ఆలోచిస్తున్నారా లేక జీవిస్తున్నారా??

 

పాశ్చాత్య సంస్కృతిలో ఆలోచనకి చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. ఈ పాశ్చాత్య తత్త్వవేత్తల సిద్దాంతం ఏమిటంటే "నేను ఆలోచిస్తున్నాను కాబట్టి, నేను ఉన్నాను" అని. వీరు ఆలోచనకి ఇచ్చిన ప్రాముఖ్యత ఇటువంటిది. కాని మీరు చెప్పండి ఏది నిజం? మీరు ఉన్నారు కాబట్టి మీరు ఆలోచిస్తున్నారా? మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు ఉన్నట్టా? చెప్పండి..?? మీరు ఉన్నారు కాబట్టి మీరు ఆలోచిస్తున్నారు. మీకు ఆలోచన తప్ప మరే విధంగానూ జీవితం అనేది తెలియనప్పుడు మీరు ఇలా అనుకుంటారు. ఇప్పుడు నాకు ఏ ఆలోచనా లేదు. ఇక్కడ కూర్చున్నాను అనుకోండి నాకు ఒక్క ఆలోచన కూడా లేదు. అంటే “నేను లేను” అనా అర్ధం? నేను ఇక్కడ అంత శక్తివంతంగా కూర్చున్నాను కాబట్టి ఆలోచన అన్నది చాల చిన్న విషయం. నేను ఆలోచించ గలను, ఆలోచించే సామర్ధ్యం లేదని అర్ధం కాదు. కాని అది నాకు చాలా చిన్న విషయం, ఎందుకంటే నా ఉనికి అనేది చాలా పెద్ద విషయం. మనుషులు ఈ ఆలోచన అనేదాన్ని ఉనికి కన్నా పెద్ద విషయంగా చేయాలని అనుకుంటున్నారు.

"మీరు పదిమంది కళ్ళలో బాగున్నట్టు కనబడాలి" అనుకుంటున్నారు. కాని ఈ బయట విషయాలు  మార్చినంత మాత్రానా మీలో మీరు ఎలా ఉన్నారు అనేది మారదు. 

అరవై డెభై దశాబ్దల లో ఈ విషయానికి చాలా ప్రాముఖ్యతనివ్వాలని చూసారు. ఏమైంది వారందరికీ? వారు పిచ్చివారై పిచ్చి ఆసుపత్రిలోనైనా ఉన్నారు లేదా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే అదే జరుగుతుంది. మీ ఆలోచన శక్తిని ఒక స్థాయి దాటి పెంచాలి అని చూస్తె అదే జరుగుతుంది. మీరు మీ పరిస్థితులని కొంత వరకు మార్చి, అదే మరొకరి మీద విజయం సాధించడం అని అనుకోవచ్చు. మీరు మీ చదువు తో చేస్తున్న పని అదే కదా. మీ ఆలోచనలని పెంచుకుంటున్నారు. మీరు డబ్బులు సంపాదించగలరు, జనం మిమ్మల్ని విజయం సాధించారని కూడా అంటున్నారు. కాని మీలో మీకేం ఉన్నతి జరిగింది? ఇంకా మీలో మీరు అయోమయంగానే కదా ఉన్నారు?

"మీరు పదిమంది కళ్ళలో బాగున్నట్టు కనబడాలి" అనుకుంటున్నారు. కాని ఈ బయట విషయాలు  మార్చినంత మాత్రానా మీలో మీరు ఎలా ఉన్నారు అనేది మారదు. అవునా? ఎవరో మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఎందుకంత ముఖ్యం? పోనీ అది వదిలేసినా  మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో అది అంత ముఖ్యమని ఎందుకు అనుకుంటున్నారు? మీ గురించి మీరు ఏమి ఆలోచిస్తున్నారో దానికి సృష్టిలో ఎటువంటి ప్రాముఖ్యతా లేదు. అది మీకు ఊరట కలిగిస్తూ ఉండచ్చు. కాని సృష్టిలో దానికి ఎలాంటి ప్రాముఖ్యత ఉందో చెప్పండి?

నేను మీకు ఒక జోక్ చెప్పనా.. ఓసారి ఇలా జరిగింది. పోప్ గారు మరణించారు, ఇప్పుడున్న ఆయన కాదు. ఇంతకంటే ముందర ఉన్న ఆయన. సరే పోప్ మరణించారు, ఆయన సహజంగానే స్వర్గానికి వెళ్ళారు. స్వర్గం గేటు దగ్గర నించున్నారు. అప్పుడు ఒక పెద్ద కుర్చీ మీద పీటర్ కుర్చుని సిగరెట్టు తాగుతూ ఉన్నాడు. అక్కడ  సిగరెట్టు నిషేధం కాదులెండి. సరే ఈ పీటర్, మన పోప్ గారి వింత టోపీ, వేషం చూసి ఆ సిగరెట్టు పొగని ఆయన మొహంలోకి వదులుతూ "ఎవరు" అని అడిగారు. పొప్ కి చాలా కోపమొచ్చింది. "నేనెవరో తెలిదా? నేను పోప్ " అని చెప్పారు. సరే, అందరు రొజూ చాలా మంది , వారి పొడుగు కథలతో వస్తుంటారు, నికేమో పొడవాటి టోపీ కూడా ఉంది. సరే నువ్వెవరో చెప్పు, అని అన్నాడు. "నాతో ఇలా ఎలా మాట్లాడతావు, నేను భూమి మీద భగవంతుడి దూతను, తెలుసా ?" అన్నారు. సరే, ఇక్కడినుంచి బయలుదేరు అని పీటర్ అన్నాడు.

"నాతో ఇలా మాట్లాడుతున్నావేంటి, కావాలంటే భగవంతుడిని అడుగు, నేను ఆయన దూతను" అని అన్నారు. పీటర్ అప్పుడు కొద్దిగా గొంతు పెంచి ఇలా అన్నాడు "బాస్, ఇక్కడ ఎవరో భూమి మీద మీ దూతని  అని చెప్తున్నారు. ఎం చేయమంటారు" అని అడిగాడు. అప్పుడు లోపల్నించి ఒక గంభీరమైన స్వరం వినిపించింది "నాకు ఎవరో తెలిదు" అని. సరే, "బాస్ కి నువ్వెవరో తెలీదు, పదా" అన్నారు. అప్పుడు పోప్ చాలా ఆశ్చర్య పోయారు. "అలా ఎందుకు అన్నారు , నేనెవరో తెలీదు అని ఎలా అనగలరు". సరే ఒక పని చెయ్యి నువ్వు జీసస్ ని అడుగు అని అన్నారు. అప్పుడు ఆయన గొంతు పెంచి "సన్నీ, ఇక్కడ ఎవరో ఉన్నారు, ఆయన పేరు పోప్ ట. మీ దూతనని అంటున్నారు. ఎం చేయమంటావ్" అని. అప్పుడు లోపల్నించి ఒక మృదువైన స్వరం "నాకు అలాంటివారు ఎవరూ తెలీదు" అని వచ్చింది. సరే, ఆయనకీ కూడా నువ్వెవరో తెలీదుట అని పీటర్ అనేసరికి, పోప్ కి ఎం చేయాలో అర్ధంకాలేదు. సరే ఒక పని చెయ్యి, నువ్వు హోలీ ఘోస్ట్ ని అడుగు, నేను ఆయన దూతను కూడా అని అన్నారు. పీటర్ మరోసారి గొంతుపెంచి అలానే అడిగారు. అప్పుడు లోపలనుంచి ఒక గొంతు వినిపించింది "ఆ ఈయనేనా, ఈయన నాగురించి భూమి మీద విచిత్రమైన కథలని ప్రచారం చేసాడు. మీరు ఆయన్ని ఎట్టి పరిస్థుతల్లో లోపలికి  రానివ్వొద్దు" అని చెప్పారు.

మీ ఆలోచనలు మీకు సాంత్వన కలిగించ వచ్చు , కాని వీటికి ఈ ఉనికిలో, సృష్టిలో ఎలాంటి ప్రాముఖ్యతా లేదు.

మీ ఆలోచనలు మీకు సాంత్వన కలిగించవచ్చు , కాని వీటికి ఈ ఉనికిలో, సృష్టిలో ఎలాంటి ప్రాముఖ్యతా లేదు. ఆధ్యాత్మికత అంటే ఏమిటంటే, ఉనికిలో ప్రాముఖ్యత ఉండేవాటి గురించి అని. వీటిద్వారా మీరు మీ పరిస్థితులను మార్చుకోవచ్చు కాని ఏదైతే పెరిగి పరిమితులు లేకుండా ఎదిగిపోవాలి అని చూస్తుందో, దానికి మీరు ఎంత సౌఖ్యాన్ని అందించినా తృప్తి చెందదు. దానికి అంతా కావాలి అనిపిస్తుంది. మీరు టీవీ చూసో, సినిమా చూసో, ఎవరితోనో మాట్లాడో, దాన్ని పక్కకి పెట్టగలరు. కాని మీరుగనక మౌనంగా కూర్చొని దాన్ని గమనిస్తే, అది మిమ్మల్ని ఎదో పరిమితంలేని స్థానానికి తీసుకువెళ్ళాలి అనుకుంటుంది. మీకు రెండు దారులు ఉన్నాయి - ఒకటి మీరు దాన్ని పట్టించుకోవచ్చు లేదా రెండు దాన్ని పట్టించుకోకుండా ఉండచ్చు. మీ ఆలోచన ద్వారా మీరేమి ముందుకు వెళ్ళలేరు. దాని వల్ల కొంత సామాజిక ప్రయోజనం కలిగితే కలగచ్చు, అంతే.

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1