"సృష్టికర్త లేదా సృష్టి మూలం ఎక్కడో కూర్చుని లేదు. మీరు మీ శరీరాన్ని గమనిస్తే,పుట్టిన క్షణం నుండీ ఇప్పటివరకూ, అది ఎంతగా పెరిగిందో చూడండి. ఈ పెరుగుదల బయటి నుండి సాగాదీయటం వలన జరగలేదు. ఇది సృష్టికర్త లోపలనుండి నిరంతరం పని చేయటం వలన జరిగింది. అంటే, సృష్టి మూలం ఇప్పుడు మీలోనే ఉంది. అదే ఆనందం. ఈ సృష్టిలోని ప్రాధమిక శక్తి మీ జీవితంలో వ్యక్తీకరించబడితే, మీరు దాన్ని బయటకి రానిస్తే, మీరు కేవలం ఆనందంగా మాత్రమే ఉండగలరు. మీరు వేరే విధంగా ఉండే మార్గమే లేదు" ~ సద్గురు.

సృష్టి గురించి సద్గురు తెలిపిన సూత్రాలను తెలుసుకుందాం:

  • సృష్టిలో ప్రతీదానికి - గాలి, నీరు, నేల, ఆకాశం అలాగే అన్ని ఖగోళ వస్తువులకీ - తనదైన శబ్దం ఉంటుంది.

1

  • అత్యంత సూక్ష్మంగా పరిశీలిస్తేనే జీవితం ఉంది. సృష్టిలో ప్రతిదీ ఎంత సంక్లిష్టంగా కూర్చబడ్డాయో ఓ చీమనో, పూవునో చూసి తెలుసుకోండి.

2

  • సాధన అనేది ఎక్కడికో చేరుకోవడానికి కాదు - అది సృష్టితో లయబద్దం కావడానికి.

3

  • మీ జీవితాన్ని రక్షించి, పోషించేదేదైనా, అది దైవమే!

4

  • ఈ ప్రపంచంలో ప్రత్యేకంగా ఎంపిక చేయబడ్డవారంటూ ఎవరూ లేరు. అందరితోనూ, అన్నిటితోనూ దైవం సమానంగానే కూడి ఉంది.

5

  • ప్రాణశక్తిని నింపడం ద్వారా, మీరు ఒక భౌతిక రూపాన్ని దివ్యశాక్తిగా చేయగలరు. దేవతలను, యంత్రాలను సృష్టించే శాస్త్రమిదే.

6