ఈ వ్యాసంలో మంత్రాల వెనుక ఉన్న విజ్ఞానాన్ని, అలాగే మంత్రాలు మీకు సత్ఫలితాలను అందించే విధంగా, వాటిని ఎలా ఉపయోగించాలి అన్నదాన్ని సద్గురు వివరిస్తున్నారు. ఈనాటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఈ విశ్వమంతా ఒక ప్రకంపన అని అంటోంది. ఎక్కడైతే ప్రకంపన ఉంటుందో, అక్కడ కచ్చితంగా శబ్దం ఉంటుంది. మంత్రాలుం వివిధ రకాలుగా ఉంటాయి. ఒక్కొక్క మంత్రం శరీరంలోని నిర్దిష్ట భాగంలో నిర్దిష్ట రకమైన శక్తిని ఆక్టివేట్ చేస్తుంది.