About
Wisdom
FILTERS:
SORT BY:
మీరు సత్యంతో సహవాసంలో ఉంటే, మీ బంధాలు కేవలం బంధాలుగా మాత్రమే ఉంటాయి, బంధనాలుగా కావు. మీకు నిమగ్నమై ఉండడం తెలుస్తుంది, కానీ వాటిలోనే చిక్కుకుపోరు.
యదార్థానికి ప్రతి ఆకాంక్షా అనంతం కోసం పడే ఆరాటమే. కాకపొతే అది వాయిదాలలో అభివ్యక్తమవుతోంది.
సుఖమనేది ఒక స్థాయి ఆహ్లాదమైతే, ఆనందమనేది మరో స్థాయి. సుఖం మధురంగా ఉంటుంది, కానీ అది మిమ్మల్ని బానిసను చేస్తుంది. ఆనందం అద్భుతంగా ఉంటుంది, అన్నిటినీ మించి అది విముక్తినిస్తుంది.
మీ తల్లిదండ్రులు మీకు మానవ దేహాన్ని ఇచ్చారు. వారే మిమ్మల్ని పెంచాలనుకుంటున్నారా లేక మీరొక పరిపూర్ణ జీవంగా ఎదగాలనుకుంటున్నారా అన్నది మీ ఎంపిక.
వర్తమానాన్ని మీరెలా అనుభూతి చెందాలన్నది, మీ గతం నిర్ణయించేలా మీరు అనుమతిస్తే, ఇక మీ భవిష్యత్తుని మీరు నాశనం చేసుకున్నట్లే.
మీరు అంతర్గతంగా పరిణితి చెందితే, మీలో గర్వం ఉండదు, పక్షపాతం ఉండదు. మీరు నిర్మలమైన, పరిపూర్ణమైన వివేకంతో పనులు చేస్తారు.
ప్రతిదీ శూన్యం నుంచే వస్తుంది, తిరిగి శూన్యంలోకే వెళుతుంది. శూన్యమే ఈ ఉనికికి ఆధారం.
మనఃశ్శరీరాలనేవి సృష్టికి సంబంధించిన పైపై అంశాలే. అవి అశాశ్వతం అని ఎప్పుడైతే మీరు గ్రహిస్తారో, అప్పుడు మీరు సృష్టిమూలం వైపు దృష్టి సారిస్తారు.
మీ ఆలోచనా ప్రక్రియ లేక మనోభావ ప్రక్రియ ఏదైనా సరే, అది కేవలం మీలో జరిగే ముచ్చట్లే, అది మీకే పరిమితమైనది. బాగుంటే దానిని ఆస్వాదించండి, అంతేగాని అదే నిజమనుకోకండి.
మీ చైతన్యపు స్వభావం, మీ శరీరంలోని ప్రతి కణంలో, మీ జీవితంలోని ప్రతిక్షణం వ్యక్తమవుతుంటుంది.