ధ్యానలింగం: సద్గురు మూడు జన్మల కృషి

మూడు జన్మల కఠోర ప్రయాస తరువాత, 1999 జూన్ 24 వ తేదీన సద్గురు ధ్యానలింగ ప్రాణ ప్రతిష్ఠ చేసారు. పదిహేను వేల సంవత్సరాల పూర్వం పురుడు పోసుకున్న ఈ మహోన్నత కార్యం, ఎంతోమంది యోగులకు, జ్ఞాన సిద్ధులకు ఒక కలలాగే మిగిలిపోయింది. ధ్యానలింగ ఇతిహాస గాధను సద్గురు మాటల్లోనే వినండి.