మార్మికత /మర్మజ్ఞం అనేదుందని అంటారు కానీ నిజానికి అటువంటిదేదీ లేదు . మానవులు అజ్ఞానంలోనే జీవిద్దామని భీష్మించుకుని కూర్చున్నారు కాబట్టే మార్మికత అనేదుంది. వారికి ఏవేవి తెలియవో వాటన్నిటికీ  కూడా 'మర్మజ్ఞం ' అనే ముద్ర వేసేసారు . ఔనా ? అందులో మర్మమేదీ లేదు, ఉన్నదంతా అక్కడే ఉంది, అందులోనే ఉంది..! మీ పరిమితులూ, నిర్బంధనలూ, ఇదిగో ఇవే వాటికి మర్మాన్ని ఆపాదిస్తాయి. అంతే  కదా? మీరు దేన్నైనా అర్ధం చేసుకోలేకపోయినా, గ్రహించలేకపొయినా దాన్ని మర్మమని అనేస్తారు, అంతే కానీ అదేదో దాని తత్త్వం కాదు.

వెలుగు లేకపోవడమే చీకటి. అవగాహనా రాహిత్యమే  చీకటి . జ్ఞాన రాహిత్యమే చీకటి . ఇదే సర్వోత్తమమైనది.  

మరి, ఈ అంధకారం అవతల ఏముంది ? మీ గ్రహణశక్తికి మించినదంతా మీకు అంధకారమే, అదే ఉన్నదంతా  కూడానూ !మీరు గ్రహించగలిగేది, ఎప్పుడూ కూడా చాలా చిన్నగా ఉంటుంది . మీరు కొన్ని వేల పాలాపుంతల్ని గ్రహించినప్పటికీ  ఈ బ్రహ్మాండమైన సృష్టిలో అది చిన్నదే ! మీకు తెలియనిదంతా కూడా మీకు అంధకారంగానే గోచరిస్తుంది . అయితే అంధకారం విషయానికొస్తే ...... ఈ చీకటి ఓ పదార్ధం కాదు, వస్తువు అంతకంటే కాదు. వెలుగు లేకపోవడమే చీకటి. అవగాహనా రాహిత్యమే  చీకటి. జ్ఞాన రాహిత్యమే చీకటి . ఇదే సర్వోత్తమమైనది. మీకు తెలియనిది ఎంతో ఉంది, అందుకే మీకది అంధకారంలా గోచరిస్తుంది. అయితే ఇదేదో వస్తువు కాదు, మీ అవగాహనకి మించినది కాబట్టి, ఇదో అంధకారంలా అనిపిస్తుంది .

 ఈ అజ్ఞానాన్ని శొధిస్తేనే కదా, జ్ఞానం ఉద్భవించేది. జ్ఞానాన్ని శోధిస్తే మీకు కొత్తగా ఒరిగేదేమీ లేదు.  

అందుకని ఈ సమస్త అంధకారాన్ని, మీ అవగాహనకి మించి ఉన్నదాన్ని, మనం 'శివ ' అని సంభోదిస్తాము. ఎందుకంటే ఇది అనంతంగా విస్తరించి ఉంది కాబట్టి.  ఇది అనంతంగా విస్తరించి ఉన్న అజ్ఞానం, అంతే కానీ అనంతంగా విస్తరించి ఉన్న జ్ఞానం మాత్రం కాదు. జ్ఞానమెప్పుడూ పరిమితమైనది. అది అపారమైనదే కావచు, కానీ పరిమితమైనది. అజ్ఞానం మాత్రమే అపరిమితమైనది.. అందుకే శివుణ్ణి 'భోళా శంకరు 'డంటారు . ఎందుకంటే ఆయన అజ్ఞానానికి అధిపతి. వినసొంపుగా లేదుకదూ ? మీకు నచ్చలేదు కదూ ? మీ దృష్టిలో ఆయన జ్ఞానానికి అధిపతి అయ్యుండాలి. నిజమే ,ఆయన అది కూడా! ఆయన జ్ఞానేశ్వరుడే. కాదనలేదు, కానీ అది ఆయనలోని ఓ చిన్న అంశం మాత్రమే. నిజానికి ఆయన అజ్ఞానానికి అధిపతి, ఎందుకంటే విశాలమైన /అపారమైన ఈ అస్తిత్వంలో ఉన్నదల్లా అజ్ఞానమనే అంధకారమొక్కటే ! 'అయ్యో అయితే నేనిన్నాళ్ళూ ఈ అజ్ఞానాన్ని కోరుకుంటున్నానా?'. ఈ అజ్ఞానాన్ని శొధిస్తేనే కదా , జ్ఞానం ఉద్భవించేది ? జ్ఞానాన్ని శోధిస్తే మీకు కొత్తగా ఒరిగేదేమీ లేదు. మళ్ళీ అదే చెత్త పునరుత్పత్తి ఔతుంది , కాకపొతే మరో కొత్త రూపంలో, అంతే. మీరు అజ్ఞానాన్ని శోధిస్తేనే జ్ఞానమనేది పుడుతుంది. ఈ అజ్ఞానం నుండే అక్షయమైన జ్ఞానాన్ని తోడుకోవచ్చు.. అంతే కానీ, మీకు ఇదివరకే తెలిసినదాన్నుండి ఇంకా ఏం తెలుసుకుంటారు? ఆ తెలిసిన విషయాన్నే వేల రూపాల్లో ముస్తాబు చేసి మురిసిపోవచ్చు, అంతే . అందుకే ఈ అంధకారం వెనకాల ఉన్నదాన్ని చూసే ప్రయత్నం చేయండి. దాని వెలువల ఉన్నది కూడా అంధకారమే !

ప్రేమాశీస్సులతో,
సద్గురు

flickr