మీ జీవితాన్ని మీరు బాగా అనుభూతి చెందాలి అనుకుంటే మీకు మంచి శరీరం, మంచి మనస్సు, మంచి భావాలు, మంచి శక్తి ఉండడం అవసరమే కదా..? వీటి గురించి మీకు ఎంత బాగా తెలిస్తే, మీరు వాటిని అంత బాగా ఉపయోగించుకోగలుగుతారు కదా..? మీకు దీని గురించి ఎంత బాగా తెలిస్తే దీన్ని అంత బాగా ఉపయోగించుకోగలుగుతారు. ఇదే ఆత్మసాక్షాత్కారం అంటే - మీకు దీనిగురించి అన్నీ తెలుసు. వేరేవారు, దీన్ని మీరు ఉపయోగించే తీరుని చూసి, అది మానవాతీతం -  అని అనుకోవచ్చు, కానీ అది కేవలం మానవత్వమే. వారు - “మానవత్వం అత్యున్నతమైనది” అని తెలుసుకోలేకపోయారు...అంతే. ఇది మీ జీవితంలో - మీ జీవితం మొదలైనప్పుడు జరగాలా..? లేదా... మీ జీవితం చివరికి వచ్చాక జరగాలా..? మొదటిలోనే కదా..? మీ జీవితాన్ని మీరు సంపూర్ణంగా అనుభవించాలంటే అది మీరు, మీ జీవితంలో ముందరే అనుభూతి చెందాలి.

పిల్లలకి, మనం యోగా నేర్చుకోవాలని ఎలా చెప్పాలి..?

మనం, సమాజంలో దీనిని ఒక సంస్కృతిగా తీసుకుని రావాలి. ఈ రోజుల్లో చాలా మందికి రాయడం, చదవడం వచ్చు. ఎందుకంటే - దీనికి అవసరమైన పాఠశాలలను, ఉపాధ్యాయుల్ని- మనం తయారు చేశాం కాబట్టి. మనం ఈ ఏర్పాటు చేయడం వలన ఈ రోజున అందరూ  చదువగలరు, రాయగలరు. ఇదే విధంగా తగినన్ని యోగా సెంటర్లను, యోగా బోధించేవాళ్లని - తయారు చేయగలిగితే, ఎంతో మందికి యోగా చేయడం వస్తుంది. మీరు చిన్న పి‌ల్లలుగా ఉన్నప్పుడు, మీ అమ్మ మీకు పళ్ళు ఎలా తోముకోవాలో నేర్పించింది కదా...? అలా చేయకపోతే ఈ రోజున మీకు ఆ పని ఎలా చేసుకోవాలో తెలియదు. ఎవరికైతే ఇలా నేర్పించలేదో, వారికి ఆ పని చేతకాదు. మీకు మూడేళ్లు ఉన్నప్పుడు లేదా నాలుగు ఏళ్ళు ఉన్నప్పుడు, మీకు మీ అమ్మగారు పళ్ళు తోముకోవడంతో పాటు, ఆవిడ మీకు ధ్యానం ఎలా చెయ్యాలో కూడా నేర్పించేస్తే – అది... ఎంతో సులువుగా జరిగిపోతుంది. మన దేశంలో ఈ విధంగానే జరిగేది. చాలాకాలం మన దేశాన్ని పరాయి దేశాలు ఆక్రమించడంవల్ల, మనం దీన్ని కోల్పోయాం. వాళ్ళకి – ఇదే మన సామర్థ్యం అని తెలిసింది కాబట్టి – దీనిని మనం కోల్పోయేలా చేశారు. అయినప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాతకూడా, మనలో అది ఇంకా మిగిలే ఉంది. మనం ఈ సామర్థ్యాన్ని మన సమాజంలోనికి తిరిగి తీసుకుని రావాలి.

భారతదేశమే యోగాని పరిచయం చేసినప్పటికీ, యోగా భారతదేశంలో ఎందుకు తక్కువగా ఉంది ...? 

మన దేశాన్ని, ఎంతో కాలం ఆక్రమించుకున్నారు. రెండువందల ఏభై సంవత్సరాల క్రితం మనది ఎంతో ధనిక దేశం. వారు మన దేశాన్ని వాళ్ళు వదిలి వెళ్ళేసరికే, మన దేశం ఒక పేద దేశంగా మారిపోయింది. బ్రిటిషువారు మన దేశానికి వచ్చేసరికే ప్రతీవారు మన దేశంలో చదవ గలిగి, వ్రాయగలిగి ఉండేవారు. కానీ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళేసరికి తొంభై ఒక్క శాతం మంది నిరక్షరాస్యులుగా ఉండిపోయారు. వాళ్లేమి(బ్రిటిషువారు) కావాలనుకున్నారో వాళ్ళది చేశారు. ఇప్పుడు మనం ఏమి చెయ్యాలనుకుంటున్నామో మనం అది చెయ్యాలి. మనం దాన్ని తిరిగి తీసుకుని రావాలి. పది-పదిహేను తరాలపాటు ఎంతో పేదరికం ఉండడం వల్ల, దానిని మనం కోల్పోయాం. దాన్ని మనం తిరిగి తీసుకునిరావాలి.

 ప్రపంచ యోగా దినోత్సవానికి ఈశ నుంచి ఏమి చెయ్యబోతున్నారు..?

పది లక్షల యోగవీరాలను తయారు చేస్తున్నాము. వీరిలో ఒకొక్కరూ కనీసం వంద మందికి యోగా నేర్పిస్తారు. అంటే, వచ్చే సంవత్సరంలోపుగా, ఒక కోటి మంది అంతకు మునుపు ఎన్నడూ యోగా చేయ్యనివారు, యోగా చెయ్యడం ప్రారంభిస్తారు. ఇది యోగా దినోత్సవంలో భాగంగా ఉంటుంది. మేము ఈ సంవత్సరం... పాఠశాలలు, పిల్లల పట్ల ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవలను కుంటున్నాము. ఎందుకంటే పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  స్కూలు పిల్లలూ, కాలేజీ పిల్లలూ – వీరి పట్ల శ్రద్ధ చూపించాలనుకుంటున్నాం. ఒక పిల్లవాడు లేదా ఒక యువకుడూ – అంటే ఎంతో ఉత్సాహవంతమైన జీవం. జీవం, జీవితం – ప్రాణం తీసుకోవాలని చూస్తోంది - అంటే ఏదో మౌలికమైన తప్పిదం ఉంది.  అందుకని, మేము దీనిపట్ల శ్రద్ధ వహించాలని అనుకుంటున్నాము.

మేము ఇప్పటికే ఎన్నో లక్షలమంది ప్రతిరోజూ యోగా దినోత్సవంగా చేసుకొనేవాళ్లని తయారు చేశాము... వీరికి, సంవత్సరానికి ఒక్క రోజే యోగా దినోత్సవం కాదు. ఈ సంఖ్య ఇంకా పెరగాలి... సంస్కృతి మారాలి. ఈ భూమ్మీద ఉన్న ప్రతివారుకూడ ఒక విషయం అర్థం చేసుకోవాలి – అదేమిటంటే... మీకు ఆరోగ్యం కావాలంటే, మీకు శాంతి కావాలంటే, మీకు ఆనందం కావాలంటే – అది మీ అంతర్ముఖం నుంచి మాత్రమే వస్తుంది. దానిని మీరు బయటినుంచి ప్రేరేపించగలరు... కానీ, మీ లోపలినుంచి మాత్రమే రావాలి. మీరు పుష్-స్టార్ట్ మీద ఉండాలనుకుంటున్నారా..? …  సెల్ఫ్-స్టార్ట్ మీద ఉండాలనుకుంటున్నారా..? పొద్దున్నే లేచి మీరు ఆనందంగా ఉండాలనుకుంటున్నారా, లేదా ఎవరైనా వచ్చి మీకు మంచి విషయాలు చెపితే మాత్రమే, మీరు ఆనందంగా ఉండాలనుకుంటున్నారా..? ఇది ప్రతీవారూ కూడా నిర్ణయించుకోవాలి. నేను 7.3 బిలియన్ ప్రజలని సెల్ఫ్-స్టార్ట్ మీద ఉంచాలనుకుంటున్నాను.   వారి ఆనందం, వారి పారవశ్యం, వారి ఆరోగ్యం అన్నీ కూడా సెల్ఫ్-స్టార్ట్ మీద ఉండాలి.

ప్రేమాశిస్సులతో,
సద్గురు