పళ్ళు, పండు గుమ్మడి సలాడ్

 

కావాల్సిన పదార్థాలు :

పండు గుమ్మడి     -  1 కప్పు ముక్కలు

దానిమ్మ గింజలు  -  1 కప్పు

ద్రాక్ష (ఆకుపచ్చని)-  1 కప్పు (గింజలు లేనివి)

నువ్వులు            -  1 టీస్పూను (వేయించుకోవాలి)

తేనె                     -  1 టీస్పూను

దాల్చినచెక్క         - చిన్న మొక్క

ఉప్పు                  -  చిటికెడు

నిమ్మరసం           - 1 టీస్పూను

చేసే విధానం :

గుమ్మడి చెక్కుతీసి, చిన్న ముక్కలు చేసి ఒక గిన్నెలు నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తరువాత వడకట్టి ఒక ప్లేటులో ఆరపెట్టుకోవాలి. తరువాత ఆకుపచ్చ ద్రాక్ష, దానిమ్మ గింజలు కలిపి ఉంచుకోవాలి. మిక్సీలో తేనె, దాల్చినచెక్క ఉప్పు, నిమ్మరసం వేసి పేస్టు చేసి పెట్టుకోవాలి. ఈ పళ్లల్లో మిక్సీలో వేసిన పేస్టు, వేయించుకున్న నువ్వులు వేసి అన్నీ కలుపుకోవాలి. అందరికీ వడ్డించాలి.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1