మరో ఏడాది గడచిపోయింది ...
జీవితాన్ని ఈ సారీ దాటేసావా
నీ ఆత్మానందాన్ని వ్యక్త పరిచావా
లేక వంకలు వెతుక్కుని తప్పించుకుంటున్నావా
నీ మనసులో వున్న ప్రేమతో
మమతని పంచావా
లేక నీ వికలానికి ఏమైనా కారణం వెతుకుతున్నావా
నీ తోటి వారి సుగుణాలను
గమనించావా చెప్పడానికి
లేక కర్మ కాలి పోయినట్టు కూర్చున్నావా ప్రేమలు, నవ్వులు , కన్నీళ్లు చూసావా
లేక అంటీ ముట్టనట్టు జీవితాన్ని ఆమడదూరంలో ఉంచావా
సంవత్సరాలు గడిచిపోతాయి

 

 
Sadhguru-new-year-message-2016
 
నువ్వు సంతోషంగా ఉన్నా  బాధగా ఉన్నా 
ఆటలాడుతున్నా   దొర్లుతున్నా 
కాలం ఇసుకలా జారిపోతూనే వుంటుంది 
 
 
ఈ నూతన  సంవత్సరంలో 
నువ్వెదగాలి ...   మెరవాలి ... 
ఆ తపనతోనే తొందరపడాలి... 
 
ప్రేమాశీస్సులతో,
సద్గురు