సద్గురు: నమస్కారం. స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 72 ఏళ్లు. మనదో గొప్ప నాగరికత, ఎన్నో ఆక్రమణలకు, దండయాత్రలకు గురయ్యి.. ఎంతో పోరాటం.. త్యాగంతో మనం 72 ఏళ్ళ క్రితం స్వాతంత్రాన్ని సాధించాం. ఈ 72 ఏళ్లలో ఎన్నో చెప్పుకోదగ్గ విషయాలు జరిగాయి. కానీ అదే సమయంలో ఎన్నో విషయాలను సరి చేయాలి. మనం space research లో ముందుకు దూసుకుపోతున్నాం.. వాణిజ్య వ్యాపారాలు కూడా అద్భుతాలు సృష్టించాయి. మన విద్యా విధానాలు మెరుగయ్యాయి..మౌళిక వసతులు మెరుగయ్యాయి..మనవాళ్ళు ప్రపంచమంతటా ఉన్నారు..ఇలా ఎన్నో విషయాలు జరిగాయి.. అన్నిట్లో విజయం సాధించాం.. కానీ   దేశ పునాదులను కదిలిస్తున్న కొన్ని కీలకమైన విషయాల గురించి, ప్రతి పౌరుడు శ్రద్ధ చూపి.. తాము చేయగలిగిందేదో  అది చేయాలి.

జాతి కుల మత వర్గ భేదాలను నిర్మూలించాలి

మూడు ముఖ్యమైన విషయాల మీద వచ్చే దశాబ్దంలో మనం శ్రద్ధ చూపాలి..  - ఒకటి కులమత విభేదాలు, ఇవి మన దేశ పునాదులనే కదిలి స్తున్నాయి. వీటిని మనం పరిష్కరించాలి. మన గుర్తింపు జాతి, కుల, మతాలకు అతీతంగా.. దేశీయమైనదై   ఉండాలి. మన ఇంట్లో మనం దేన్ని అనుసరిస్తున్నప్పటికీ , మనం ఏర్పర్చుకునే గుర్తింపు మన దేశానిదై ఉండాలి. మన దేశం విజయపథంవైపు నడవాలంటే ఇది ఎంతగానో అవసరం.

మనం ఈ ఒక్క పని చేయగలిగితే, మన యువతను ఏకాగ్రత కలిగిన, ఉత్సాహభరితమైన స్థితికి తీసుకువెళ్ళగలిగితే..

నేను విజయవంతమైన దేశం అన్నప్పుడు, నేను మాట్లాడేది అయిదు వేల కోట్లయువకులను ఉద్దేశించి... ప్రపంచంలోకెల్లా,  అధిక శాతంలో యువతను కలిగి ఉన్న దేశం మనదే. యువత వారి జీవితాన్ని కొనసాగించాలంటే... మనదేశంలో మార్పు తీసుకురావాలంటే ... ప్రపంచ శ్రేయస్సు లో ఒక ప్రముఖమైన పాత్ర వహించాలంటే, అందుకు మనందరం ఒక్కటిగా ఐకమత్యంతో  ఉండడం అన్నది ఎంతో ముఖ్యమైన విషయం...మన కుల మత జాతులు ఏవైనా సరే. మనం ఈ ఒక్క పని చేయగలిగితే, మన యువతను ఏకాగ్రత కలిగిన, ఉత్సాహభరితమైన స్థితికి తీసుకువెళ్ళగలిగితే.. మన దేశంలో ఓ అద్భుతాన్నే సృష్టించవచ్చు.

రాబోయే 10 నుండి 20 సంవత్సరాల వరకు మన దేశం యవ్వనంగా ఉండబోతోంది 

అధిక సంఖ్యలో యువత ఉండడమనే అనుకూల  పరిస్థితి మనకు మరో పదిహేను ఇరవై ఏళ్ల కాలం వరకు ఉంటుంది..ఈ పది పదిహేనేళ్ళలో దీన్ని చేయగలిగితే..అంటే ఒకరినొకరు దూషించుకోకుండా..మరొకరిని నిందించకుండా..గొడవ పడకుండా..మనమంతా ఒక్కట్టైతే మనదో అద్భుతమైన దేశం అవుతుంది. మనకు కావలసిన సామర్ధ్యం, మేధస్సు ఉన్నాయి,ప్రపంచం మార్గదర్శనం కోసం మనవైపే చూస్తోంది, ఈ రోజున ప్రపంచం భారతదేశం విజయం వైపుగా దూసుకు వెళ్తోందని గుర్తించింది, రాబోయే 20ఏళ్ళు మనవే.. మనం కలిసికట్టుగా దీన్ని సాధించాలి..ఇదొక అంచనాగా మిగిలిపోకూడదు, మనం ఇందుకో ప్రణాళిక వేసుకోవాలి.

ప్రభుత్వం కృషి చేస్తోంది..ఈ పని జరిగేలా చేసేందుకు ప్రజలు సహకరించాలి.

తరువాతి అంశం లంచగొండితనం, ఇది మన దేశ వ్యవస్థలోని  పునాదుల్లోకి చొరబడింది. ఇందుకై ఇప్పుడు ఎన్నో చర్యలు చేపట్టారు. ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ప్రతి లావాదేవీ లోకి టెక్నాలజీని తీసుకురావాలి..అన్ని లావదేవిల్లోకి...Birth certificate మొదలుకొని Death Certificate వరకు, బ్యాంకింగ్ ఇంకా మొదలైన వాటన్నిటిలో టెక్నాలజీని వాడాలి, లంచం అనే మహమ్మారి మూలాల నుంచి నిర్మూలించబడుతుంది. ప్రభుత్వం కృషి చేస్తోంది..ఈ పని జరిగేలా చేసేందుకు ప్రజలు సహకరించాలి. ఇది మనకు మేలుకోరి చేసే పనే, మనం ఉంటున్న పరిస్థితులను చక్కదిద్దేందుకే. దీనివల్ల కేవలం డబ్బు నష్టమే కాదు, ఇది దేశ ప్రజలుగా మన ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తుంది.

కొన్ని వందల సంవత్సరాల వరకు మనం సమస్యలతో ఉన్నాము

ఇక మరో అంశం, బయటనుంచి పొంచి ఉన్న ప్రమాదాలు ఇంకా  తీవ్రవాదం. ఇందుకు నేను ప్రభుత్వాన్ని ఇంకా ఇతర సంస్థల్ని, ప్రజలని అప్రమత్తతతో ఉంటూ  ఇటువంటి సంఘటనలు మనదేశంలో ఎన్నటికీ జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. గత వెయ్యి సంవత్సరాలుగా ముఖ్యంగా గత 250 సంవత్సరాలుగా మనపట్ల జరిగిన అరాచకాలను మనం మరిచిపోకూడదు. మనం వీటిని మరిచి పోకుండా ఉండటం అన్నది ఎంతో ముఖ్యం, కానీ అంతకంటే ముఖ్యమైన విషయం మనం జరిగిన దాని పట్ల ద్వేషభావాన్ని ఏర్పరచుకోకుండా  ఉండడం.

ఒక సంస్కృతి గా మనం అనుభవించిన బాధను మనం మన జీవితాల్లో ఒక గాయంలా కాకుండా వివేకంగా మలుచుకోవడం అన్నది ఎంతో ముఖ్యమైన విషయం. మనకేదైనా జరిగినప్పుడు మనం బాధపడవచ్చు లేదా నేర్చుకోవచ్చు..మనం వివేకవంతులుగా అయ్యేలా ఈ అనుభవాన్ని మలచుకోవాలి, ఈ దేశాన్ని, ప్రపంచాన్ని రాబోయే తరాలకు అనుకూలంగా మార్చాలి.

ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున.. నేను మిమ్మల్నందరినీ కోరుకుంటున్నది, ప్రతి భారతీయుడూ  కూడా మనదేశ పునాదుల్ని కుదిపేస్తున్న ఈ మూడు  ఘోరాలను, మనకి చేతనైన రీతిలో కలిసికట్టుగా ఎదుర్కోవాలి . మనం ఒకరికొకరు ఎదురు వెళ్ళకూడదు.. ఒకరినొకరు నిందించుకోకూడదు , దేశం కోసం మాట్లాడాలి, దేశం కోసం పనిచేయాలి. ఇది జరిగేలా చేయాలి.

ఎందుకంటే 40 కోట్ల మంది ప్రజలు సరిగా తినడం లేదు

ఎందుకంటే, మన దేశంలో ఇంకా 40 కోట్ల మంది ప్రజలు సరిగా తినడం లేదు, వారికి పౌష్టికత లభించడం లేదు. ఇది మారాలి. ఇది జరగాలంటే, కలిసికట్టుగా ఐకమత్యంతో మన దేశాన్ని మనం నిర్మించాలి. మీ అందరినీ నేను వేడుకుంటున్నది ఒక్కటే, ఈ 72వ స్వతంత్ర దినోత్సవం రోజున, కనీస పౌష్టికత కూడా లభించని, దురదృష్టం లో ఉన్న మన ప్రజల పట్ల అంకితభావంతో పనిచేయాలి.. వచ్చే ఐదు నుండి పది సంవత్సరాల్లో ఈ దుస్థితిని మార్చి తీరాలి.