కార్యక్రమ వివరాలు

మహాశివరాత్రి అనేది, సద్గురుచే గాఢమైన ధ్యానాలు ఇంకా ప్రఖ్యాత కళాకారులచే అద్భుతమైన సంగీత ప్రదర్శనలతో రాత్రంతా సాగే ఉత్సవం. ఈ సంవత్సరం ఈ వేడుకల్లో ఆన్‌లైన్‌లో పాల్గొనండి.

మహాశివరాత్రి నాటి పవిత్రమైన రాత్రి నుంచి అత్యంత ప్రయోజనాన్ని పోందడానికి, (మీ ప్రదేశంలో టైము ప్రకారం) సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు మెలకువగా ఉండి, వెన్నును నిటారుగా ఉంచడం మంచిది.

దిగువ ఉన్న కార్యక్రమాల సమయాలు, ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (IST) సమయాలు.

సాయంత్రం 6:10లకు

పంచ భూత క్రియ

ఇది మానవ వ్యవస్థలోని పంచ భూతాలను శుద్ధి చేసేందుకు ఒక శక్తివంతమైన ప్రక్రియ.

సాయంత్రం 6:40లకు

లింగ భైరవి మహా ఆరతి

ఇది లింగ భైరవి ఉత్సవ మూర్తి ఉత్సాహభరితమైన ఇంకా పారవశ్యమైన ఊరేగింపు, అలాగే దేవీ అనుగ్రహాన్ని పొంది ఆస్వాదించేందుకు ఒక అవకాశం.

రాత్రి 10:50లకు

సద్గురు మాటలు ఇంకా నడిరేయి ధ్యానం

సద్గురు మాట్లాడిన తరువాత నడిరేయి ధ్యానం ఉంటుంది, అప్పుడు సద్గురు, వేడుకలో పాల్గొనే వారందరికీ ఎంతో శక్తివంతమైన ధ్యానం లోకి దీక్ష ఇస్తారు..ఇదే ఈ రాత్రిన అందరూ ఎంతగానో ఎదురుచూసే అంశం.

అర్ధరాత్రి 12:15లకు

ఆదియోగి దివ్య దర్శనం

మానవ జాతికి ఆదియోగి చేసిన మేలుని ఇంకా అయన అందజేసిన విషయాలను చిత్రీకరించి చూపించే అద్భుతమైన లైట్ & సౌండ్ షో.

అర్ధరాత్రి 12:30 నుండి 2:15 వరకు

సద్గురు ప్రవచనం, ఇంకా ప్రశ్నోత్తరాలు, శంభో ధ్యానం

శంభో అనేది శివుని సున్నితమైన రూపం. “శంభో” అనే మంత్రం, జీవితంలో కొత్త పార్శ్వాలని తెరిచే అవకాశాన్ని అందిస్తుంది.

ఉదయం 3:35లకు

బ్రహ్మ ముహూర్తం చాంటింగ్

బ్రహ్మ ముహూర్తం, రాత్రి ఆఖరి పావు భాగంలో వస్తుంది. ఒకరు తమ భౌతిక స్వభావానికి అతీతంగా వెళ్ళాలని అనుకుంటున్నట్లితే, ఆధ్యాత్మిక సాధన చేయడానికి ఇది ఉత్తమ సమయం.

రాత్రి పొడుగునా సాగే ప్రదర్శనలు

ప్రసిద్ధ కళాకారులచే వరుసగా ఇవ్వబడే సంగీతం, నృత్యం ఇంకా సాంస్కృతిక ప్రదర్శనలు మిమ్మల్ని రాత్రంతా మెలుకువగా, ఇంకా ఉత్సాహంగా ఉంచుతాయి, కాబట్టి మీరు ఈ పవిత్రమైన రాత్రిలో ఉన్న అవకాశాల నుండి ప్రయోజనం పొందవచ్చు.

detail-seperator-icon