మహాభారత కథ : సృష్టి, కాల సమీకరణాలు

 

ఇది ఒక ప్రేమకధో ఒక  పోరాట గాథో కాదు. మోసం, దురాశ, భక్తి గురించి అంతకన్నా కాదు. ఇది మొత్తం మానవాళి గురించి, వారు ఉన్నతికి ఎదగగలిగే  అవకాశం గురించి. మానవాళి గురించి పూర్తి చిత్రీకరణ ఎప్పుడైనా సంభవమైతే, ఇది అదే ~ సద్గురు

ఈ మహాభారత కార్యక్రమం ఒక రమణీయమైన లలితకళల, సాంస్కృతిక కార్యక్రమాల సమాహరణం మాత్రమే కాదు, అసమాన్యమైన ఈ మహాభారత పురాణాన్ని అనితరసాధ్యమైన రీతిలో సద్గురు వివరించారు. మహాభారతంలోని మొట్టమొదటి భాగంలో, ఈ ఇతిహాస లోతుల్లోకి వెళ్ళే ముందు,  కాలం, ఆకాశం, గ్రహాలు వాటికి, మానవ వ్యవస్థకు మధ్య ఉన్నసంబంధం గురించి సద్గురు వివరిస్తారు.

సృష్టి జరగడానికి పూర్వం ఉన్న మూడు అవశ్యకతలు, సృష్టి జరగడానికి కారణం అయ్యాయి. అనంతమైన శూన్యం నుంచి అది -  సమయం, శక్తి, గురుత్వాకర్షణ అని మూడు విధాలుగా వ్యక్తీకరమైంది. అనంతమైన, అపారమైన శూన్యం ఈ మూడు మూల వ్యవస్థలలో బంధించబడడం ద్వారా కాలగతమైన, పరిమితులతో ఉన్న సృష్టి రచింపబడింది. ఈ మూడింటిలో కాలం - ఆగని కాలం - ఉల్లాస పరుస్తుంది,  దెబ్బలు కొడుతుంది, సంరక్షిస్తుంది, కూలదోస్తుంది, ఎత్తులకు తీసుకెళుతుంది, లోతులని చూపిస్తుంది. కనికరంలేని ఈ కాలం ఎవరికీ కాస్తైనా ఉపశమనం కలిగించదు. పురుగైనా, పక్షైనా, వేటగాడైనా, పాలకుడైనా, ప్రజలైనా, చక్రవర్తైనా, దాసుడైనా, అందమైన వారైనా, అధ్భుతమైన రాజభవనాలైనా, కీర్తిశిఖరాలమీద ఉన్నా, అవమానలోతుల్లో కూరుకున్నా ఎటువంటి వారినైనా, దేనినైనా కాలం బూడిద చేయవలసిందే.

కాలం, ఈ ఒక్క అంశం ఎడతెరిపిలేకుండా కొనసాగుతూనే ఉంటుంది. ఈ కాల చక్రాలపై  మీరు స్వారీ చేసి సుఖ జీవనం గడపవచ్చు లేదా ఈ ఎడతెరిపి లేని కాలచక్రం కింద చితికిపోవచ్చు. కాల ప్రక్రియలో ఒకరు నాశనం కాగలరు, లేక దానిని విముక్తికి సాధనంగా మార్చుకోగలరు.  ఒకడు కాల ప్రక్రియలో బందీగా చిక్కుకుంటే ఇంకొకడు అదే కాల ప్రక్రియని దాటివెళ్ళి ముక్తిని పొందగలడు. కాలం ఒట్టి మానవ ఊహ కాదు సృష్టిలో అత్యంత ప్రధానమైన పరిమాణం. కాలం ఆది, అంతాలకు కారణం. ఆది, అంతము లేకపోతే సృష్టేలేదు.

కాలంలోనే మన ఉనికి ఉంది. మన పుట్టుక, మరణం రెండూ కాలంలోనే జరుగుతాయి.

కాలంలోనే మన ఉనికి ఉంది. మన పుట్టుక, మరణం రెండూ కాలంలోనే జరుగుతాయి. కాల  ప్రాముఖ్యత అర్ధం చేసుకున్నవాడు, కాల నియమాలు, కాల ధర్మం అర్ధం చేసుకున్నవాడు, ఆ ధర్మానికి కట్టుబడి ఉన్న మానవుడు, కేవలం  జయుడు మాత్రమే  కాదు విజయుడు కూడా. ఇహ పర సుఖాలు రెండూ పొందగలడు. దానికి వ్యతిరేకంగా, ధర్మానికి కట్టుబడని మనిషి జీవిత ప్రక్రియలో నలిగి చూర్ణమైపోతడు. కాలపరిమితిలో ఆడే ఆటే ఈ జీవితం. మన ప్రాచీన సన్యాసులు, దీర్ఘదర్శులు, యోగులు, కాలప్రాముఖ్యతను అవగాహన చేసుకొని దీన్ని ఎంతో నిశితంగా పరిశీలించారు. కాలంపై మనకున్న అవగాహన మన చుట్టూ ఉన్న సృష్టితో, భూగ్రహంతో, సౌరవ్యవస్థతో మనకున్న సంబంధంపై ఆధారపడి ఉంటుంది.

రాత్రి పగలు ఉండడానికి కారణం భూమి భ్రమిస్తున్నది కాబట్టి. భూభ్రణం, మానవ శరీరం, మానవశక్తులు, మానవ అవకాశాలు, ప్రారబ్ధం ఒకదానికొకటి లోతుగా పెనవేసుకొని ఉన్నాయి. ఈ విషయాలు అర్ధంచేసుకోక, దానిలో ఉన్న నియమాలు, ధర్మంతో అనుసంధానం కానప్పుడు, మానవుడు కూడా ఎప్పుడూ వృత్తాలలో పరిభ్రమిస్తూనే ఉంటాడు. మీరు కొద్దికాలం గుండ్రంగా తిరుగుతూవుంటే, మీరు ఎటు వెళుతున్నారో మీకు తెలియదు. మానవులలో ఎక్కువమంది పరిస్థితి ఇదే.  ఎటు వెళ్తున్నారో తెలియకుండా, భూమితోపాటు పరిభ్రమిస్తూనే ఉన్నారు.

‘సూర్య సిద్ధాంతం’ ప్రకారం సూర్య కాంతి 0.5నిమిషాలలో 2202 యోజనల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఒక్క యోజనం తొమ్మిది మైళ్ళు. 2202 యోజనాలు 19818 మైళ్ళు. ఒక్క నిమిషం అంటే సెకెనులో 16/75 వ వంతు. అర నిమిషం 8/75వ వంతు, అంటే 0.1066666 సెకెండ్లు. 0.10666 సెకెండ్లలో 19818 మైళ్ళ వేగంతో పయనిస్తే అది సెకెండుకి 185,793 మైళ్ళు అవుతుంది. ఇది దాదాపు ఆధునిక లెక్కలతో సరిపోతుంది. ఆధునిక లెక్కల ప్రకారం సూర్యకాంతి వేగం 186282 మైళ్ళు. ఆధునిక శాస్త్రవేత్తలు ఈ సంఖ్య ఎంతో కష్టపడి ఎన్నో శాస్త్రీయ పరికరాలు ఉపయోగించి కనుగొన్నారు.

సూర్యునికీ భూమండలానికీ మధ్య ఉన్న దూరం, భూమికీ చంద్రునికీ మధ్య ఉన్న దూరం, భూగ్రహం తిరుగుతున్న తీరు  దాని ప్రభావం వీటినన్నిటిని ఎంతో జాగ్రత్తగా పరిశీలించడం జరిగింది. సూర్యుని వ్యాసాన్ని 108తో గుణిస్తే సూర్యునికీ భూమికీ మధ్య ఉన్న దూరం వస్తుంది. చంద్రుని వ్యాసాన్ని 108తో గుణిస్తే భూమికీ చంద్రునికీ మధ్య దూరం వస్తుంది. సూర్యుని వ్యాసం భూగోళ వ్యాసానికి 108రెట్లు.

భూమికున్న ఈ వాలుకి ప్రధాన కారణం భూమిపై చంద్రుని గురుత్వాకర్షణ.

ఇందుకే మన మాలలో 108 పూసలు. ఇలాగే ఎన్నో అధ్భుతమైన సంఖ్యలు చెప్పగలను కానీ అతి ముఖ్యమైన విషయం మానవ శరీర నిర్మాణానికీ, కాల నిర్మాణానికీ మధ్య ఉన్న ప్రగాఢ సంబంధం. భూమండలం దాదాపు గుండ్రంగా ఉందనీ, దాని కక్ష్య కొంత వాలుగా ఉందనీ మీకు తెలుసు. భూమి తనచుట్టు తాను భ్రమిస్తూనే ఒక వలయాకారంలో తిరుగుతూ ఉంటుంది. ఈ పూర్తి  భ్రమణానికి భూమికి 25920 సంవత్సరాలు పడుతుందని ఇప్పుడు మనకు తెలుసు (భూ అక్షర రేఖ విన్యాసానికి పూర్తిగా మార్పు రావడానికి). భూమికున్న ఈ వాలుకి ప్రధాన కారణం భూమిపై చంద్రుని గురుత్వాకర్షణ. ఈ 25920 సంవత్సర సంఖ్య ఒక యుగ చక్రమనీ, ఈ ఒక్క భ్రమణంలో ఎనిమిది యుగాలుంటాయనీ, మన ప్రాచీన భారత ఖగోళశాస్త్రం వివరించింది.

తిరిగి అక్షయ ప్రయాణంలోకి వస్తే - 25920 ని 60తో(మీరు ఆరోగ్యంగా ఉంటే మీ గుండె ఒక్క నిమిషంలో కొట్టుకునే సంఖ్య) భాగిస్తే మనకు 432 సంఖ్య వస్తుంది. 432 సంఖ్య మనకు మన భారత సంస్కృతితో పాటు నోర్సె సంస్కృతి, ప్రాచీన యూదుల సంస్కృతి, ఈజిప్టు, మెసొపొటేమియా సంస్కృతులలో కూడా కనిపిస్తుంది. 432 ఎందుకు? మీరు ఉద్రేక పూరితులైతే ఎక్కువ కావచ్చు కానీ, మీరు ఆరోగ్యవంతులైతే  మీ గుండె నిమిషానికి 60 సార్లు కొట్టుకుంటుంది. అది గంటకి 3600సార్లు, రోజుకి 3600 ని 24తో గుణిస్తే 86400సార్లు. 864ని 2తో విభజిస్తే తిరిగి 432 వస్తుంది.

సాధనతో, మన శరీరాన్ని కాలానికి, పరిసరాలతో సహయోగం చేసే ప్రయత్నం చేస్తాము, ఎందుకంటే ఇలా సహయోగం జరగనప్పుడు మీరు ఎక్కువ ముందుకు వెళ్ళలేరు.

మీరు ఉద్రేకంలో ఉంటే ఎక్కువ కావచ్చు, కాని మీరు చాలా సాధన చేస్తే బహుశా 12 సార్లు మాత్రమే కావచ్చు, కానీ మామూలుగా మీరు నిమిషానికి 15 సార్లు ఊపిరి తీసుకుంటారు. గంటకి 900 సార్లు అదే రోజుకి 21600సార్లు. దీన్ని 2తో గుణిస్తే తిరిగి మనకు 432. భూమి యొక్క చుట్టుకొలత తీసుకుంటే దానిలో మనకి నాటికల్ మైలు అని చెప్పబడే, నిజమైన మైలు వస్తుంది, దీనికి మన భూగ్రహంతో సంబంధం ఉంది.  మిగతా కొలమానాలు మన సౌకర్యం కోసం చేర్చుకున్నవి.

ఒక వలయంలో 360 డిగ్రీలు ఉన్నాయని మనకు తెలుసు. అలాగే భూమండలంపై కూడా 360  ఉండగా అవి ఒక్కొక్కటి 60 నిమిషాల్లోకి విభజించబడ్డాయి. ఈ ఒక్కొక్క నిమిషం ఒక నాటికల్ మైలుగా గుర్తించారు. భూమధ్య రేఖ దగ్గర భూమి చుట్టు కొలత 21600 నాటికల్ మైళ్ళు. ఒక  రోజులో మనిషి తీసుకునే శ్వాసలు కూడా అన్నే. భూభ్రమణం సరిగ్గా సమయానికి జరిగితే మీరు సుఖంగా ఉంటారు అది అలా జరుగకపోతే అది మనకందరికీ శ్రేయోదాయకం కాదు. మీరు కూడా దానితో లయలో లేక పోయినా  శ్రేయస్కరం కాదు.

కాలం అనేది మనం కనిపెట్టినది కాదు, అది మన వ్యవస్థలో, మన సృష్టిలోనే ఇమిడిపోయి ఉంది అని తేలియజేయడానికే ఇదంతా. మహభారతంలో యుగాల గురించీ వాటి ధర్మాల గురించీ ఎంతో వివరించారు. మానవ జీవితం మీద, కాలం యొక్క ప్రభావం గురించి మీరు ఇంకొక కోణంలో చూడాలని నా కోరిక. ఇది ఎవరో యాదృఛ్చికంగా సృష్టించింది కాదు. ఇది ఒక అసాధారణమైన లోతైన శాస్త్రం. యొగా ఎప్పుడూ దీనితో సహయోగంతోనే ఉంది, మనం దాని గురించి గొప్ప సిద్ధాంతాలు వెలువరించడంలేదు, అంతే. సాధనతో, మన శరీరాన్ని కాలానికి, పరిసరాలతో సహయోగం చేసే ప్రయత్నం చేస్తాము, ఎందుకంటే ఇలా సహయోగం జరగనప్పుడు మీరు ఎక్కువ ముందుకు వెళ్ళలేరు. మీరు కాలానుగుణంగా, అదే వేగంతో వెళ్ళలేనప్పుడు, మామూలు జీవితం గడుపుతారు, బహుశా కష్ట జీవితం కూడా. కాలాన్ని జయించిన నాడే మీరు మానవ జన్మ, మానవ మేధస్సుకు తగినట్టుగా అసాధారణమైన జీవితం జీవిస్తారు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు