకుండా జేబులో పెట్టుకోవచ్చా?

నల్ల బట్టను చేతికి కట్టుకోవాలి.


సాధన ఒక రోజు చేయలేక పోతే, మర్నాడు మళ్ళీ మొదలు పెట్టవచ్చా?

మీరు మహాశివరాత్రి సాధన చేయాలని సంకల్పించినప్పుడు, ప్రతిరోజూ సాధన చేయాలన్న నిబద్ధత అవసరం. అలాంటి నిబద్ధత మీకు ఉంటే, అది చేయడానికి మార్గం మీకు దొరుకుతుంది. మీరు సూర్యోదయానికి ముందే సాధన పూర్తి చేసుకోవచ్చు, అందువల్ల మీరు ముందుగానే లేచి మీ దిన చర్య మొదలు కాకముందే మీ సాధన పూర్తి చేసుకోండి. ఈ సాధన చాలా శక్తివంతమైనది, మీ జీవితాన్ని పరిణామం చేసే శక్తి దానికి ఉంది, అందువల్ల దానిని ఎలా చేయాలో మీరే చూడండి.


జాగరణ చేయడం తప్పనిసరా? నేను మధ్యలో నిద్రపోతే ఏమౌతుంది? నేను మనీలా(ఫిలిప్పీన్స్) లో ఉన్నాను, మాకు 2.5 గంటల టైమ్ డిఫరెస్స్ ఉంది.

రాత్రి జాగరణ చేయడం అనేది సాధనలో భాగం. మీరు చేసిన 40 రోజుల సాధనాఫలం అందుకునే సమయం ఇది, అందువల్ల దానినుంచి పూర్తి ఫలితం పొందండి. చన్నీటి స్నానం, తల తడిగా ఉంచుకోవడం, వాకింగ్ కు వెళ్లడం ఇలా మీరు మేలుకుని ఉండడానికి ఏవి ఉపకరిస్తాయో వాటన్నింటినీ ఉపయోగించుకోండి. మీ ప్రాంతంలో ఈ ఉత్సవాలు జరుగుతుంటే అక్కడకు వెళ్లండి. మీరు ఈశా లైవ్ వెబ్ స్ట్రీమ్ కూడా చూడవచ్చు.


మహాశివరాత్రి సాధన, శివాంగ సాధన రెండూ చేయవచ్చా?

చేయవచ్చు, సద్గురు ఈ మహాశివరాత్రికి ఈ క్రింది సాధనలు ఇచ్చారు: 1. .శివాంగ సాధన మగవారికి ఇది వెల్లంగిరి పర్వతాలకు ట్రెక్ తో సమాప్తమౌతుంది. వివరాలకు: Shivanga Sadhana and Initiation Schedule 2. మహాశివరాత్రి సాధన (ఆడవారికి, మగవారికి) 40/21/12/7/3 రోజుల సాధన. సమాపనం ధ్యానలింగ దగ్గర (లేక అవసరాన్నిబట్టి ఇంటి దగ్గర). మరిన్ని వివరాలకు చూడండి: Mahashivratri Sadhana Instructions & Guidelines


వాలంటీరింగ్ కు సంబంధించిన ప్రశ్నలు

మహాశివరాత్రి 2019 కు వాలంటీరుగా నేను ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?

మీరు ఈ ఫారం పూర్తిచేసి రిజిస్టర్ చేసుకోండి: click here

శాంభవి మహాముద్ర క్రియలోకి ఉపదేశం పొందిన వారు మాత్రమే వాలంటీరింగ్ చేయగలరు. వాలంటీర్లు అందరూ కనీసం వారం ముందుగానే రమ్మని కోరుతున్నాము, అంటే 25 Feb.


ఫొటో ID తీసుకురావాలా?

భారతీయులైతే, మీ పాస్ పోర్ట్, వోటర్ ID, డ్రైవర్ లైసెన్స్, లేక ఆధార్ కార్డు తేవాలి.

గమనిక: మీరు రిజిస్ట్రేషన్ సమయంలో వాడిన ఫొటో ID మాత్రమే తీసుకురావాలి.


నేను 3 రోజులు ముందు వస్తే వాలంటీరింగ్ చేయవచ్చా?

మహాశివరాత్రికి వచ్చిన వారందరికీ వాలంటీరింగ్ అవకాశాలు ఉంటాయి. ఇంత పెద్ద కార్యక్రమం వాలంటీర్ల అంకితభావం లేకుండా జరగదు. కాని ఈశాయోగా కేంద్రంలో ఉన్న పరిమితమైన వసతుల వల్ల, డోర్మెటరీ వసతి సదుపాయాలు మార్చ్ 1 తరువాత వచ్చినవారికి మేము అందించలేక పోతున్నాము.


వాలంటీర్లు ఎక్కడ బస చేస్తారు?

వాలంటీర్లందరూ ఆశ్రమంలో తాత్కాలికంగా నిర్మించబడిన డోర్మెటరీలో బస చేస్తారు. అందువల్ల వాలంటీర్లందరకూ అందుకు తగిన విధంగా సిద్ధమై రమ్మని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ పత్రంలోని 7 వ ప్రశ్నలో ఇచ్చిన విధంగా తయారై రమ్మని విజ్ఞప్తి చేస్తున్నాము. మహాశివరాత్రి, ఆ రాత్రి ఆధ్యాత్మిక అవకాశం అందరికీ అందించడం కోసం, వ్యక్తిగత సదుపాయాలు తక్కువగా ఉన్నా సర్దుకోవలసిన అవసరం ఉంది కాబట్టి దానికి మీ అవగాహన కోరుతున్నాము.


మాకు పరుపులు ఇస్తారా?

వాలంటీర్లకు ఆశ్రమం బెడ్డింగ్ అందించలేదు, వాలంటీర్లందరకూ యోగా మాట్, పరుపు, దుప్పట్లు, తలగడ మిగతా బెడ్డింగ్ సామాన్లు తెచ్చుకోమని అబ్యర్ధిస్తున్నాము. మార్చ్ లో రాత్రుళ్ళు చల్లగానూ, పగలు కాస్త వేడిగానూ ఉంటాయి. ఉష్ణోగ్రతలు షుమారు కనిష్టం 17°C (62.6°F) ఇంకా గరిష్టం 35°C (95°F). ఉంటాయి. రాత్రిళ్లు కావలసిన వెచ్చని దుప్పట్లు లాంటివి తెచ్చుకోండి.


వచ్చేటప్పుడు ఏమి తీసుకురావాలి?

గమనిక: కుటుంబంలో వారు కలసి వచ్చినా వారు తమ టాయిలెట్ సామాన్లు విడివిడిగా తెచ్చుకోవాలి, ఎందుకంటే వారికి బస వేరు వేరు చోట్ల ఇవ్వవచ్చు.

  • కాలకృత్యాలకు సోప్, పేస్ట్ లాంటివి
  • టార్చ్ లైట్
  • గొడుగు
  • దోమలు కుట్టకుండా క్రీము
  • అవసరం మేరకు వస్త్రాలు
  • శాలువ, స్వెట్టర్ లాంటివి
  • మందులు (మీరు వాడుతున్నవి) ఇంకా జ్వరానికి, జలుబుకు, నొప్పులకు, కడుపుకు సంబంధించిన వ్యాధులకు
  • పవర్ బాంక్
  • యోగా మాట్
  • ఉంటే) స్లీపింగ్ బాగ్
  • వాటర్ బాటిల్
  • ఎండకు టోపీలు వంటివి

కేంద్రలో భద్రతా వ్యవస్థ ఎలా ఉంది?

ఈశాయోగా కేంద్రం చాలా భద్రమైన, సురక్షితమైన ప్రదేశం. భద్రతా సిబ్బంది 24గం ఉంటారు, అయినా మీ సామాన్ల గురించి, మీరు మరింత శ్రద్ధ తీసుకోవాలని ప్రార్థిస్తున్నాము. మీరు ఇతరులతో కలసి ఉంటారు కాబట్టి, మీరు విలువైన వస్తువులు, నగలు, లాప్ టాప్ లు, ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవీ తేవద్దు. మీ సామాన్లు భద్రపరచుకోవడానికి మీ బ్యాగ్ లు భద్రతకోసం తళంవేసి ఉంచుకోండి.


మొబైల్ ఛార్జింగ్ అవకాశం ఉందా?

వసతి ప్రదేశంలో కొన్ని వసతులు ఉన్నాయి. మీ మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ చేసేటప్పుడు మీరు దగ్గరలోనే ఉండండి. మీరు మీ పవర్ బాంక్ తెచ్చుకోవడం మంచిది.


నేను ఎంత ముందుగా ఈశా కేంద్రానికి రావచ్చు, కార్యక్రమం అనంతరం ఎంత చివరగా వెళ్లవచ్చు? నేను ఇంకా ముందే వచ్చి ఇంకా లేటుగా వెళితే ఏమౌతుంది?

వాలంటీర్లు ఫిబ్రవరి 15 నుంచి రావచ్చు, మార్చ్ 6 వరకు ఉండవచ్చు. ఇంకా ముందే వచ్చి, లేటుగా వెళ్ళాలనుకుంటే 8300083111 కు ఫోన్ చేసి రిజిస్టరు చేసుకోండి. మీకు డోర్మెటరీ వసతి సమకూర్చడం కోసం ఇది ఉపయోగపడతుంది.


మహాశివరాత్రి సమయంలో వాలంటీర్లను ఎక్కడ కూర్చోబెడతారు? నేను ఏమన్నా సీటింగ్ పాస్ బుక్ చేసుకోవాలా?

మహాశివరాత్రి సమయంలో వాలంటీర్లను ప్రత్యేక స్థలంలో కూర్చోబెడతారు, మీరు ప్రత్యేకంగా సీటింగ్ పాస్ బుక్ చేసుకోనవసరం లేదు.


నేను వాలంటీరింగ్ కు రిజిస్టర్ చేసుకుని సీటింగ్ పాస్ కూడా తీసుకోవచ్చా? సీటు ఉన్నచోట నన్ను కూర్చోనిస్తారా?

మహాశివరాత్రి కార్యక్రమ నిర్వహణలో వాలంటీర్లు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తారు. వాలంటీర్లకు మేము వివిధ కార్యకలాపాలు అప్పగిస్తాము. మీరొకసారి వాలంటీరింగ్ చేద్దామని నిర్ణయించుకుంటే మీరు రాత్రంతా వాలంటీరుగానే ఉండమని మేము సూచిస్తాము. మిమ్మల్ని మీరు అర్పించుకోవడం ద్వారా ఈ కార్యక్రమ అనుభూతిని మీరు ఎంతో గాఢం చేసుకోగలరు. సీటింగ్ పాస్ తీసుకోవాలని ఇంకా మీరు కోరుకుంటే మీ ఏరియా కో ఆర్డినేటర్ ను సంప్రదించండి.


కార్యక్రమంలో ఏ రకమైన వస్త్రధారణ చేయాలి?

సంప్రదాయ వస్త్రధారణ చేయమని మేము ప్రోత్సహిస్తాము. సాంప్రదాయ వస్త్రాలు ఉత్తమం. ఆశ్రమంలో ఉన్నప్పుడు నిరాడంబర వస్త్రధారణ చేయండి. మగవారు, ఆడవారు భుజాలు, మోచేయి దాకా, మడమల దాకా కాళ్ళు, నడుము కప్పే వస్త్రధారణ చేయాలి. పాశ్చాత్య వస్త్రధారణ అయితే మగవారు, ఆడవారు మడమలదాకా ఉన్న పాంట్లు( కురచ లాగూలు వేసుకోరాదు), మోచేతుల దాకా కప్పే చొక్కాలు వేసుకోవాలి. మీ సౌఖ్యం కోసం, ఇక్కడి సంస్కృతికి గౌరవిస్తూ వంటిని అట్టిపెట్టుకుని ఉండే వస్త్రాలు ధరించకండి.. యక్ష ఇంకా మహాశివరాత్రి సమయాల్లో భారతీయ సాంప్రదాయ వస్త్రాలు ధరించమని ప్రోత్సాహిస్తాము.


బట్టలు ఉతుక్కోవడానికి అవకాశం ఉందా?

ఈశాయోగా కేంద్రంలో నీటి ఎద్దడి ఉన్నందవల్ల, బట్టలు ఉతుక్కోవడం సాధ్యంకాదు. లాండ్రీ సదుపాయం కూడా లేదు. కార్యక్రమం పూర్తయ్యేవరకు కావలసిన బట్టలు తెచ్చుకోండి.


నాకు తమిళ భాష రాదు. నేను వాలంటీరింగ్ చేయవచ్చా?

చేయవచ్చు.


<h3డయాబెటిస్, హృదయ, హెర్నియా సమస్యలు ఉన్నవారు వాలంటీరింగ్ చేయవచ్చా?

చేయవచ్చు, మీ మందులు తెచ్చుకోండి.


నా కుటుంబ సభ్యులను, అతిథులను నాతో తీసుకురావచ్చా?

శాంభవీ మహాముద్ర క్రియా దీక్ష తీసుకున్నవారే వాలంటీర్ వసతి గృహంలోకి అనుమతించబడతారు. మిగతా వారు మహాశివరాత్రికి రిజిస్టర్ చేసుకుని ఉత్సవాల్లో పాల్గొనవచ్చు


మా పిల్లలను తీసుకురావచ్చా? పాల్గొనడానికి కనీస వయస్సు ఎంత?

మహాశివరాత్రి సమయంలో చిన్న పిల్లలను, పసిపిల్లలను చూసుకోవడానికి మాదగ్గర సౌలభ్యాలు లేవు. మీరు కార్యక్రమానికి వచ్చేటప్పుడు వారిని చూసుకోవడానికి ఇంటిదగ్గరే ఏదైనా సదుపాయం చూచుకోమని మాప్రార్థన.


కార్యక్రమ స్థలానికి నా వాహనం తీసుకురావచ్చా?

పార్కింగ్ కు మితమైన స్థలమే ఉంది. మీ వాహనాన్ని కార్యక్రమ స్థలం సిద్ధంచేయడానికి సహాయంగా ఇవ్వదలచుకుంటే, అలా చేయవచ్చు.


తగినన్ని వైద్య సదుపాయాలు ఉన్నాయా?

ప్రథమ చికిత్స సదుపాయాలు ఉంటాయి, మామూలు ట్రాఫిక్ లో గంట దూరంలో ఆసుపత్రులు ఉన్నాయి. మహాశివరాత్రి సమయంలో ట్రాషిక్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఆసుపత్రికి చేరడానికి ఎక్కువ సమయం పడుతుంది. దగ్గరలో ఉన్నమందుల దుకాణాలు 8 కి.మీ దూరంలో ఉన్నాయి. మీరు మామూలుగా వాడుకునే మందులు మీతో ఉంచుకోండి.


సంప్రదాయ యోగా క్లాసులకు నేను రిజిస్టరు చేసుకుని మహాశివరాత్రికి వాలంటీరింగ్ చేయవచ్చా?

చేయవచ్చు, సంప్రదాయ యోగా క్లాసులకు మీరు రిజిస్టరు చేసుకుని మహాశివరాత్రికి వాలంటీరింగ్ చేయవచ్చు.


For additional questions, please call the helpline on +91 83000 83111, or email info@mahashivarathri.org.