యోగ వ్యవస్థలో మనస్సును 16 భాగాలుగా ఎలా చూసేవారో సద్గురు వివరిస్తారు. వాటిలో నాలుగు ప్రధాన భాగాలను బుద్ధి, అహంకారం, మనస్సు, చిత్తం అనేవాటిని వివరిస్తూ, ఆధునిక సమాజాలు బుద్ధికి మరీ ఎక్కువ ప్రాముఖ్యతను కల్పించాయని సద్గురు అంటున్నారు. దానివల్ల జీవితాన్ని చూసే విధానం వక్రీకరించబడుతోంది. మనం చిత్తాన్ని స్పృశించడం ద్వారా సృష్టి మూలాన్ని అందుకోవచ్చు అని చెబుతున్నారు.