ప్రశ్న: శాకాహార భోజనం తినటం వలన కలిగే ప్రయోజనం ఏమిటి మరియు దీనిని దైనందిక జీవితం లో ఎలా ఆచరణలో పెట్టుకోవాలి?

సద్గురు: మీరు ఏ రకమైన ఆహారం తినాలి అన్నది, దాని పట్ల మీ కున్నఆలోచనల పై కానీ, మీ విలువలు లేక నైతికత పై కానీ ఆధార పడి ఉండకూడదు. అయితే అది మీ శరీరం ఏమి కోరుకుంటున్నదో అన్న దాని పై ఆధార పడాలి. ఆహారం అనేది శరీరం గురించి. ఆహారం విషయం వచ్చేసరికి మీరు మీ డాక్టర్లను కానీ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ లను అడగవద్దు ఎందుకంటే వీళ్లు ప్రతి అయిదు సంవత్సరాలకు తమ అభిప్రాయాలను మార్చుకుంటారు. ఆహారం విషయంలో ఏ రకమైన ఆహారం తింటే మీ శరీరం సుఖంగా ఉంటున్నదో గమనించండి. వివిధ రకాల ఆహారాలను తినే ప్రయత్నం చెయ్యండి. తిన్న తరువాత మీ శరీరం ఎలా ఉంటున్నదో గమనించండి. మీ శరీరం చురుకుగా, శక్తివంతముగా మరియు తేలికగా ఉంటే, దాని అర్ధం మీ శరీరం సుఖంగా ఉన్నది అని. మీ శరీరం మందకొడిగా ఉండి, జాగృతంగా ఉండుటకు నికోటిన్ లేక కెఫిన్ అవసరమైతే శరీరం సుఖంగా లేనట్లు. అవునా కాదా?

మీ శరీరాన్ని గమనించినట్లయితే, ఏ రకమైన ఆహరం వల్ల సుఖంగా ఉంటున్నదో మీ శరీరం మీకు స్పష్టంగా చెబుతుంది, కానీ మీరు మీ మనస్సు మాట వింటున్నారు. మీ మనస్సు నిరంతరం మీకు అబద్ధాలు చెబుతూనే ఉంటుంది. ఇంతకముందు మీకు అబద్ధాలు చెప్పలేదా? ఈ రోజున అంతా ఇదే అని మీకు చెబుతుంది. రేపు మీరు నిన్న నమ్మినదాని పట్ల మిమ్మల్ని ఒక తెలివితక్కువ వ్యక్తిలాగా భావించే విధముగా చేస్తుంది. కావున మీరు మీ మనస్సుచెబుతున్నది కాక, మీ శరీరం మాట వినటం నేర్చుకోండి.

ఏమి తినాలో ఏమి తినకూడదో ప్రతి జీవికి, ప్రతి జంతువుకు తెలుసు. ఈ గ్రహము పైన మానవ జాతి అత్యంత తెలివైన జాతియే కానీ వారికి ఏమి తినాలో కూడా తెలియదు. ఎలా ఉండాలి అన్నది మర్చిపోండి, మనుషలకు ఏమి తినాలో కూడా తెలియదు. శరీరం చెప్పేది వినుటకు కొంచెం శ్రద్ధ మరియు సంలజ్ఞత అవసరం. ఒక్కసారి మీకు అది అలవండింది అంటే మీకు ఏమి తినాలో ఏమి తినకూడదో తెలుస్తుంది.

మీరు ఒక ప్రయోగం చేసి చుడండి, శాఖాహారం సజీవంగా తిన్నప్పుడు ఏమి తేడా ఉన్నదో గమనించండి. 

మీలో ప్రవేశిస్తున్న ఆహారం యొక్క నాణ్యత విషయానికి వస్తే ఖచ్చితంగా శాకాహారం మాంసాహారం కన్నా ఎంతో మెరుగైనది. మనం దీనిని నైతిక కోణంలో చూడటంలేదు. మనం కేవలం మన వ్యవస్థకు ఏది అనుకూలమైనదో చూస్తున్నాము. మనం శరీరాన్ని సౌకర్యవంతముగా ఉంచే ఆహారాన్ని తినాలని ప్రయత్నిస్తాము. మీరు మీ వ్యాపారాన్ని సరిగా చెయ్యాలన్నా లేక బాగా చదువుకోవలన్నా లేక సక్రమముగా ఏ కార్యం చెయ్యాలన్నా మీ శరీరం సులభంగా (లేక) తేలికగా ఉండటము అనేది అతి ముఖ్యం. కావున ఏ రకమైన ఆహారం తో మన శరీరం సులభంగా (లేక) తేలికగా ఉంటుందో మరియు ఏ ఆహారం నుండి పోషణ పొందేదుకు శరీరం కష్టపడదో అటువంటి ఆహారాన్ని మీరు తీసుకోవాలి.

మీరు ఒక ప్రయోగం చేసి చుడండి, శాకాహారం సజీవంగా తిన్నప్పుడు ఏమి తేడా ఉన్నదో గమనించండి. వీలైనంత సజీవ ఆహారం తినాలి అన్నదే ఉద్దేశం - సజీవంగా ఉన్నది ఏమి తీసుకున్నా, జీవాన్ని పొందుపరుచుకునేవి అన్నీ సజీవ అణువుకు ఉంటాయి. సజీవంగా ఉన్నది తీసుకున్నట్లయితే మీకు తెలియని వేరొక విధమైన ఆరోగ్యకర భావనను పొందుతారు. మనం ఆహారాన్ని వండినప్పుడు దానిలోని జీవాన్ని అది పతనం చేస్తుంది. జీవం నశించిన తరువాత తిన్న ఆహారము అదే విధమైన ప్రాణశక్తిని మీ వ్యవస్థకు ఇవ్వదు, కానీ మీరు సజీవమైన ఆహారం తింటే అది మీకు వేరొక స్థాయి సజీవతను కలిగిస్తుంది. మీరు మొలకలు, పండ్లు మరియు ఏవైనా కూరగాయలు, మీరు ముప్పై నుండి నలభై శాతం సజీవమైన ఆహారం తీసుకున్నట్లయితే , అది మీలోని జీవాన్ని బాగా పొందుపరుచుకోగలుగుతున్నది అని మీరు గమనిస్తారు.

అన్నిటికన్నా, మీరు తినే ఆహారం జీవమే. మనం వేరొక రూపంలో ఉన్న జీవాన్ని మనం తింటున్నాము – వేరొక రూపంలో ఉన్న జీవులు మనలోని జీవం కోసం  వాటి జీవాన్ని వదిలిపెడుతున్నాయి.మన జీవం కోసం వాటి జీవాన్ని త్యజించే అన్నీ జీవాల పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉంటే, మనలో ఆహారం వేరొక విధముగా ప్రవర్తిస్తుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు