పసుపు అందించే నాలుగు అద్భుతమైన లాభాలు

పసుపు అందించే నాలుగు అద్భుతమైన లాభాల గురించి సద్గురు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.
Turmeric Benefits
 

 

1.పసుపుతో ఆరోగ్య పరిశుద్ధి ప్రయోజనాలు

పసుపు రక్తాన్ని శుద్ధం చేసి, మీ శక్తికి ఉత్తేజాన్ని తీసుకువస్తుంది. పసుపు కేవలం మీ శరీర వ్యవస్థ పై మాత్రమే గాక, మీ శక్తి వ్యవస్థపై కూడా గొప్ప ప్రభావం చూపుతుంది. పసుపు శరీరాన్ని, రక్తాన్ని, శక్తి వ్యవస్థలను శుద్ధి / శుభ్రం చేస్తుంది. మీ శరీర శుద్ధి కొరకు చిటికెడు పసుపును తీసుకొని, బకెట్ నీళ్ళలో కలిపి స్నానం చేస్తే – మీ శరీరం ప్రకాశవంతం అవుతుంది.

2.పసుపుతో గళ్ళ/కఫము నివారణ - ఆరోగ్య ప్రయోజనాలు

 

ఎవరైతే శీతల సంబంధిత వ్యాధులతో తరచూ

ముక్కు రంధ్రాలు మూసుకుపోయి బాధపడుతున్నారో, వారు వేప, మిరియాలు, తేనె, పసుపు కలిపిన మిశ్రమ ద్రావకాన్ని తీసుకుంటే ఉపశమనం పొందుతారు.  10 నుంచి 20 మిరియాల కంకులను గట్టిగా  నలగ్గొట్టి / చూర్ణం చేసి రెండు చెంచాల తేనెలో కలిపి రాత్రి పూట అలానే ఉంచి (8 నుంచి 12 గంటలు), ఉదయాన్నే ఆ ద్రావకాన్ని తీసుకుంటే గళ్ళశ్రావం నుంచి ఉపశమనం పొందుతారు. పసుపు, తేనె కలగలిపిన ద్రావకాన్ని తీసుకున్నా ఇలాంటి ఫలితాన్నే మీరు పొందవచ్చు. పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటే,  గళ్ళశ్రావం నుంచి సహజంగా ఉపశమనం పొందుతారు.

3.పసుపుతో కాన్సర్ నివారణ - ఆరోగ్య ప్రయోజనాలు

కాన్సర్ ఒక వ్యాధి కాదు, కాన్సర్ అంటే మీ శరీరం, అందులోని కొన్ని కణాలు  మీకు వ్యతిరేకంగా పనిచేయడం.  శరీరాన్ని ఎప్పటికప్పుడు నిర్ణీత కాలంలో శుభ్రం చేసుకోవడం ద్వారా కాన్సర్ నివారించవచ్చు. పొద్దున్నే పరకడుపుతో పసుపు, తీసుకోవడం వల్ల అది శరీరాన్ని బాగా సమర్థవంతంగా శుద్ధి చేస్తుంది. ఇది మీకు కాన్సర్ వచ్చిన తరువాత సమర్థవంతంగా పని చేయకపోవచ్చు, కాకపోతే, ఒక గోళీ పరిమాణం అంత(ఉండ) పసుపు, వేప ప్రొద్దున్నే మింగితే అది శరీరాన్ని బాగా సమర్థవంతంగా శుద్ధి చేసి, కాన్సర్ కారక కణాలను మీ శరీరం నుండి తొలగిస్తుంది.

4.యోగా సాధనకు పసుపుతో ప్రయోజనాలు

మీ శరీరంతో సహా ఈ భూమి నుంచే మీరు పొందే ప్రతీ వస్తువు కొంత జడత్వం కలిగి ఉంటుంది. కాబట్టి ఆ జడత్వాన్ని కనీస స్థాయిలో ఉంచి,  చైతన్యవంతంగా ఉండటం చాలా ముఖ్యమైంది. మీరు ఎంతసేపు నిద్ర పోతున్నారు, ఎంత చురుకుగా ఉన్నారు, ఎంత జడత్వాన్ని కలిగిఉన్నారు వంటి విషయాలను గమనించడం ద్వారా యోగా సాధన మీ శరీరంపై ఎంతమేరకు ప్రభావం చూపుతోందో లేదో అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. మీ శరీరం కొంత స్థాయిలో శక్తిని సూక్ష్మ కణాలకు అందించకపోతే మీలో మందగొండితనం / జడత్వం స్థాయి పెరుగుతుంది. వేప, పసుపు మిశ్రమ ద్రావకాన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని ప్రతి సూక్ష్మ కణాలకు శక్తి అందచేయబడుతుంది. వేప, పసుపు మిశ్రమ ద్రావకం భౌతికంగా సహాయం చేస్తుంది కాని యోగా సాధన కూడా భౌతికంగా శరీర ఆరోగ్యానికి సహకరిస్తుంది.

సాధన ద్వారానే గాక స్ట్రాంగ్ కాఫీ లేక నికోటిన్ వంటి ఉత్ప్రేరకాల ద్వారా శరీరంలో అపారమైన శక్తిని ఉత్పత్తి చేయవచ్చు – కానీ అది శరీరంలోని ప్రతి సూక్ష్మ కణాలకు  శక్తి అందచేయలేదు, ఒకవేళ చేసినా అది ఎక్కువ కాలం నిల్వ వుండలేదు. శరీరంలో శక్తి నిల్వ ఉండటానికి బదులు అది ఒక వ్యక్తీకరణగా మారితే,  అందువల్ల కేవలం మీ శరీరం, మనస్సు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్నా సమాజంపై కూడా ఆ చెడు ప్రభావం  పడుతుంది. మనం శరీరంలో శక్తిని ఉత్పత్తి చేసినపుడు, అది  సులభంగా బయటకు వచ్చేదిగా కాక ఆ శక్తిని మనం అదుపులో ఉంచుకొని అవసరం అయినపుడు దానిని ఉపయోగించుకోవడం ముఖ్యం.

వేప, పసుపును గోరువెచ్చని నీళ్ళు, కొద్దిపాటి తేనేతో కలిపి తీసుకోవడం వల్ల శరీరం శుద్ధి అయి, శరీరంలోని ప్రతి సూక్ష్మ కణాలకు శక్తి అందచేయబడుతుంది. మీరు సాధన చేసినపుడు అది మీ కండరాలను వదులు చేసి సులభంగా వంచే శక్తిని అందచేస్తుంది. అలా కండరాలు వదులు అయ్యే గుణం మీ శరీరాన్ని శక్తివంతమైన సాధనంగా మారేందుకు ఉపకరిస్తుంది. మీరు ఆసనాలను చేసే సమయంలో ఇది గమనిస్తారు - మీ శరీరం ఒక విధమైన శక్తితో ఉత్తేజంగా మారుతుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు