సద్గురు యజ్ఞాల ప్రాముఖ్యతను వివరిస్తూ, హిమాలయ పర్యటనలో ఆయన కలిసిన ఒక వ్యక్తి గురించిన కథను వివరించారు. “ఈ యజ్ఞాలు, పూజలు వెనుక ఒక శాస్త్రీయ ఆధారం ఉంది. ఈ తంతులు ప్రజలలో ఒక విధమైన అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. ప్రజలకు తమలో ఒక అనుకూల వాతావరణాన్ని సృష్టించుకునే పరిజ్ఞానం లేనప్పుడు, వేద కాలంలో ఎవరికైతే ఒక అనుకూల వాతావరణాన్ని సృస్టించడం తెలుసో, వారు కొన్ని యజ్ఞాలను సృష్టించారు.