Sadhguruపార్వతీదేవికి శివుణ్ణి వివాహం చేసుకోవాలన్న కోరిక ఎంతో తీవ్రంగా ఉంది. ఇందుకు ఆవిడ కామదేవుడి సహాయం తీసుకుంది. కామదేవుడు అంటే మన్మధుడు. మన్మధుడు ఎప్పుడూ మనం మూర్ఖమైన పనులు చేసేలానే చేస్తాడు. ఈయన చెట్టు చాటు నుంచుని ఒక పూల బాణం శివుడిపైన విసిరాడు.  ధ్యానంలో ఉన్న శివుడికి అది తగిలింది. ఆయన ధ్యానంలో నుంచి కళ్ళు తెరిచి చూసేసరికే ఆయన ఎదురుకుండా అందంగా ఉన్న పార్వతీదేవి కూర్చుని ఉంది. ఆవిడని చూసేసరికే ఆయనలో ఏదో జరిగి  ఆవిడ పట్ల కోరిక కలిగింది. ఆయన నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? అని చుట్టుపక్కల చూసేసరికీ, ఆయనకి చెట్టు చాటున ఉన్న కాముడు తన విజయాన్ని చూసి మురిసిపోతూ కనిపించాడు. ఆయన “నువ్వు నా సాధనకి భంగం కలిగించి, నాలో కోరిక కలిగేలాగా చేస్తావా?" అని ఆయన మూడో నేత్రం తెరచి కామదేవుణ్ణి భస్మం చేసాడు.

ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏవిటంటే, ఏ కోరికైనా సరే, ఏ కామమైనా సరే మనకు అంతర్ముఖంలో కలిగేదే.

ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏవిటంటే, ఏ కోరికైనా సరే, ఏ కామమైనా సరే మనకు అంతర్ముఖంలో కలిగేదే. ఆయన మూడో నేత్రం తెరవడం అన్నది అంతర్ముఖంలోకి తెరిచి చూడడం అని అర్ధం. అంతేకానీ ఆయన చెట్టు చాటున ఉన్న ఓ మనిషిని భస్మం చేశారు అని అర్ధం కాదు. ఆయన అంతర్ముఖ నేత్రం తెరిచి ఆయనలో ఉన్న కామాన్ని దహించారని  అర్ధం. మనకు భౌతికమైన విషయాలను చూడటానికి ఈ రెండు నేత్రాలు సరిపోతాయి. మనం అభౌతికమైనది చూడాలి అన్నప్పుడు మనకు మరో నేత్రం అవసరం. ఇది అంతర్ముఖ నేత్రం. ఇదే మూడో కన్ను.

మూడో కన్ను అంటే మన నుదురు మధ్యలో నుంచి తెరుచుకుని వచ్చే కన్ను అని అర్ధం కాదు.  "మూడో నేత్రం అంటే అంతర్ముఖ నేత్రం". ఇది మనం అంతర్ముఖంగా చూడడానికి సహకరిస్తుంది. మనకి ఉన్న బాహ్యమైన రెండు కళ్ళు, బాహ్య విషయాలను చూసేందుకు ఉపయోగపడతాయి. మరి నుదిటి గురించి ఎందుకు మాట్లాడారు అంటే "ఆజ్ఞా చక్రం అక్కడ ఉంటుంది కాబట్టి. ఆజ్ఞా చక్రం మనకి అంతర్ముఖ దృష్టిని కలిగిస్తుంది". ఇదంతా కూడా అంతర్ముఖ దృష్టి  కలగడం గురించినదే.

ప్రేమాశిస్సులతో,
సద్గురు