భారతదేశంలో ఎండాకాలం వచ్చేసింది. ప్రపంచమంతా కూడా వేడి ఎక్కిపోతోందనటానికి, కావలసినన్ని ఆధారాలున్నాయి– ఇది కేవలం ఉష్ణోగ్రతలో మాత్రమే కాదు. ప్రతిదీ ఎన్నో విధాలుగా ఎదుగుతున్నప్పుడు, మన జీవితాల్లో సమతుల్యతనేది ఎంతో ముఖ్యమైనది. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మీకు ప్రశాంతంగా, సమతుల్యత కలిగిన ఏకాగ్ర చిత్తంతో (అణకువగా) ఉండడం నేర్చుకోవలసిందే! సాంకేతిక విజ్ఞానం, పరిజ్ఞానం మన సృష్టి, వినాశన సామర్ధ్యాన్ని ఎంతగానో పెంపొందించాయి.ఈ సామర్ధ్యం ఓ సృజనాత్మకమైన సావకాశంగా రూపుదిద్దుకోవాలంటే, మనం ఎటువంటి మనవ జాతిని నిర్మిస్తున్నామన్నది ఎంతో ముఖ్యం. మనం ఇంత వరకు మన చుట్టూ కట్టడాలు నిర్మించడంలోనే మునిగిపోయాము. మునపటి తరాలు 10,000 సంవత్సరాల్లో నిర్మించలేనన్ని కట్టడాలు, గడిచిన  శతాబ్దంలో మానవులు కట్టగలిగారు – ఇందిలో అన్ని రకాలూ ఉన్నాయి– మనకుపయోగపడేవి, నిరుపయోగామైనవి కూడా..

మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మీకు ప్రశాంతంగా, సమతుల్యత కలిగిన ఏకాగ్ర చిత్తంతో (అణకువగా) ఉండడం నేర్చుకోవలసిందే!

మనకు ఇంతటి సామర్ధ్యం ఉన్నప్పుడు, మనం సృష్టించేవి మనకి, మన చుట్టూ ఉన్న వారికీ క్షేమదాయకమై జీవితానికి ఆలంబననిచ్చి పెంపొందించేవిగా ఉండాలి గానీ ఇవి మనల్ని, మనతోపాటూ అందరినీ వినాశనం చేసేవిగా ఉండకూడదు. ఈ కాలంలో మానవులకున్న శక్తి సమర్ధ్యతలని బట్టి చూస్తే, వారు సమతుల్యత కలిగి ఉండడమనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఇదే లేకపోతే మీరు చాలా విధ్వంస కారకులుగా తయ్యారవుతారు. ఇది జరగడానికి మీ దగ్గర ఓ న్యూక్లియర్ బాంబ్ ఉండకర్లేదు. ఇప్పటి కాలం పోకడ చూస్తుంటే, భవిష్యత్తులో  న్యూక్లియర్ బాంబ్ ఎలా తయ్యారు చేయ్యాలో మీకు ఇంటర్నెట్ లో దొరకవచ్చు. కాకపోతే మీకు పదార్ధాలు దొరకడం కొంచెం కష్టమవచ్చు..కొన్నాళ్ళలోఅది కూడా మారిపోతుంది. అప్పుడు మీ పొరుగింటివారి కుక్క మీ తోటలో మూత్రం పోసిందని మీరు వారి మీద బాంబ్ వెయ్యాలనుకోవచ్చు. అప్పుడు మీరు మీరుండే  నగరాన్నే విధ్వంసం చేసేస్తారు, ఎందుకంటే ఈ అయుధం అలాంటిది కాబట్టి. ప్రపంచంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది కదా...ఎవరో ఒక మనిషిని చంపాలన్న ఉద్దేశ్యంతో, మొత్తం దేశం మీదే బాంబ్ వేస్తున్నారు.

ఆధ్యాత్మిక పధంలో గంభీరంగా ఉండకూడదు.

సమతుల్యతతో, ప్రశాంతంగా ఉండడం అంటే ఎంతో గంభీరంగా ఉండడం కాదు. మంచి ఉద్దేశంతో ఉన్నాను అనుకునే గంభీరమైన వ్యక్తులు ఎంతో ప్రమాదకరమైన వారు. వీరు దైవాజ్ఞను పాటిస్తున్నామని నమ్ముతూ, అందరికీ ఎంతో ఉపకారం చేస్తున్నామనుకుంటూ, ఈ భూగోళం మీద ఎన్నో ఘోరమైన పనులు చేస్తున్నారు. ఆధ్యాత్మిక పధంలో గంభీరంగా ఉండకూడదు. ఇది ఎంతో ముఖ్యమైన విషయం. మీరు తీక్షణంగా ఉండడం ఒక విషయమైతే మీరు కంగారుగా ఉండడం మరో విషయం. తీక్షణత మీలో ఏకాగ్రతను కలిగిస్తుంది. కంగారుపడడం మిమ్మల్ని స్థిరచిత్తులుగా , నిలకడగా ఉండనీయదు. మీలో ఓ తీక్షణత ఉన్నపుడు మీలో అంతా ప్రశాంతంగా, సజావుగా, తేలికగా అనిపిస్తుంది. అప్పుడు ఈ జీవితాన్ని మీకోసం, మీ చుట్టూ ఉనావారందరి పురోగమనానికీ  వాడుకోవచ్చు. ఇంతకు మించి జీవితంలో మనకి అవసరమైన, ముఖ్యమైన విషయం మరేముంది?

మన ముందు తరాల వారికి కలలో కూడా సాధ్యంకాని విషయాలెన్నో,ఇప్పుడు మనకి సామాన్యమైపోయాయి. ఉదాహరణకు, ఇక్కడలేని మనిషితో సంభాషిచగలగడం, ఇదివరకు కాలంలో ఓ అద్భుతమైన విషయం. ఓ శతాబ్దం క్రితం ఓ 100 మైళ్ళ దూరంలో ఉన్న వారితో మీరో 2 మాటలు మాట్లాడగలిగితే మిమల్ని దైవదుతో, దేవునిబిడ్డ అనో, సాక్షాత్తూ ఆ దేవుడే మీరని అనుకునేవారు. ఈ రోజుల్లో మనం ఎమి చెప్పాలనుకున్నా అది ప్రపంచమంతా తెలియపరచవచ్చు.

ఇటువంటి సామర్ధ్యాలలో అఖండమైన శక్తి ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చెప్పాలను కుంటున్నాము, ఎలా చెప్పాలనుకుంటున్నాము, ఏమి చేస్తున్నాం, ఏమి చెయ్యడం లేదు, మన జీవితాలను ఎలా నిర్వహించుకుంటున్నాము, ఎలా శ్వాసిస్తున్నాము, ఎలా కుర్చుంటున్నాం, మనల్ని మనం ఎలా నియంత్రించుకుంటున్నాం - అన్నిటికీ మించి మనలో మనం ఎలా ఉన్నామనేది అత్యంత ముఖ్యమైన విషయం. మీరు ఓ చిన్న చీమ అయితే మీరు మనుషులమీద నడిచినా సరే, వారికి ఎటువంటి హాని జరగదు. అదే మీరో ఏనుగైతే, మీ కాలుని ఎంతో జాగ్రత్తగా మోపాలి. లేకపోతే మీరు వారిని ధ్వంసం చేసేస్తారు. కానీ ఈ రోజుల్లో, మానవుల శక్తి ఓ రాక్షబల్లితో పోల్చదగ్గది. అందుకని మనమెంతో ఎరుకతో అడుగిడడం అనేది చాల ముఖ్యం.

ఈ సందర్భంలో, కిందటి సంవత్సరం 'ఇంటర్నేషనల్ డే అఫ్ యోగ' ను ప్రకటించడం అనేదిచెప్పుకోదగ్గ విషయం. దీని అర్ధం మన ప్రపంచానికి ప్రశాంత చిత్తంతో సమతుల్యత కలిగి ఉండమని భోదించడం. మీకు చికాకు, విసుగు, కోపం రాకపోతే , మీరు అవేశపడకపోతే  మీ చేతుల్లో ఏమైనా పెట్టి నిశ్చింతగా ఉండవచ్చు. ఎందుకంటే మీరలా ఉన్నప్పుడు మీరు అన్నీ మీ శక్తిమేరకు ఔన్నత్యానికే ఉపయోగిస్తారు. ఇప్పుడు మీ సమస్య ఏంటంటే మీ చికాకు, విసుగు, కోపం, ద్వేషం వీటన్నిటికీ ఎవరో బాధ్యులు అని మీరనుకున్నప్పుడు, మీరు వారిని బాధ పెట్టడానికో, నాశనం చేయడానికో ఓ మంచి సాకు వెతుక్కుంటారు. మీరు పూర్తి ఎరుకతోనే కుట్ర పన్ని ఘోరమైన పనులు చేస్తారు. అకృత్యాలు చేస్తున్నవారిలో చాల మంది ఎరుకతో దేవుడి పేరు చెప్పి చేస్తున్నారు . ఎందుకంటే వారు అది దైవ నిర్ణయాన్ని పాటించడం అనుకుంటున్నారు.

ఒకసారి వ్యతిరేక భావాలు మీ వ్యవస్థలో చోటుచేసుకోవడం మొదలుపెడితే, అవి వ్యక్తపరుచుకోవడానికి మీరు ఎలాగోలా ఓ సాకు వెతుకుతారు.

ఒకసారి వ్యతిరేక భావాలు మీ వ్యవస్థలో చోటు చేసుకోవడం మొదలుపెడితే, అవి వ్యక్తపరుచుకోవడానికి మీరు ఎలాగోలా ఓ సాకు వెతుకుతారు. మీరు ఎంత హాని చేస్తారనేది మీ సామర్ధ్యం మీద ఆధారపది ఉంటుంది. ఒకసారి మీకు చికాకు కలగడం మొదలయితే,ఆవేశంగా, కోపం, ద్వేషం, ఉద్రేకం ఇవన్ని పరిణామ క్రమమే..మీకు ఎవరిపట్లయినా, దేనిపట్లినా స్వల్పమైన చికాకు కలిగినా సరే, మీరు దాన్నిఅధిగమించడానికి సాధన చెయ్యాలి. అది పట్టలేని ఉద్రేకంగా మారేవరకు ఎదురు చూడకండి. పట్టలేని ఉద్రేకం ఎందుకు వస్తోంది? మీరు పక్కవారిని మీలో ఐక్యం చేసుకోకపోవడం వల్లే. మీరు అన్నిటితో ఐక్యంలో ఉన్నప్పుడు పట్టలేని ఆవేశానికి తావుండదు.

మీరు ఆవేశాన్ని అధిగమించినప్పుడు, నాలో ఓ భాగామవుతారు. మీరు ఆవేశాన్ని అధిగమించినప్పుడు, మీరు ఓ ప్రశాంత జీవి. ఒకసారి మీలో ప్రశాంతత చోటుచేసుకున్న తరవాత మీరు ఎప్పుడూ సహజంగానే ఆహ్లాదంగా ఉంటారు. మీకు దేనిపట్ల ప్రత్యేకాభిమానం ఉండదు. ఏది అవసరమో అది చేస్తారు. మీకుగా మీరు హాయిగా ఉంటారు. పోరుగువారి నుంచి సంతోషాన్ని పిండుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ రోజు మానవ జాతి పొందిన అసమాన సామర్ధ్యతతో పాటూ మీరు ఆవేశాన్ని అధిగమిస్తే మీరో సాటిలేని అవకాశంగా రూపుదిద్దుకుంటారు. మీరందరూ అలాంటి అవకాశంగా పరిణామం చెందాలని నా ఆకాంక్ష , నా ఆశీర్వచనాలు..

ప్రేమాశీస్సులతో,
సద్గురు