మహాశివరాత్రి సాధన

ఎన్నో ఆవశ్యకతలకు నిలయమైన మహాశివరాత్రికి – మహాశివాత్రి సాధన మిమ్మల్నిసిద్ధం చేస్తుంది. ఏడు సంవత్సరాలకు పైబడిన వారు ఎవరైనా సరే ఈ సాధనను చేయవచ్చు.

సాధన తారీఖులు:

The sadhana can be of varying duration. You can do the sadhana for 40, 21, 14, 7 or 3 consecutive days leading up to Mahashivratri, February 21, 2020.

 • 40 days: Jan 02 – Feb 21
 • 21 days: Feb 01 – Feb 21
 • 14 days: Feb 07 – Feb 21
 • 7 days: Feb 14 – Feb 21
 • 3 days: Feb 18 – Feb 21

మహాశివరాత్రి రోజున ఉద్యాపన చేయడం కుదరకపోతే, ఈ ప్రక్రియని వచ్చే అమావాస్య రోజున యోగా కేంద్రంలో ఉద్యాపన తప్పకుండా చెయ్యాలి.

ప్రతి రోజూ చేయాల్సిన సాధన:

ప్రతి రోజూ చేయాల్సిన సాధన ఈ విధంగా ఉంటుంది:

 • ఖాళీ కడుపుతో 12 సార్లు శివ నమస్కారం చేయాలి. ఆ తర్వాత ‘సర్వేభ్యో’ మంత్రాన్ని మూడు సార్లు స్తుతి చేయాలి. సూర్యోదయానికి ముందు లేక సూర్యాస్తమయం తర్వాత రోజుకు ఒక సారి చేయాలి.

సర్వేభ్యో మంత్రం:

ॐ సర్వేభ్యో దేవేభ్యో నమః
( పవిత్ర, దివ్య జీవులందరికీ మేము నమస్కరిస్తున్నాము)
ॐ పంచభూతాయ నమః
( ఈ పంచభూతాలకు నమస్కరిస్తున్నాము)
ॐ శ్రీ సద్గురవే నమః
(సద్గురువుకు నమస్కరిస్తున్నాము)
ॐ శ్రీ పృధ్వీయై నమః
(భూమాతకు నమస్కరిస్తున్నాము)
ॐ ఆది యోగీశ్వరాయ నమః
(యోగాకు మూలమైన వారికి నమస్కరిస్తున్నాము)
ॐ, ॐ, ॐ

 • 8-10 మిరియాల గింజలను 2-3 బిల్వం లేక వేప ఆకులతో కలిపి తేనెలోనూ, ఒక గుప్పెడు వేరుశెనగ పప్పుల్ని నీటిలోనూ రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే సాధన పూర్తి అయిన తర్వాత వీటిని స్వీకరించాలి.వేప లేక బిల్వ ఆకులు అందుబాటులో లేకపోతే వేప పొడితో చేసిన చిన్న ముద్దలు తీసుకోవచ్చు. వేప పొడి ఈశా షాప్ IshaShoppe.com IshaShoppe.com.లో అందుబాటులో ఉంది. మీరు రోజూ చేసే శాంభవి మహాముద్ర లాంటి సాధనలను ఇవి తినకముందే చేయాలి.
 • శివ నమస్కారం సాధన గురించి కొన్ని సూచనలు:
  • గర్భిణీ స్త్రీలు శివ నమస్కారం చేయకూడదు
  • ఋతుక్రమ సమయంలో స్త్రీలు శివ నమస్కారం చేయవచ్చు.
  • హెర్నియా సమస్య ఉన్న వారు శివ నమస్కరం చేయడానికి కుషన్ లేక కుర్చీని ఉపయోగించాలి.
 • ఒక నునే దీపాన్ని ఉదయం, సాయంత్రం వెలిగించండి. దీపం అందుబాటులో లేకపోతే ఒక కొవ్వొత్తి వెలిగించవచ్చు.
 • దీపం వెలిగించిన తర్వాత యోగ యోగ యోగేశ్వరాయ మంత్రాన్ని ఉదయం 12 సార్లు, సాయంత్రం 12 సార్లు స్తుతి చేయండి. 40 నిముషాల సంధ్యా కాల సమయంలో ఈ సాధన చేయటం ఉత్తమం. రెండు ముఖ్యమైన సంధ్యా కాలాలు సూర్యోదయం, సూర్యాస్తమయాలకు 20 నిముషాలు ముందు మొదలై 20 నిమిషాల తర్వాత ముగుస్తాయి.

యోగ యోగ యోగేశ్వరాయ మంత్రం:

యోగ యోగ యోగేశ్వరాయ
భూత భూత భూతేశ్వరాయ
కాల కాల కాలేశ్వరాయ
శివ శివ సర్వేశ్వరాయ
శంభో శంభో మహాదేవాయ

సాధన సూచనలు:

ఈ సాధన కాలం పూర్తయ్యేవరకు మీరు తప్పక గుర్తుంచుకోవలసిన విషయాలు.

 • రోజుకి రెండు సార్లు మాత్రమే ఆహారం తీసుకోండి. మొదటి భోజనం మధ్యాహ్నం 12:00 తర్వాత చేయాలి.
 • మీకు ఆకలిగా అనిపిస్తే మిరియాలు, తేనే, నిమ్మ రసం కలిపిన నీళ్ళను మళ్ళీ తాగవచ్చు.
 • సిగిరెట్ కాల్చటం, మద్యపానం చేయకోడదు. మాంసాహారం తినకూడదు.
 • ఒక నల్ల గుడ్డను కట్టుకోవాలి. మగవారు కుడిచేతి పైభాగంలో, స్త్రీలు ఎడమ చేతి పైభాగంలో కట్టుకోవాలి. ఎలాంటి నల్ల గుడ్డ అయినా ఫరవాలేదు. ఈ గుడ్డ 12 అంగుళాల పొడవు, 1 అంగుళం వెడల్పు ఉండాలి. సాధన చేసే వాళ్ళు ఈ గుడ్డను ఎక్కడైనా కొనుక్కోవచ్చు.
 • సాధనా కాలంలో తెల్లని లేక లేత రంగు బట్టలు మాత్రమే వేసుకోవాలి.
 • రోజుకు రెండు సార్లు సున్నిపిండితో స్నానం చేయాలి . హెర్బల్ స్నానం పొడిని Shoppe Storesకొనవచ్చు. మరింత సమాచారం కోసం సంప్రదించండి +91-9442645112.
 • ఈ స్థానాల్లో విభూదిని రాసుకోవాలి: ఆజ్ఞ – కనుబొమల మధ్య, విశుద్ధి – గొంతు గుంటలో, అనాహత – మీ పక్కటెముకలు కలిసే ప్రదేశానికి కొంచం కింద, మణిపూరక – బొడ్డు కింద.

సాధన ఉద్యాపన:

ఈ సాధన ఉద్యాపన మహాశివరాత్రిన జరుగుతుంది. మీరు ఈ సాధనని ఈశా యోగా కేంద్రంలో గాని లేక మీ ఇంట్లోనే ధ్యానలింగం ఫోటో ముందు కాని ఉద్యాపన చేయవచ్చు.
అ ప్రక్రియ ఇలా ఉంటుంది:

 • శివరాత్రి నాడు రాత్రంతా జాగారం చేయటం ముఖ్యం.
 • యోగ యోగ యోగేశ్వరాయ 112 సార్లు స్తుతి చేయాలి.
 • అవసరంలో ఉన్న ముగ్గిరికి ఆహారం గాని, డబ్బు గాని దానం చేయండి.
 • ఒక బిల్వ పత్రం/వేపాకు/ 3 లేక 5 భాగాలుగా ఉన్న ఆకును ధ్యానలింగానికి సమర్పణం చేయండి.
 • మీ చేతికి కట్టుకున్న నల్ల గుడ్డను విప్పి ధ్యానలింగం ఎదురుగా ఉన్న నంది దగ్గర కట్టండి. ఇంట్లోనే ఉద్యాపన చేసేవారు, నల్ల గుడ్డను విప్పి ఆ గుఢ్ఢను కాల్చండి, పైన చెప్పిన విధంగా ఉద్యాపన పూర్తి చేశాక ఆ బూడిదని ముంచేతులకు, కాళ్ళకు రాసుకోండి.
 • ఇంట్లోనే ఉద్యాపన చేసేవారు, ఈ ధ్యానలింగం ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి.

MSR at home culmination dhyanalinga-photo

మహాశివరాత్రి సాధన సహాయం కావాలనుకుంటే క్రింద రిజిస్టర్ చేసుకోండి!

 • మహాశివరాత్రికి సంబంధించిన సరికొత్త వీడియోలను, వ్యాసాలను పొందండి
 • ఈశా యోగా కేంద్రంలో జరిగే మహాశివరాత్రి వేడుకల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోండి
 • స్వయంగా కాని లైవ్ వెబ్ స్ట్రీం ద్వారా కాని పాల్గొనండ