పిల్లల పెంపకంలో మెళకువలు - 4/5

పిల్లల పెంపకం ప్రతీ తల్లిదండ్రుల జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. పిల్లలు పుట్టిన తరువాత తల్లిదండ్రుల జీవితం అంతా పిల్లల చుట్టే తిరుగుతూ ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. ఒక సందర్భంలో పిల్లల పెంపకం గురించి సద్గురు ఐదు సూత్రాలను తెలియజేసారు. ఈ సూత్రాలలో నాల్గవ సూత్రాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
 

పిల్లల పెంపకం ప్రతీ తల్లిదండ్రుల జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. పిల్లలు పుట్టిన తరువాత తల్లిదండ్రుల జీవితం అంతా పిల్లల చుట్టే తిరుగుతూ ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. ఒక సందర్భంలో పిల్లల పెంపకం గురించి సద్గురు ఐదు సూత్రాలను తెలియజేసారు. ఈ సూత్రాలలో నాల్గవ సూత్రాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.


సూత్రం - 4 : 
పిల్లలని స్వేచ్ఛగా, స్వతంత్రంగా పెరగనివ్వండి!

నిజంగా తల్లిదండ్రులు పిల్లల బాగోగులు గురించి ఆలోచించినట్లయితే, వారు తమ పిల్లలు స్వతంత్రులుగా జీవించగలిగే పరిస్థితులను కల్పించాలి. తల్లిదండ్రుల ప్రేమ వారికి ఎన్నడూ ఒక బంధనం కాకూడదు, అది స్వేచ్ఛ వైపు నడిపించే ఒక ప్రక్రియ కావాలి.

parenting5

  తల్లిదండ్రుల ప్రేమ వారికి ఎన్నడూ ఒక బంధనం కాకూడదు, అది స్వేచ్ఛ వైపు నడిపించే ఒక ప్రక్రియ కావాలి 

బిడ్డ పుట్టినప్పటినుంచి తనని తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పూర్తిగా పరిశీలించనివ్వండి. ప్రకృతి ఒడిలో కాలాన్ని గడపనివ్వండి. తనతో తాను ఉండే సమయాన్ని సద్వినియోగ పరచుకోనివ్వండి. వారికి ప్రేమని , సంరక్షణని ఇవ్వండి. అంతే కాని మీ నీతులు, ఆలోచనలు, మతాలు, పద్ధతులు వారి మీద బలవంతంగా రుద్దకండి. వారిని స్వేచ్చగా పెరగనివ్వండి. పిల్లల తెలివితేటలు సహజంగా వికసించనివ్వండి. తన కుటుంబం , భోగభాగ్యాలు , ఇలాంటి వాటిని బట్టి కాకుండా, ఒక వ్యక్తిగా తన దృక్పధాన్ని తనదైన రీతిలో అలవరచుకోనివ్వండి. అతడు పరిపూర్ణమయిన మానవునిగా, ప్రపంచము యొక్క బాగోగులు పట్టించుకునే వ్యక్తిగా ఎదగడానికి ఏది అవసరమో అది తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఎప్పుడు కూడా పిల్లవాడు తన గురించి తానే ఆలోచించుకోగలిగేట్లు, తన తెలివితేటలు తనే స్వయంగా పెంచుకునేటట్లు, తనకు ఏది మంచిదో తానే తెలుసుకునేటట్లు చేయగలగటమే తల్లిదండ్రులుగా వారికి మీరివ్వగలిగిన గొప్ప భద్రతా భావం. అప్పుడే అతడు పరిపూర్ణ మనిషిగా ఎదిగి శోభిల్లుతాడు.

 

ప్రేమాశీస్సులతో,

సద్గురు


పిల్లల పెంపకం గురించి సద్గురు అందించిన మొదటి సూత్రాన్ని ఇక్కడ చదవండి!

పిల్లల పెంపకంలో మెళకువలు - 1/5 - అనుకూల వాతావరణాన్ని కల్పించండి!

పిల్లల పెంపకం గురించి సద్గురు అందించిన రెండవ సూత్రాన్ని ఇక్కడ చదవండి!

పిల్లల పెంపకంలో మెళుకువలు 2/5 -మీ పిల్లల అవసరాలు తెలుసుకోండి!

పిల్లల పెంపకం గురించి సద్గురు అందించిన మూడవ సూత్రాన్ని ఇక్కడ చదవండి!

పిల్లల పెంపకంలో మెళకువలు – 3/5 - మీ పిల్లల నుండి మీరు నేర్చుకోండి!
 

 

 
 
 
 
Login / to join the conversation1
 
 
5 సంవత్సరాలు 10 నెలలు క్రితం

[…] పిల్లల పెంపకంలో మెళకువలు – 4/5 – పిల్ల… […]