ఆర్ధిక, భౌతిక పురోగతి దుఃఖానికి కారణమా? అలా కావాలని లేదు. డబ్బు దుఃఖాన్నితీసుకురాదు, మూర్ఖత్వం దుఃఖాన్ని తెస్తుంది. డబ్బు సౌకార్యాలను సమకూరుస్తుంది కానీ ఆనందాన్ని తీసుకొని రాలేదు. సుఖాలు, సౌకర్యాలు,  దుఃఖాన్నెందుకు కలుగజేస్తాయి? అవన్నీ మనం కోరుకున్నవే కదా, మరి మనం కోరుకున్నవి దుఃఖానికి కారణమెందుకవుతాయి? మన దగ్గర ఒకటి ఉంది కాబట్టి, రెండవ దాని గురించి పూర్తిగా మరవటం జరిగింది . ఆదీ సమస్య.

ఒకవేళ మీరు దక్షినాదిలో భోజనానికి వెళ్ళారనుకుందాం, అక్కడున్నఊరగాయని ఎక్కువగా తిన్నారనుకోండి, తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది, కానీ సాయంత్రానికల్లా మీకు ఇబ్బందులు తప్పవు.

 ఒక వ్యక్తికి ప్రతి పూట భోజనానికి పనిచేయవల్సిన అవసరం ఉన్నప్పుడు అతను కళ్ళు మూసుకొని కూర్చోవాలనుకున్నా, అలా చేయటం కుదరదు

మరి డబ్బు, సంపద కూడా అలాంటివే. మోతాదు మించనంతవరకూ అందమైనవి.   మీ జేబులో సరిపడినంత డబ్బు ఉంటే, మర్నాడు పనికి వెళ్ళాలన్న చింత అవసరం లేదు. కళ్ళుమూసుకుని ధ్యానంలో కూర్చోవాలనుకుంటే నిశ్చింతగా మీరు అదే చేయవచ్చు కదా? ఒక వ్యక్తికి ప్రతి పూట భోజనానికి పనిచేయవల్సిన అవసరం ఉన్నప్పుడు అతను కళ్ళు మూసుకొని కూర్చోవాలనుకున్నా, అలా చేయటం కుదరదు.అందువల్ల డబ్బు దుఃఖ కారకం కాదు, మూర్ఖత్వం  ఎటువంటిదైనా సరే-  ఆర్ధికమైనా, ఆధ్యాత్మికమైనా దుఃఖ కారకమే. ప్రతిరోజు ఎంతోమంది దేవాలయాలకు వెళ్తుంటారు, బయటకు వస్తున్నప్పుడు మీకు వారు సంతోషంగా, తృప్తిగా కనిపిస్తారా? నాకు పదకొండు సంవత్సరాల వయసున్నప్పుడు  ఈ విషయం చాలా కుతూహలంగా అనిపించి, ఒక పెద్ద ఆలయం ముందు కూర్చుని అందరినీ చూస్తుండేవాడిని. లోపలికి వెళ్తూ, వెలుపలకి వస్తూ అందరూ ముచ్చట్లాడుకుంటూ  ఉంటారు. భగవంతుడి కన్నా గుడిలో కనిపించిన ఎవరి గురించో ఎక్కువ మాట్లాడుతుంటారు. లేక, ఒకవేళ అక్కడ వారి చెప్పుల జత ఎవరితోనో వెళ్ళిపోతే ఇక చెప్పనవసరం లేదు సృష్టినీ,  సృష్టికర్తనీ  కూడా శపిస్తారు.

హోటల్ నుండి బయటకు వస్తున్న వాళ్ళు ఎక్కువ సంతోషంగా, సంతృప్తిగా కనిపిస్తారు. దైవం కన్నా దోసే  ఎక్కువ పనిచేస్తోందని  చెప్పవలసి వస్తుంది , ఎంత సిగ్గుచేటు? ప్రశ్న దైవమా,దోసా,సంపదా అని  కాదు, ఏదైనా సరే మనం సరిగ్గా నిర్వహించనప్పుడు దురావస్థ తప్పదు, అంతే!

జేబులో ఉండవలసిన డబ్బు తలలోకి చేరినప్పుడు దురావస్థ తప్పదు.  డబ్బుని జేబులో ఉండనిస్తే, అది మంచిది. జేబులో చాలా డబ్బు ఉండటం మంచి విషయం కదా? అది తలలోకి వెళ్ళినప్పుడే దు:ఖమౌతుంది. డబ్బు ఉండవలసిన చోటు అదికాదు కదా.డబ్బు మీకు దుఃఖ కారకమైతే, మీ డబ్బంతా నాకు ఇవ్వండి. దానితో నేను ఈ ప్రపంచంలో ఎన్నో అధ్భుతమైన పనులు చేయగలను. అది నాకు దుఃఖ కారణం కాదు, ఎందుకంటే నేను దానిని నా తలలో ప్రవేశించనివ్వను. జేబులోనే ఉంచి అధ్భుతమైన పనులు చేయవచ్చు. డబ్బు ఒక బ్రహ్మాండమైన సాధికారిత నిస్తుంది, ఒక మంచి సాధనం.

 డబ్బు ఒక బ్రహ్మాండమైన సాధికారిత నిస్తుంది, ఒక మంచి సాధనం.. 

పాశ్చాత్యులని చూడండి , వారు బాహ్యాన్ని బాగా నిర్వహించగలరు కాని అంతరంగం విషయానికి వస్తే అది వారికి చేతకావడం లేదు. 40 శాతం అమెరికా జనాభా  వారి జీవిత పరిమాణంలో ఎప్పుడోకప్పుడు మానసిక స్వస్థత గూర్చి మందులు వాడుతున్నారని నివేదిక, అదీ కేవలం బుర్ర సరిగా పెట్టుకోవడానికి. మరి అది సంక్షేమం కాదు కదా. అంతా బాహ్యంలోనే ఉందనుకుని దాన్ని చక్కదిద్దుతూ ఆంతర్యాన్ని మర్చిపోతే జీవితం గందరగోళం అయ్యింది.

భారతదేశంలో మరోరకమైన తప్పిదం జరిగింది.అంతా స్వర్గం అనుకుంటూ  ప్రజలు తమ జీవితాన్ని నిర్లక్ష్యం చేసారు. బ్రహ్మాండమైన దేవాలయాలు నిర్మించాము  కానీ మనకు మంచి మరుగు దొడ్ది కూడా ఉండదు. ఇదీ మన సమస్య. ఆంతా పైన ఉందని నమ్మి, ఈ జీవితాన్ని నిర్లక్ష్యం చేయవచ్చు అనుకున్నాం. ఇప్పుడందుకు మరో రకమైన మూల్యం చెల్లించుకుంటున్నాం. ఈ రెంటికీ మధ్య సమతుల్యం కావాలి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు