భైరవి సాధన

భక్తి మాధుర్యాన్ని అనుభూతి చెందండి

Initiation on 21 Jan, 28 Jan, 31 Jan, 4 Feb, and 8 Feb

“ఒకసారి మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకున్నాక, దేవికి మీతో ఉండటం తప్ప వేరే ఎంపిక లేదు. అలాగే దేవి మీతో ఉంటే, నాకు కూడా వేరే ఎంపిక లేదు” - సద్గురు

భైరవి సాధన అంటే ఏమిటి?

ఇది, ఒకరు దేవి అనుగ్రహానికి పాత్రులయ్యేలా వారి గ్రహణశీలతను పెంపొందించడంతో పాటు వారిలోని భక్తి భావనని వెలికి తీసుకొచ్చేందుకు రూపొదించిన ఒక సులువైన మరియు శక్తివంతమైన ప్రక్రియ.

ఈ సాధన ఉత్తరాయణం ప్రారంభంలో మొదలవుతుంది, అప్పుడు సూర్యుని కదలిక ఉత్తర అర్ధగోళానికి మారుతుంది, అది ఆధ్యాత్మిక గ్రహణశక్తికి అనుకూలమైన సమయం.

స్త్రీలకు ఉద్యాపన: 25 Jan 2024 (Thaipusam)

పురుషులకు ఉద్యాపన: 9 Feb 2024 (Thai Amavasya)

*తాయ్ అనే చంద్రమాన మాసంలో వచ్చే పౌర్ణమి రోజే తైపూసం

*ఈ సాధనలో పాల్గొనడానికి భైరవి సాధన కిట్ తప్పనిసరి. (ఈశా లైఫ్ వెబ్‍సైట్‍‍లో అందుబాటులో ఉంటుంది)

భైరవి సాధన ఎందుకు?

ఒకరు ఆకాంక్షించేది ఏదైనా సరే, అది ఆరోగ్యమైనా సంపద అయినా జ్ఞానమైనా ముక్తి అయినా - దేవి వాటన్నింటినీ ఇంకా వాటికి అతీతమైన వాటిని కూడా ప్రసాదించగలదు

  • దేవి అనుగ్రహానికి పాత్రులయ్యేలా మీ గ్రహణశీలతను పెంపొందిస్తుంది.

  • దేవితో మీ అనుబంధాన్ని బలపరచుకోవడానికి ఒక ప్రత్యేకమైన సాధనలలోకి దీక్ష పొందచ్చు, అలాగే రోజువారీ క్రమశిక్షణ కూడా ఉంటుంది.

  • తమ భక్తి ఇంకా అంకితభావానికి సూచికగా, భక్తులు కొన్ని పవిత్ర సమర్పణలు చేయడం జరుగుతుంది

ఎలా పాల్గొనాలి:

1వ స్టెప్పు:

ఈ సాధన కోసం రిజిస్టర్ అవ్వండి

2వ స్టెప్పు:

ఉపదేశం రోజుకి ముందు దీక్షకు సంబంధించిన ఓరియంటేషన్ వీడియోను చూడండి. (ఒకసారి రిజిస్టర్ అయ్యాక, మీకు అది ఈ మెయిల్ ద్వారా పంపబడుతుంది)

3వ స్టెప్పు:

2024 జనవరి 4, 11, 14, 18, 22 న జరిగే ఆన్లైన్ దీక్ష సెషన్‌కు హాజరుకండి

(సెషన్ సమయము ఇంకా పాల్గొనేందుకు అవసరమైన లింకు మీకు మెయిల్ ద్వారా పంపబడతాయి)

4వ స్టెప్పు:

చెప్పిన సమయం వరకు, సూచనల ప్రకారం సాధన చేస్తూ ఉండండి.

5వ స్టెప్పు:

ఉద్యాపన రోజుకి ముందు, ఉద్యాపనకు సంబంధించిన ఓరియంటేషన్ వీడియోను చూడండి. (ఒకసారి రిజిస్టర్ అయ్యాక, మీకు అది ఈ మెయిల్ ద్వారా పంపబడుతుంది)

6వ స్టెప్పు:

స్త్రీలు ఫిబ్రవరి 5న, పురుషులు ఫిబ్రవరి 20న ఆన్లైన్‍లో గాని లేదా ఈశా యోగ కేంద్రంలో ప్రత్యక్షంగా గాని ఉద్యాపన సెషన్‌కు హాజరుకండి.

( సెషన్ సమయాలు ఇంకా ఇతర వివరాలు మీకు మెయిల్ ద్వారా పంపబడతాయి.)

మీ సాధనకు అవసరమైన వస్తువులు:

భైరవి సాధన కిట్టు (ఈశా లైఫ్‍లో ఆర్డర్ చేయండి). అందులో ఈ కిందివి ఉంటాయి:

  • దేవి ఫోటో

  • అభయ సూత్ర

  • కుంకుమ

  • దేవి స్తుతి

మీరు దేవి పెండెంట్‌ను (అప్పటికే ఉన్నదైనా లేదా కొత్తదైనా) ధరించాలి. కావాలంటే ఈషా లైఫ్‌లో దాన్ని కొనవచ్చు.

ఈ వస్తువులన్నీ ఉపదేశం రోజుకి ముందే సిద్ధంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వాటిని ఎలా ఉపయోగించాలి అనే వివరాలు ఉపదేశం రోజున మీకు తెలుపబడతాయి.

సాధన సమయంలో పాటించాల్సిన సూచనలు:

దీక్క్షకు సంబంధించిన సెషన్‌లో సూచనలు వివరంగా ఇవ్వబడతాయి. అయితే, సాధన సమయంలో గుర్తుంచుకోవలసిన విషయాలు:

  • హెర్బల్ స్నానపు పొడిని ఉపయోగించి రోజుకు రెండుసార్లు స్నానం చేయడం (రసాయన ఆధారిత ఉత్పత్తులు వాడరాదు)

  • సాధన చేస్తున్నన్ని రోజులూ పొగ త్రాగటం, మద్యం సేవించటం ఇంకా మాంసాహారం తినటం చేయకూడదు.

  • రోజుకి 2 భోజనాలు మాత్రమే. మొదటి భోజనం మధ్యాహ్నం 12 గంటల తర్వాత చేయాలి.

  • తెలుపు లేదా లేత రంగు దుస్తులు ధరించడం మంచిది.

 

సాధన చేసేటప్పుడు, దేవీ పేరు పలకకుండా, నేను ఒక్కరోజు కూడా ఉండను. అనంతమైన ఆమె కరుణ, నేను ఊహించని విధంగా నన్ను వినమ్రురాలిని చేసింది. నా జీవితంలో ఆమె మ్యాజిక్ పని చేసే విధానాన్ని గమనిస్తే, అది అద్భుతానికి ఏమాత్రం తీసిపోదు. ఆమె ప్రజ్వలనం ఎంతోమంది జీవితాలను ప్రకాశింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.

- — ఆక్ష, దిల్లీ

తరుచుగా అడిగే ప్రశ్నలు

కాంటాక్ట్ వివరాల

మరింత సమాచారం కోసం లేదా ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి:

ఈ మెయిల్: bhairavi.sadhana@lingabhairavi.org

ఫోన్: +91-83000 83111

Stay Tuned to Devi

Follow us on Social Media

Sign Up for the Devi Newsletter

Find interesting articles, photos, sharings and event updates about Linga Bhairavi – the Divine Feminine!

Terms and Conditions

Privacy Policy

© 2024 Shri Yogini Trust. All Rights Reserved.

Stay Tuned to Devi

Follow us on Social Media