దీపావళిని మనం అనేక సంప్రదాయ కారణాల వల్ల జరుపుకుంటాము, కాని పురాణాల ప్రకారం దీన్ని “నరక చతుర్దశి” అని అంటారు. నరాకాసురుడు అనే ఒక క్రూరమైన రాక్షసుడిని కృష్ణుడు ఈ రోజునే సంహరించాడు. అందువల్లనే ప్రతి సంవత్సరం ఈ రోజున ఈ పండుగను ఇంత ఘనంగా జరుపుకుంటారు. చెడు అంటే అది రాక్షసుల రూపంలోనే ఉండాలని లేదు. నిరాశా నిస్పృహలు, వ్యాకుల పడటం, నిరుత్సాహ పడటం మీరు చూడని రాక్షసుల కంటే మీ జీవితానికి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. దీపావళి పండుగ మీ జీవితంలోని అన్ని ప్రతికూల విషయాలను సంహరించాలనే విషయాన్ని గుర్తుచేస్తుంది.

ఈ పండుగ ఎన్నో విధాలుగా మనకు ముఖ్యమైంది. ఈ రోజున ఎవరికైనా డబ్బులు అవసరమైతే లక్ష్మి దేవి వస్తుందని అని అంటారు. ఎవరికైనా ఆరోగ్యం కావాలంటే శక్తి వస్తుంది. ఎవరికైనా జ్ఞానం కావాలంటే సరస్వతి వస్తుంది. ఇవన్నీ మీ శ్రేయస్సుకు సోపానాలని కధల రూపంలో చెప్పటమే.

భారతీయ సంప్రదాయంలో సంవత్సరంలో ప్రతీ రోజు ఎదో ఒక పండుగ జరుపునే వారు – సంవత్సరంలోని 365 రోజులు కూడా పండుగే – ఎందుకంటే పండుగ అనేది మీ జీవితాన్ని ఉత్సాహమైన, ఆనందభరితమైన స్థితికి తీసుకువచ్చే ఒక సాధనం. ఈ రోజుల్లో జనాలు కేవలం ఎనిమిది లేక పది పండుగులు మాత్రమే సంవత్సరం మొత్తంలో జరుపుకుంటున్నారు ఎందుకంటే మనం ఇప్పుడు ఆఫీసుకు వెళ్ళాలి లేదా రోజువారీగా ఏదో ఒక పని చేయాలి. దురదృష్టవశాత్తూ పండుగాలంటే మీకు ఆఫీసు నుంచి సెలవు దొరుకుతుంది, మీరు ఏ మధ్యానానికో నిద్ర లేస్తారు. ఆ తర్వాత మీరు కడుపు పట్టనంత తిని, సినిమాకి వెళ్ళటమో లేక ఇంట్లోనే టీవి చూడటమో చేస్తారు. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. ఒక పండుగ అంటే ఊరంతా కలిసి ఒక ఉత్సవంగా చేసుకునేవారు. ఈ సంప్రదాయాన్ని తిరిగి జనాలలో తీసుకురావటానికి ఈశా నాలుగు ముఖ్యమైన పండుగలు జరుగుపుకుంటుంది : పొంగల్ లేదా మకర సంక్రాంతి, మహాశివరాత్రి, దసరా ఇంకా గురు పౌర్ణమి. ఇప్పుడు మనం ఇలా చేయకపోతే మన తరువాత తరం వచ్చేసరికి వాళ్ళకి పండుగ అంటే ఏమిటో తెలియదు. వాళ్ళు కేవలం తినటం,నిద్రపోవటం, వేరే మనిషి గురించి పట్టించుకోనే స్వభావం లేకుండానే వాళ్ళు పెరుగుతారు. భారతీయ సంస్కృతిలో మనల్ని ఉత్తేజంగా, ఉత్సాహంగా ఉంచటానికే ఎన్నో విధాలుగా ఈ అంశాలను జోడించారు. మన జీవితాన్ని ఒక పండుగలా జీవించాలన్నదే దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. మీరు జీవితంలో ప్రతీ దాన్ని ఒక పండుగలా జరుపుకుంటే మీరు మీ జీవితంలోని అన్ని విషయలల్లో పూర్తిగా నిమగ్నం అవుతారు. ఇప్పుడు చాలా మంది మనుషులతో వచ్చిన సమస్య ఏమిటంటే ఏదైనా ముఖ్యమైనదని వాళ్ళు అనుకుంటే మరీ ఎక్కువ సీరియస్ గా అయిపోతారు. ఏదైనా ముఖ్యమైనది కాదని అనుకుంటే వాళ్ళు దాని పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు – దానిపై అవసరమైన ధ్యాస ఉంచరు. భారతదేశంలో ఎవరైనా “అతను సీరియస్ గా ఉన్నాడు” అని అంటే దానర్ధం అతని తదుపరి అడుగు ఎక్కడికో మీకు తెలుసు. చాలా మంది ఇలాంటి సీరియస్ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు ముఖ్యమైన విషయం అనిపించినదాన్ని మాత్రమే పట్టించుకుంటారు. మిగతా జరుగుతున్న విషయాల గురించి వాళ్ళకు అసలు ఏమీ తెలీదు, ఎందుకంటే వాళ్ళు సీరియస్ అని అనిపించని విషయం గురించి కొంచెం కూడా సంలగ్నత, అంకిత భావం చూపించరు. ఇదే వచ్చిన సమస్యంతా కూడా. ఒక మార్గం ఇంకా జీవిత రహస్యం ఏమిటంటే, ప్రతీదాన్నీ మరీ ఎక్కువ సీరియస్గా చూడకుండా, అయినా కూడా పూర్తిగా నిమగ్నమై ఉండటమే – ఇది ఒక ఆట లాంటిది. అందువల్లనే జీవితంలోని ముఖ్యమైన విషయాలను ఒక పండుగలా జరుపుకునేది, మీకు ఈ విషయం అర్ధం అవ్వటానికే.

దీపావళి ముఖ్య ఉద్దేశం, మీ జీవితంలో ఆ పండుగ వాతావరణం తీసుకురావటమే – అందుకే ఈ టపాసులు కూడా, మీలో కూడా కొంచం ఉత్తేజాన్ని కలిగించటానికే! ఈ ఒక్కరోజు ఆనందించి ఇక దాని గురించి మర్చిపోవటం దాని ఉద్దేశం కాదు. మీరు ఒక తడిచిన తారాజువ్వ అయితే మీకు రోజూ బయటనుంచి నిప్పు కావాలి. లేకపోతే ఇలా మీలో ప్రతీ రోజూ జరగాలి. మనం అలా కూర్చుంటే మన ప్రాణ శక్తి, గుండె, మనస్సు, శరీరం ఒక తారాజువ్వలా ఎగిసిపడాలి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు