విజయ సాధన చిట్కాలు - 4/5

జీవితంలోని వివిధ పరిస్దితులని సక్రమంగా నిర్వహించటానికి, మనం వివిధ గుర్తింపులను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఒక గుర్తింపు నుండి మరొక గుర్తింపుకి తేలికగా మారవలిసి ఉంటుంది. ఈ గుర్తింపులను తేలికగా మార్చుకోవాలంటే ఏమిచేయాలో తెలుసుకోవాలంటే విజయ సాధనకు సద్గురు అందించిన ఈ నాల్గొవ చిట్కాని చదవండి!
 
చిట్కా-4 : నచ్చని మనుషులతో కలిసి పనిచేయండి!

success2

  మీకు ఇష్టంలేని పనులు చేయడం నేర్చుకోండి. మీకు నచ్చని వారితో సమయం గడపడం నేర్చుకోండి. అలా చేస్తూ కూడా మీ జీవితాన్ని ఆనందంగా, ప్రేమగా, అర్ధవంతంగా జీవించడం నేర్చుకోండి. 

మన జీవితంలోని వివిధ పరిస్దితులని నిర్వహించటానికి, మనం వివిధ గుర్తింపులను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఒక గుర్తింపు నుండి మరొక గుర్తింపుకి తేలికగా మారగలిగితే, అప్పుడు ఎటువంటి సమస్యా లేకుండా మీరు ఏ పరిస్థితులలోనైనా మీ పాత్రను పూర్తిగా పోషించగలరు. కానీ చాలా మంది విషయంలో వారి వ్యక్తిత్వం లేదా గుర్తింపు ఒక రాయిలా కరడుగట్టి ఉంటుంది. అది అన్ని సమయాలలో వారికి అతుక్కొని ఉండి, తన పరిధిలో లేని ఏ ఇతర పాత్రలోకి వారిని ఇమడనివ్వకుండా బాధపెడుతుంది.

మీరు ఆ స్థితి నుండి బయటపడాలనుకుంటే, మీరు దానికి వ్యతిరేకమైనది చేయాలి. అందుకు మీరు చేయగలిగిన ఒక సరళమైన పని ఏమిటంటే మీకు నచ్చని వ్యక్తితో జత కట్టడం. ఆ వ్యక్తితో కొంత సమయం ఆనందంగా, ప్రేమగా గడపండి. మీకు ఇష్టంలేని పనులు చేయడం నేర్చుకోండి. మీకు నచ్చని వారితో సమయం గడపడం నేర్చుకోండి. అలా చేస్తూ కూడా మీ జీవితాన్ని ఆనందంగా, ప్రేమగా, అర్ధవంతంగా జీవించడం నేర్చుకోండి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

  0 Comments
 
Login / to join the conversation1