సంభాషణని ఇక్కడ చదవండి:

ప్రశ్న: నమస్కారం సద్గురూ! మీ ఉద్దేశంలో ఈనాడు భారతదేశానికున్న అతి పెద్ద బలం ఏమిటి?

సద్గురు: భారతదేశనికి ఉన్న ప్రధానమైన బలం ఏమిటంటే, ‘మనది అన్వేషుకుల దేశం’. సత్యాన్ని ఇంకా విముక్తిని అన్వేషించేవాళ్ళం. మనకి నమ్మకాలు లేవు. దేవుడులేని దేశం మనది.. ఎల్లప్పుడూ.. ఎల్లప్పుడూ అంటే ఎప్పుడూ తర తరాల నుంచి ‘నీ కర్మే నీ జీవితం’ అని మనకి చెప్పారు. అంటే నీ జీవితం నువ్వు తయారుచేసుకునేదే అని అర్ధం. ఇదే మన అసలైన బలం. ఇది మనం తిరిగి తీసుకురావాలి-మనది అన్వేషుకుల దేశమనీ. ఎవరో ఎదో చెబితే నమ్మము, మనం ఏదైనా స్వయంగా తెలుసుకునే మనుషులం. అదేమైనా..కృష్ణుడు చెప్పాడు రాముడు చెప్పాడు, శివుడు చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు – ఏమైనా కూడా, మీరే స్వయంగా అన్వేషించాలి. వాళ్ళందరి మీదా పూర్తి గౌరవమున్నా, మనం స్వానుభవం ద్వారానే అన్నీ తెలుసుకోవాలనుకుంటాం .

మనం ఆ పద్ధతిని వదిలేస్తే, అసలు.. ఎలా భారతీయులమయ్యామో అర్ధంకాదు ఇక ఒకటిగా ఉండలేం. నేడు ప్రజల్లో సత్యాన్వేషణ వేగంగా తగ్గిపోతోంది.. అందువల్ల ఈరోజు, పాశ్చాత్య దేశాలు ఫ్రీగా వీసాలిస్తామంటే, ఎనభైశాతం మంది సప్త సముద్రాలు ఈదుకుంటూ వెళ్ళిపోతారు. దీనర్థం మీరు ఎనభైకోట్ల జనాభాని బలవంతంగా ఈ దేశంలో ఉంచుతున్నారనమాట. అది జైలు అవుతుంది, దేశం కాదు. దీన్నొక దేశంగా తయారుచెయ్యాలంటే, మనకి మన ప్రాధమిక సంస్కృతి తెలియాలి-మనం అన్వేషుకులమని. ఈ అన్వేషణ బలపడక పోతే, మనలో ఆధ్యాత్మిక ప్రక్రియ లేకపోతే, మనం కలిసి ఉండేందుకు కారణం లేదు. ఎందుకంటే, మన తినే పద్ధతి, ఉండే పద్ధతి, వస్త్రధారణ అన్నీ వేరు, వేర్వేరు భాషలు మాట్లాడతాం – మనం కలిసుండటానికి ఒక కారణమే లేదు. ఈ ప్రాధమికమైన ఆధ్యాత్మికతనే దారమే ఒక దేశంగా మనని కలిపి ఉంచుతోంది. దాన్ని విడగొడితే అది చనిపోతుంది - అప్పుడు ఈ దేశం యొక్క సార్వభౌమికతకు రక్షణ లేకుండా పోతుంది. దీన్ని బలపరచటం మీలాంటి యువత చేతిలోనే ఉంది. దాన్ని మీలో, మీ చుట్టూ ఉన్నవారిలో తీసుకురావాలి..అలాగే మీ బీరువాలో ఇరవైశాతమైనా భారతీయ వస్త్రాలు ఉండాలి. ధన్యవాదాలు.