సామర్ధ్యాన్ని పెంచుకోవాడం ద్వారానే విజయం చేకూరుతుంది

 
 

విజయం పొందడానికి ఉన్న ఏకైక మార్గం మన సామర్ధ్యం పెంచుకోవాడం ద్వారానేనని సద్గురు చెబుతున్నారు. ఉరికే నినాదాల కోసం వెతుకుతూ సమయం వృధా చేసుకోవద్దు అని సలహా ఇస్తున్నారు.

మీరు “లక్షాధికారి ఎలా అవ్వాలి..?” అనే పుస్తకాలు చదివే ఉంటారు. ఎన్నో లక్షల పుస్తకాలు అమ్ముడయ్యాయి. కానీ, ఎంతమంది లక్షాధికారులున్నారు..?!! ఇవి, లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. కానీ, ఎంతమంది లక్షాధికారులయ్యారు..? కేవలం ఆ రచయిత మాత్రం లక్షాధికారి అయ్యాడు. అది మాత్రమే జరిగింది.

మీరు విజయాన్ని ఎప్పుడు సాధిస్తారంటే, మీరు ఏదో ఒక విధంగా మీ సామర్ధ్యం పొందినప్పుడు..! 

మీరు లౌకిక ప్రపంచంలో చెయ్యగలిగినదల్లా మీ సామర్థ్యాన్ని పెంచుకోవడమే. విజయాన్ని కోరుకున్నంత మాత్రాన, విజయం సాధించరు. ప్రతివాళ్లు కూడా  విజయాన్ని కాంక్షిస్తారు. మీరు విజయాన్ని ఎప్పుడు సాధిస్తారంటే, మీరు ఏదో ఒక విధంగా మీ సామర్ధ్యం పొందినప్పుడు..! మీ వ్యాపారంలో విజయాన్ని కోరుకోకూడదు. మీ వ్యాపారంలో మీరెల్లప్పుడూ మీ సామర్థ్యాలు పెంచుకుంటూ ఉండాలి. మీరు మీ సామర్థ్యాల్ని పెంచుకోకుండా, మీకు విజయం కావాలనుకుంటే - మీరు ఎంతో నిరాశతో మరణించాల్సి వస్తుంది.

ఒకసారి ఇలా జరిగింది. రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాము ఎప్పుడూ కూడా తగ్గింపు ధరలకోసం చూస్తూ ఉంటాడు. ఇలా చాలామంది ప్రజలు ఉన్నారు.  ఏదైనా డిస్కౌంట్ లో ఉందంటే; వాళ్ళు దానిని కొంటారు.  వాళ్ళకి అవసరమా..? అవసరం లేదా..? - అన్నది పట్టించుకోరు. ఒకరోజున రాము ఎంతో ఉత్సాహంతో వచ్చి,  సోముతో ఇలా చెప్పాడు. “నీకు ఒక గొప్ప అవకాశం దొరికింది. మన ఊరికి సర్కస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు  ఒక ఏనుగుని ఇచ్చేద్దామనుకుంటున్నారు.  అది కేవలం 5,000 రూపాయలే..!”. దానికి సోము “నాకు ఏనుగు ఎందుకు..? నేను ఆ ఏనుగును ఎలా పోషిస్తాను..? నాకు ఏనుగు వద్దు” అన్నాడు.

మీరు మీ సామర్థ్యాల్ని పెంచుకోకుండా, మీకు విజయం కావాలనుకుంటే - మీరు ఎంతో నిరాశతో మరణించాల్సి వస్తుంది.

“లేదు, అది ఎంతో గొప్ప అవకాశం. నిజానికి నాకు ఆ మనిషి కూడా తెలుసు. కావాలంటే, దానిని నీకు 4,000 కే ఇప్పిస్తాను. నువ్వు దానిని తీసుకో చాలు..” అన్నాడు రాము. “నేను వన్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ లో ఉంటున్నాను. నేను దీనిని ఎక్కడికి తీసుకు వెళ్తాను..?”.  “చూడూ, నీకు కావాలంటే, నేను అతనితో మాట్లాడి 5,000 కి రెండు ఏనుగులని ఇప్పిస్తాను.. “అని రాము అన్నాడు. దానికి, “ ఏం మాట్లాడుతున్నావు నువ్వు..? నేను రెండు ఏనుగులని ఎక్కడికి తీసుకెళ్తాను..?” అన్నాడు సోము. కానీ విషయం అది కాదు. ఇది తగ్గింపు ధరలో ఉంది కదా..? అందుకని..!! ప్రతీదీ తగ్గింపు ధరలో ఉంది కదా అని వాటికోసం వెళ్ళకండి..!

ప్రేమాశిస్సులతో,
సద్గురు 

 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1