సద్గురు అంటే అర్ధం ఏమిటి?
సద్గురు అన్న పదానికి అర్థం ఏమిటీ? సద్గురు అన్న పదం ఒక సంబోధన(టైటిల్) కాదని, అది ఒక విశ్లేషణ అని సద్గురు మనకి చెప్తున్నారు.
 
 

Sadhguruసద్గురు అంటే విద్య లేని గురువు అని. ఎవరైనా తమ పాండిత్యం వల్ల ఏదైనా చెప్పగలిగినప్పుడు, మనం వారిని ఎన్నో విధాలా సంబోధిస్తాం. కానీ, ఎవరైతే తమ అంతర్ముఖ అనుభవంవల్ల చెప్పగలుగుతారో వారిని మనం సద్గురు అని అంటాం. సద్గురు అనేది ఒక సంబోధన కాదు. ఇది ఒక విశ్లేషణ. సద్గురు అంటే విద్య లేని గురువు. నేను దాదాపుగా నూటికి నూరు శాతం ఆధ్యాత్మిక పరంగా ఎటువంటి విద్యనూ పొందలేదు. నాకు ఎటువంటి గ్రంథాలూ  తెలియవు. నేను వేదాలను చదువలేదు. భగవద్గీతను కూడా చదవాలని ప్రయత్నం చెయ్యలేదు.

మీకు కనుక ఈ జీవం పూర్తిగా తెలిసినట్లయితే; మీకు ఈ సృష్టిలో ఏదైతే తెలియవలసి ఉందో అదంతా తెలుస్తుంది. ఎందుకంటే ఈ జీవం ఏవిధంగా జరిగిందో, అదే విధంగా ఈ సృష్టి అంతా జరిగింది. అందుకని మీరు, ఈ సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రపంచాన్నంతా వెతుకుతూ వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు అంతర్ముఖులైతే, ఈ జీవాన్ని నుంచి అః ‌ వరకు తెలుసుకోగలరు. ఏవిధంగా అయితే జీవితాన్ని తెలుసుకోవచ్చో, తెలుసుకునే అవకాశం ఉందో ఆవిధంగా మీకు తెలుస్తుంది. నేను జీవితం గురించి మాట్లాడతాను,  స్వర్గాన్ని గురించి కాదు. ఇది, ఎంతోమందికి నచ్చకపోవచ్చు. కానీ, గురువు అవ్వడంలో ఉన్న ప్రయాస అంతా, సాధకుడి ప్రశ్నను మరింత లోతుగా తీసుకువెళ్ళడమే! అంతేకానీ, అతనికి సమాధానాలను ఇవ్వడం కాదు.

నేను కనుక  సమాధానాలను ఇస్తే, మీకు ఉన్న ఎంపికల్లా కేవలం నన్ను నమ్మడం లేదా నమ్మకపోవడం.
నాకు తెలియదు అని ఒక మానవుడు అనుకున్నప్పుడు, అది అతని జీవితంలో ఒక పెద్ద ఆవశ్యకతకు ద్వారం అవుతుంది. తనకు అన్నీ తెలుసు అని అతను నమ్మినప్పుడు; అతని పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నేను కనుక  సమాధానాలను ఇస్తే, మీకు ఉన్న ఎంపికల్లా కేవలం నన్ను నమ్మడం లేదా నమ్మకపోవడం. ఒకవేళ మీరు నన్ను నమ్మారనుకోండి, మీరు సత్యానికి ఏమాత్రమూ దగ్గరగా రారు. మీరు నన్ను నమ్మకపోయినప్పటికీ మీరు సత్యానికి ఏ మాత్రం దగ్గరగా రారు. ఎవరికైనా చెప్పడానికి ఒక ఆసక్తికరమైన కథ మీ దగ్గర ఉంటుంది.. అంతే! వారు మరొకరికి చెపుతారు!! ఇది ఈ విధంగా కొనసాగుతూ ఉంటుంది. ఇలానే, ఎన్నో కథలు సంవత్సరాల తరబడి ఒకరి నుండి ఒకరికి వచ్చి, ఎంతోమంది ప్రజల జీవితాలను ఎంతో ఘోరంగా పాడుచేశాయి. అందుకని, మీరు వేదాల గురించి లేదా పాండిత్యాన్ని గురించి చూస్తున్నట్లయితే, మీరు సరియైనచోటికి రాలేదు. మీ పరమోన్నత స్వభావం ఏమిటో, అక్కడికి చేరుకోగల మార్గం ఎదో తెలుసుకోవాలనుకుంటే, మీరు సరైన ప్రదేశానికే వచ్చారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1