వెలుతురు వస్త్రం

 
 
 
 

సద్గురు కవిత తెలుగులో మీ కోసం...

 

వెలుతురు వస్త్రం 
 
విశ్వాన్ని వెలుతురు వస్త్రంతో కప్పాలన్న నా ప్రయత్నంలో
ఈ భౌతిక శరీరం కృశించి పీలికలౌతోంది.
ఇది చిరిగిపోయేలోగా 
భక్తిలో ముంచి తేల్చిన 
లే ప్రాయపు దారాలతో,
ఈషణలకతీతమైన ప్రేమతో 
సందేహాలకు తావులేని నమ్మకంతో
అస్తిత్వాన్ని అధిగమించిన నిమగ్నతతో 
కొంత పుష్టినివ్వాలి.
నిజం!
ఈ ప్రపంచాన్ని వెలుగుతో కప్పాలని నా కోరిక 
లేకుంటే, నగ్నంగా
ఎప్పుడూ చీకటిలోనే మగ్గుతుంది.
 
ఇంగ్లిషులో చదవండి: Sadhguru Poem
 
ప్రేమాశీస్సులతో,
సద్గురు