ప్రపంచంలో ఉన్న హింసకు సంబంధించి యోగులు ఏమైనా చేస్తున్నారా??

ప్రపంచంలో ఇంత హింస చోటుచేసుకుంటున్న సమయంలో యోగులు ఏమీ చేయడంలేదు ఎందుకు అని అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానాన్ని చదవండి.
 

ప్రశ్న:ఈ ప్రపంచంలో ఇంత  హింస, వేదన ఉన్నప్పుడు, యోగులు వారు చేయవలసినది ఎందుకు చేయడంలేదు? ఆదియోగి అవసరం ఎంతగానో ఉన్న సమయంలో ఆయన ఇలా నిద్రపోతున్నాడేమిటి?

సద్గురు: ఉదాహరణకు రేపు ఉదయం ఈ భూమి మీద ఉన్న హింసనంతా నేను ఆపేస్తాను. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు? మీరు సంతోషంగా, పారవశ్యంలో అద్భుతంగా జీవిస్తారా? లేదు. మీరు క్రొత్త సమస్యలను వెతుక్కుంటారు. ఈ భూమి మీద జరుగుతున్న అతి భయంకరమైన హింస మీ మనస్సులో జరుగుతోంది. మిమ్మల్ని మీరు నిరంతరం పోట్లు పోడుచుకుంటున్నారు. నొప్పి, కష్టాలు, నిరాశ, లేదా భయాందోళన వంటి ఎన్నో రకాల పేర్లను మీరు పెట్టవచ్చు. జరుగుతోందల్లా మీ మేధస్సు మీకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. మీరు ఒక విషయం తెలుసుకోవాలి - ఒకసారి మీ మేధస్సు మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే, ఏ యోగి, ఆదియోగి లేదా ఆ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు.

మీలో కోపం లేని రోజున, మీలో ఏ చికాకు లేని రోజున, మీరు పరవశంతో తడిసిపోయి ఉన్న రోజున నన్ను కలవండి. ఆ రోజున, మేము అది పని చేసేలా చేస్తాం.
మీరు మానవజాతి చరిత్రను చూస్తే, మనం అతి తక్కువ హింస ఉన్న కాలంలో జీవిస్తున్నాము. వాస్తవానికి, అణు బాంబులతో వచ్చే హింసాకాండ మనముందు ఉంది, కానీ రోజువారీ జీవితాల్లో హింస – మునుపటితో పోలిస్తే ఇప్పుడు ఎంతో తక్కువగా ఉంటుంది. మానవ సమాజాలలో కొన్ని భ్రమలు ఉన్నాయి, అవి కూడా తొలగిపోతే చాలా బాగుంటుంది. కానీ మీరు మీ మనసులో హింసను తొలగించలేకపోతే, అది ఈ భూమి మీద నుండి ఎలా అదృశ్యమౌతుంది? మీ మనసులో ఏం జరుగుతుందో దానికి ఒక పెద్ద అభివ్యక్తమే ఈ ప్రపంచంలో జరుగుతొందంతా.

మీలో కోపం లేని రోజున, మీలో ఏ చికాకు లేని రోజున, మీరు పరవశంతో తడిసిపోయి ఉన్న రోజున నన్ను కలవండి. ఆ రోజున, మేము అది పని చేసేలా చేస్తాం. నాకో విషయం గుర్తుకొస్తోంది. నేను ఆదియోగి 112-అడుగుల ముఖం రూపకల్పన చేస్తున్నప్పుడు, నేను కొంతమంది వ్యక్తులతో పని చేసాను. మేము కోరుకున్న విధంగా ముఖాన్ని రూపకల్పన చేయడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పట్టింది. నేను వారితో దీనిగురించి చెప్పలేదు, కానీ నాకు ఎలాంటి ముఖం కావాలంటే, అది నిశ్చలంగా ఉండాలి అదే సమయంలో పారవశ్యంలో ఇంకా మత్తులో ఉండాలి. జీవిత అత్యంత అతిశయ పరిమాణం నిశ్చలతత్వమే. శూన్యం యొక్క నిశ్చలత నుండే అన్నీ వచ్చాయి. కానీ అణువుల, పరమాణువుల చిన్నపాటి కార్యకలాపాలకు మనం ఎంతో ఆకర్షితులవుతున్నాము, ఇదంతా జరిగే అతిపెద్ద దృశ్యాన్ని మనం గమనించడం లేదు. మిమ్మల్ని వీటన్నింటికీ అతీతంగా తీసుకుపోగల పరిమాణాన్ని గురించి మేము మాట్లాడుతున్నాం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు