ఇటీవల సద్గురుతో ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి గారు సంభాషించారు. ఇందులో భాగంగా స్త్రీల గురించిన ప్రశ్నకి సద్గురు సమాధానాన్ని ఈ వ్యాసంలో చదవండి.

ఎమ్.ఎమ్.కీరవాణి:  వేరే దేశాల స్త్రీలతో పోలిస్తే మన స్త్రీల గురించి ఏది ముఖ్యమైన విషయమో మీరు చెప్తారా..?

సద్గురు:  మీరు నన్ను సమస్యలో పెట్టాలనుకుంటున్నారా..?

ఎమ్.ఎమ్.కీరవాణి:  మన భారత స్త్రీ వేరే స్త్రీలతో పోలిస్తే, ఎలా ఉన్నతమైనది..? ఎలా విభిన్నమైనదో చెప్పగలరా..?

సద్గురు: నాకు, మనం కేవలం మన దృష్టి అంతా స్త్రీల మీదే ఎందుకు పెడుతున్నామో అర్థం కావడంలేదు. మనం వాళ్ళని సరైనవాళ్లు లేదా సరి కానివాళ్లు అని మనం నమ్ముతున్నాం. మన దృష్టిలో పురుషులెప్పుడూ సరైనవారే. మనం స్త్రీల గురించి, వీళ్ళు సరైనవాళ్లు అవునా ..కాదా? అని చూస్తున్నాం. ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ప్రకృతి స్త్రీలకు మరింత బాధ్యతను ఇచ్చింది. ఒక బిడ్డని కనడం, పసితనంలో ఆ బిడ్డ జీవితంపై ఎంతో ప్రభావం చూపించగలగడం - వంటివి. నేను ఒక బిడ్డను కనడం అన్నప్పుడు, కేవలం పునరుత్పత్తి గురించి మాత్రమే ఆలోచించకండి. మనం అందరం కూడా అలానే పుట్టాం. మీరు కనుక సహజంగా పుట్టి ఉంటే, మీరొక స్త్రీలోనే రూపు దిద్దుకున్నారు. నేను మామూలుగానే పుట్టాను. కొంతమంది ఎక్కడినుంచో ఊడిపడ్డాం - అనుకుంటుంటారు.

మన జీవితాలు ఒక స్త్రీ శరీరంలోనే మొదలౌతాయి. ఈ రోజున మనం పురుషుడు-స్త్రీ అనే చిన్న విభిన్నతలని ఎంతగానో పెద్దదిగా చేసేసాం. మీరు కేవలం అలా రోడ్డు మీద నడిచి వెళ్లడానికి ఎవరైతేనేం..? స్త్రీనా..? పురుషుడా..? అని ఎందుకు చూడాలి? కేవలం బాత్ రూముల్లో, బెడ్ రూముల్లో మాత్రమే ఈ విషయం సంబంధించినదై ఉండాలి. మీరు పని చేసేటప్పుడు, రోడ్లమీద, మరేదైనా చేసేటప్పుడు, పురుషుడైతే ఏమిటి..?స్త్రీ అయితే ఏమిటి..? కేవలం వాళ్ళను మానవులుగా చూడవచ్చు కదా..? మనం మన దృష్టిని దీని మీద చాలా ఎక్కువగా  పెడుతున్నాం.

మానవ హక్కులు అనండి

మనల్ని మనం మన శరీర అంగాలతో, చాలా ఎక్కువగా గుర్తించుకుంటున్నాం. వారి తెలివితేటలూ, వారి సామర్థ్యాలూ.. వీటన్నిటితో మనం వారిని గుర్తించడం లేదు. కేవలం, వారి లింగంతో మాత్రమే మనం వారిని గుర్తిస్తున్నాం. ఈ విధమైన రీతిలో ప్రపంచాన్ని చూడకూడదు. మన జీవితంలో కొన్ని అంశాలకే స్త్రీనా.. పురుషుడా - అన్నది ముఖ్యం. కానీ,  మిగతా వాటికి మీకెంత తెలివితేటలు ఉన్నాయి, మీకెంత సామర్థ్యం ఉందీ - అన్నది ముఖ్యం. లింగభేదం అన్నది కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే అవసరమైనది. మిగతా వాటిల్లో, అది అసలు సమస్యే కాకూడదు. అప్పుడే,  సమానత్వం అన్నది వస్తుంది. మీరు, స్త్రీల హక్కుల గురించి మాట్లాడుతూ ఉండవలసిన అవసరమే లేదు. మనం మానవ హక్కులు అనాలి. అప్పుడు స్త్రీలూ అందులో భాగం అయిపోతారు. అంతే..!

మీరు స్త్రీత్వాన్ని పూజించకపోతే, అప్పుడు మీ ఇల్లు కూడా ఒక సంత లాగానే ఉంటుంది.

మన దేశంలో ఎంతో కాలం వరకూ మనం ఎన్నో అద్భుతమైన విషయాలని సంరక్షించాం. కానీ, ఆ అద్భుతమైన విషయాలు కొన్ని అపార్థాల వల్ల ఎంతో ఘోరమైన రూపాలు దాల్చాయి. నేను ఘోరమైన రూపాలు అని అన్నప్పుడు.. చిన్న- చిన్న విషయాలు, ఏవి మనం స్త్రీలని సంరక్షించడానికి, స్త్రీల శ్రేయస్సుకై చేశామో, అవే వివక్షగా మారిపోయాయి. వీటివల్ల, మనం ఎంతో ఘోరమైన పనులు చేస్తున్నాం. మనం ఒకసారి వెనుదిరిగి, ఈ చిన్న విషయాలని ఎందుకు తయారు చేసుకున్నాం అన్నది చూడాలి. వీటిని మనం సరిగ్గా తీసుకోకపోతే, పాశ్చాత్య దేశాలవాళ్లు స్త్రీలని-పురుషులని సమానం చేయాలని అనుకుని మనకంటే ముందడుగు వేస్తారు. సమానమైన అవకాశాలు అన్నవి - సరిపోతాయి. అంతేకానీ, సమానత్వం అన్నది అక్ఖర్లేదు.

ప్రకృతి ఎందుకు స్త్రీలని, పురుషులని విడి-విడిగా తయారు చేసింది..? పురుషత్వం ప్రపంచంలో ఎంత ముఖ్యమైనదో  స్త్రీత్వం కూడా అంతే ముఖ్యమైనది. కానీ, ఈ రోజున సమానత్వం అన్న పేరుతో స్త్రీలు ఎలా తయారైపోతున్నారంటే - వారు పురుషుల్లాగా ప్రవర్తించడం మొదలు పెడుతున్నారు. ఎందుకంటే, వాళ్ళు అలా ఉంటేనే విజయం సాధించగలం -  అని అనుకుంటున్నారు. వాళ్ళు పురుషుల్లా నటించాలనుకుంటున్నారు. ఈ రోజున చూసారా, స్త్రీలు ఈ విధంగా అనడం మొదలుపెట్టారు.

ఎందుకంటే మీరుగనుక స్త్రీత్వాన్ని నాశనం చేశారనుకోండి, మీరు స్త్రీలని బానిసలుగా చేసేసినట్లే..! మీరు స్త్రీత్వాన్ని పూజించకపోతే, అప్పుడు మీ ఇల్లు కూడా ఒక సంత లాగానే ఉంటుంది. ఇప్పుడు కూడా చూడండి, మీ వివాహాలూ సంతల్లానే తయారౌతున్నాయి. వాళ్ళు పెళ్లి చేసుకునే ముందరే, ఒకవేళ మనం విడిపోతే - ఎవరికి ఏమి వస్తుంది - అని ఎగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకునే ముందరే ఒక ఎగ్రిమెంట్ అంటే, మనిద్దరం కనుక విడిపోతే నా బ్యాంక్ బ్యాలన్స్ నాది, నీ బ్యాంక్ బ్యాలన్స్ నీది. ఇప్పుడు ఇద్దరూ ఒక్కటిగా ఎలా అవ్వగలరు..?? కానీ ఇక్కడ ఇద్దరు జీవాలు ఒక్కటిగా జీవించగలిగితేనే సంతోషం ఉంటుంది.

మీరు సమానత్వం అన్న పేరుతో  ఇలా చేస్తే, అప్పుడు, మీకు ఒకరితో ఒకరు సంతోషంగా ఉండడం అన్న ఆలోచనే తెలియదు. ఇల్లు ఒక సంత లాగా తయారైపోతుంది. మీరు సమానత్వం గురించి మాట్లాడకూడదు. మీరు ఒకరి పట్ల ఒకరికి ఉన్న బాధ్యత గురించి మాట్లాడాలి.