విద్యా విధానం పిల్లలపై ప్రభావం చూపుతుందా..?
మనం మన పిల్లలకు విద్యను అందించడంతో పాటు విద్యా విధానానికి కూడా ప్రాముఖ్యతనివ్వాలా? విద్యా విధానం పిల్లలపై ప్రభావం చూపుతుందా? ఈ రోజు అందించబడ్తున్న విద్య ఎలా ఉంది? సధ్గురు ఈ విషయాల గురించి ఏమి చెప్పారో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.
 
 

మనం మన పిల్లలకు విద్యను అందించడంతో పాటు విద్యా విధానానికి కూడా ప్రాముఖ్యతనివ్వాలా? విద్యా విధానం పిల్లలపై ప్రభావం చూపుతుందా? ఈ రోజు అందించబడ్తున్న విద్య ఎలా ఉంది? సధ్గురు ఈ విషయాల గురించి ఏమి చెప్పారో ఈ ఆర్టికల్లో చదివి తెలుసుకోండి.


మిమ్మల్ని మీరు విద్యావంతుల్ని చేసుకోవడంలోని ప్రాధమిక ఉద్దేశ్యం మీ దృక్పథాలను విశాల పరచుకోవడం కొరకే. విద్య ద్వారా మీ పరిమితత్వానికి అతీతంగా మిమ్మల్ని మీరు విస్త్రుతపరచుకోవాలి అనుకుంటారు.  ఈ రోజుల్లో సమాచారం సులభంగా, విస్త్రుతంగా లభిస్తున్నప్పటికీ, దురదృష్టవశాత్తూ ప్రస్తుతం అందించబడుతున్న విద్య, మనిషి ఆలోచనలను, చుట్టూ ఉన్న జీవులను తమతో పాటు కలుపుకుపోయే తత్వాన్ని కుంచించుకుపోయేలా చేస్తోంది.

కొన్ని తరాల క్రితం ప్రతీ చోటా,  ప్రత్యేకించి భారతీయ సంస్కృతిలో ప్రజలు ఉమ్మడి కుటుంబాలుగా జీవించేవారు. ఇప్పటికి కూడా రెండు, మూడు వందల మంది సభ్యులు కలిసి ఒకే కుటుంబంగా జీవిస్తున్నవారున్నారు.  అలా ఉమ్మడిగా జీవిస్తున్నపుడు, ఒకరితో ఒకరికి ఉండే ఎన్నో రకాల అవసరాల వల్ల వారు దగ్గరగా ఉండటమే కాక, పీల్చే శ్వాస కూడా పంచుకోవాల్సి ఉంటుంది.   అలా జీవించాల్సి వచ్చినపుడు, మీలో ఖచ్చితంగా కలుపుకుపోయే తత్వం ఉండడం ఎంతో అవసరమౌతుంది.  అది లేకుండా, మీ కుంటుంబ సభ్యులతో కలిసి మీరు ప్రశాంతంగా జీవించలేరు.

ఇక అప్పట్నుంచీ  పిన్ని, బాబాయిలను, నాయనమ్మ, తాతయ్యలను వదిలేసి, 'కుటుంబం అంటే  నేను, నా భార్య, పిల్లలు. 

గతంలో ప్రజలు అలా జీవించేవారు.  అలా ఇప్పుడు జీవించడం అనేది అసాధారణ విషయం. ఇప్పటికీ అటువంటి కుటుంబాలు ఉన్నా కూడా, మన విద్య విధానంపై పడమటి దేశాల ప్రభావం వల్ల, అందరూ ఒంటరి జీవితానికి అలవాటై, కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు.  ఇక అప్పట్నుంచీ  పిన్ని, బాబాయిలను, నాయనమ్మ, తాతయ్యలను వదిలేసి, 'కుటుంబం అంటే  నేను, నా భార్య, పిల్లలు.  మా అమ్మా, నాన్నా ఫర్లేదు కానీ, నా భార్య తల్లితండ్రులు మాత్రం వెళ్లిపోవాల్సిందే' అన్నాము.  ఆ తర్వాతేమో, తల్లితండ్రులు ప్రతీ విషయంలో అడ్డమైపోయారని, 'కుటుంబం అంటే నేను, నా భార్య, పిల్లలు మాత్రమే' అనుకున్నాము.

ఈ విద్యా విధానం పశ్చిమ దేశాల్లో మొదలై, నిదానంగా మన దేశపు పెద్ద నగరాల్లో విస్తరించి, ప్రజల జీవితాల్లోకి  ప్రవేశించి, వారి జీవితాల్లో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉండడం వల్ల, అసలు ఇప్పుడు ఓ ఇద్దరు కలిసి జీవించడం కూడా కష్టతరమవుతుంది.  ఆ ఇద్దరికీ కూడా ఎవరి ఇల్లు వారికి ప్రత్యేకంగా ఉండాలి. వారాంతంలో మాత్రమే కలుసుకోవాలి. అంతకు మించి కలిసున్నారంటే అంతే! యుద్ధమే!  మనం ఒంటరిగా అయిపోతున్నాం.  ప్రపంచంలో ఈ రోజున ఒంటరితనమే అతి పెద్ద సమస్యగా తయారైంది.

జనం ఎంతగా కోరికల్ని సృష్టించుకుంటున్నారంటే, అవి తీర్చుకోవడానికి కావలిసిన వనరుల కోసం ప్రతీ ఒక్కరికీ ఒక్కో గ్రహం కావాలి.  

దురదృష్టవశాత్తూ, జనాలు విద్యను అర్జించే కొద్దీ వారి కోరికలు నమ్మలేనంతగా పరిణమిస్తున్నాయి.  జనం ఎంతగా కోరికల్ని సృష్టించుకుంటున్నారంటే, అవి తీర్చుకోవడానికి కావలిసిన వనరుల కోసం ప్రతీ ఒక్కరికీ ఒక్కో గ్రహం కావాలి.  అందరూ ఒక గ్రహం మీద జీవించలేరు.  దురదృష్టవశాత్తూ, ఇదీ మన విద్య ఫలితం.   దీనర్ధం చదువులో లోపం ఉందని కాదు, కానీ ఖచ్చితంగా ఏదో లోపం చదువు చెప్పే విధానంలోనే ఉంది. సమాజాన్ని నాశనం చేస్తోంది విద్య కాదు, విద్యను ఏ సందర్భంలో, ఎలా అందిస్తున్నారనేదే.

ప్రస్తుతం, విద్య అనే కార్యక్రమం మొత్తం మనుగడ గురించే అయిపోయింది, కానీ విద్య కేవలం మనుగడ కోసమే కాదు, కాకూడదు. అది మీ దృక్పధాలను విశాలం చేయడానికి ఉపయోగపడాలి. జనం వారి ఆర్ధికస్థితి పట్ల పిచ్చిపట్టిన వారిలా తయారై, విద్య మొత్తాన్ని ప్రపంచం నుండి డబ్బులు పిండడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇది మారాలి! పిల్లవాడి సహజ తెలివితేటలను తికమక పెట్టకుండా ఉంటే, అతనిని ఎక్కడ ఉంచినా సరే బ్రతుకుతాడు.  మనం అతన్ని అద్భుతమైన లేక ప్రేమమయ వ్యక్తిగా మాత్రమే కాదు, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగల ధైర్యవంతుడిగా కూడా తయారుచేయాలి.  మీరు అతన్ని నరకంలో పెట్టినా, దాన్ని అతను క్రమ  క్రమంగా స్వర్గంలా మార్చుకోగలగాలి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1