ఈ భూమిపై మతానికి గల అసలైన మూలాధారాలను ఆలోచించడానికి తగినంత మేధస్సు మనకు ఇప్పుడు వుంది. మతం మన అంతరంగంలో వేసే ఒక అడుగు. ఇది  మానవుడు తనతో తాను సన్నిహితంగా మెలగ కలిగే  ఒక సాధనం. ఇది వీధుల్లో నిర్వహించుకునే మత కార్యక్రమాల వంటిది కాదు. ఇది మనల్ని సృష్టించైన సృష్టికర్త వైపు వేసే అడుగు. మీ శరీరాన్ని మీరు గమనించితే, ఈ సృష్టి మూలం మీలోనే ఉందని మీరు చూడవచ్చు. ఇది సృష్టికర్త వైపు వేసే అడుగు అని మీరు అనుకున్నపుడు, ఇది మీలోనికి సహజంగా వేసే అడుగు అవుతుంది. అది మీరు మాత్రమే చేయగలరు.

ఒక సమూహాన్ని అంతరంగంలోనికి తీసుకొని వెళ్ళలేము. మనకు ఏమి కావాలంటే అందరూ ఒక్కటనే సార్వత్రిక మతం. నేను సార్వత్రిక మతం అన్నప్పుడు, అందరికి ఒకే మతం అని నేను చెప్పడం లేదు, మనలో వున్న ప్రతి ఒక్కరికి ఒక మతం వుండాలని నేను చెబుతున్నాను. ఈ భూమిపై ఏడు బిలియన్ మంది ప్రజలు వున్నారు, కాబట్టి మనకి ఏడు బిలియన్ ఉండచ్చు. మరి సమస్య ఏమిటంటే ఈ మతాలన్నీకొందరిచే నిర్వహించబడటం. ఇందువల్ల ఏదైతే అందమైన ప్రక్రియగా ఉన్నదో అది కొందరి అసహ్యంగా తయారయ్యింది.

దైవాన్ని ఒక రూపంతో, నిరాకరంగానో ఆరాధించావచ్చు లేదా అసలు దైవమే లేదు అనే భావన కలిగి వుండవచ్చు..
ఈ సందర్భం ద్వారానే భారతీయ సంస్కృతి అభివృద్ధి చెందింది. మనం దీనిని సనాతన ధర్మము అని పిలుస్తాం, అంటే శాశ్వత మతం ఏదైతే వుందో అది ఎల్లప్పుడూ అనుగుణంగా వుంటుంది. ఇందులో మీ దైవాన్ని మీరే ఎన్నుకోవచ్చు – అది పురుష దైవారాధన కానీ, స్త్రీ దైవారాధన కానీ, జంతు లేదా వృక్ష దైవారాధన కానీ దేనినైనా మీరే ఎన్నుకోవచ్చు - మీకు ఈ స్వేచ్ఛ కేవలం ఈ సంస్కృతి మాత్రమే కలుగ చేస్తుంది. దీనినే ఇష్టదేవత అని పిలుస్తాము, అంటే మీరు దైవారాధనను స్వంతంగా ఎంచుకోగలడం. ప్రతి వ్యక్తి తన జీవితంలో తనకు ఏది ఉత్తమమో నిర్ణయించుకోగల స్వేచ్ఛ కలిగి వుంటాడు. ఆ వ్యక్తి తనకు తానే దైవాన్ని సృష్టించుకొని, ఆ ప్రక్రియకు తనని తాను అంకితం చేసుకోగలడు - ఎందుకంటే ఇది కేవలం దైవం గురుంచి కాదు, ఇది జీవితం పట్ల ఆరాధన, పూజా భావం తీసుకురాగల గొప్ప లక్షణం గల ప్రక్రియ.

మతం ముందుగా ప్రారంభం కావడానికి ఇదే అసలు కారణం. మీరు ఒక కోతిని ఆరాధించవచ్చు, అదే సమయంలో నేను ఒక ఏనుగును ఆరాధించవచ్చు. మరి సమస్య ఏమిటి? మీరు కోతిని ప్రేమించేవారు, నేను ఏనుగును ప్రేమించేవాడిని, అది మంచిదే. రేపు, మన దైవాలను మార్చుకోవాలని అనుకున్నా మనం అది కూడా చేయగలం. ఈ స్వేచ్ఛ కేవలం ఈ సనాతన సంస్కృతిలో మాత్రమే ఇవ్వబడింది. అందుకే ఇది శాశ్వత మతంగా సూచించబడింది ఎందుకంటే ఇది కఠినమైందిగా గాక ఒక స్వేచ్ఛ కలిగి వుంటుంది. దైవాన్ని ఒక రూపంతో, నిరాకరంగానో ఆరాధించావచ్చు లేదా అసలు దైవమే లేదు అనే భావన కలిగి వుండవచ్చు,  మీరు ఏ దారినైనా ఎన్నుకొనే స్వేచ్ఛ ఈ సంస్కృతిలో వుంటుంది. ఇక్కడ ముఖమైన విషయం ఏమిటంటే మీ జీవితం పట్ల ఆరాధ్య భావనతో ఉంటూ మిమ్మల్ని పెంచి పోషించే, ఏదైతే మీ అస్థిత్వానికి మూలమో దానికి తల వంచి నమస్కరించడం. కేవలం ప్రతి వ్యక్తి తన మతాన్ని తాను ఎంచుకునే స్వేచ్ఛ కలిగి ఉన్నట్లయితే, ఆ మతం మరొకరిచే నిర్వహించకుండా ఉన్నట్లయితే, మూఢత్వం గల వారుగా గాక మీరు మతం అర్థాన్ని లోతుగా చూస్తారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు