మీ జీవితానుభూతిని మార్చుకోవటం ఎలా?
 
Participant dancing at the Mystic Eye One day program with Sadhguru in Singapore
 

సద్గురు, కొంత కాలం క్రితం వరకు భూమాతతో నాకు అద్భుతమైన సంబంధం ఉన్నట్లు అనిపించేది, దానికి నేను ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను. ఆ తర్వాత పనుల్లో మునిగిపోవటం వల్లో, సాధన సరిగ్గా చేయకపోవటం వల్లో ఈ తీవ్రత తగ్గిపోయింది. ఏం జరిగిందో మీరు చెప్పగలరా?


మీ జీవితంలో అత్యున్నతమైన అనుగ్రహం ఉన్నా సరే, దాన్ని కనుక మీరు తేలికగా తీసుకుంటే అది సన్నగిల్లటమే కాదు మీ అనుభవంలో కొంత కాలం తర్వాత అది లేనట్టే. ఇది చాల మందికి ఎప్పుడూ జరుగుతూనే ఉంది, వాళ్ళు పుట్టినప్పటి నుంచీ జరుగుతుంది. మిమల్ని మీరే చూసుకోండి లేక మీ పక్కనున్న వాళ్ళని ఎవరినైనా గమనించండి – ఎప్పుడూ ఈ జీవితం అందించే ధాతృత్వాన్ని అనుభూతి చెందుతున్నారా? వాళ్ళ చుట్టూ ఉన్న అందాన్ని ఎంత మంది అనుభూతి చెందుతున్నారు? వాళ్ళు పీల్చుకునే గాలి, తాగే నీళ్ళు, తినే ఆహరం – వీటిని ఎంతమంది నిజంగా ఆనందిస్తున్నారు? జీవితాన్ని మించిన గొప్ప ఉద్దేశమేదో ఉందని అనుకుంటున్నారు. వాళ్ళకు ఏదో ఒక సొంత లక్ష్యం ఉంటుంది.

జీవితం కాకుండా ఇంకేదో ఉద్దేశం ఉందని అనుకునేవాళ్ళు, వారే "దేవుడు"గా పని చేయటం మొదలు పెడతారు, వీళ్ళు మిగతా ప్రపంచంతో పోరాటం చేయటం మోదలుపెడతారు ఎందుకంటే వీళ్ళకు జీవితం కంటే మిగతా విషయాలు గొప్పవైపోయాయి. వీళ్ళు ఎంతో దారుణమైన పనులు చేయగలరు. వీళ్ళు ఎవో నమ్మకాల వల్ల, ఆ నమ్మకాలు జీవితానికంటే ముఖ్యం అనుకుంటున్నారు. టెర్రరిస్ట్ దాడులు దీని అభివ్యక్తీకరణే. కాని ఏదో ఒ క విధంగా ప్రతీ మనిషి ఇలా చేస్తునేవున్నాడు. వాళ్ళు వేరే వాళ్ళకు హాని చేస్తుండకపోవచ్చు కాని వాళ్ళ జీవితంలోనే వాళ్ళు దారుణమైన పనులు చేస్తున్నారు. వాళ్ళు జీవితాన్ని ఏ రకంగానూ అనుభూతి చెందటం లేదు. 

మీరు జీవించటం కంటే ముఖ్యమైంది మరేదో ఉందని అనుకుంటే మరణమే వస్తుంది.

చాలా మందికి జీవితం అంటే ఒక భారంగా మాత్రమే కాదు – విషాదంగా, హింసగా మార్చుకున్నరు. ఇది వాళ్ళని ఎవరో శారీరకంగా హింసిస్తున్నారని కాదు. ఇది వాళ్ళకు భూమి మీద, జీవించటం కంటే మరేదో పని ఉందని అనుకోటం వల్లనే. నేను వైద్య పరంగా బ్రతికే ఉండటం గురించి మాట్లాడం లేదు, అసలు అన్నిటితో లయమై ఉండటం గురించి మాట్లాడుతున్నాను. ఈ విశ్వంలోని ప్రతీదానితో లయమై ఉండటమే మీ అసలు పని. మీరు ప్రతీ దానితో నిజంగా లయమై ఉంటే ఈ భూమి మీద ఉన్న ఉదారత్వం తెలుస్తుంది, ఆకాశం ఎంత అందంగా ఉందో తెలుస్తుంది, ఆవల ఏముందో తెలుస్తుంది – అన్నీ మీ అవగాహనలోకి వస్తాయి.

మీరు జీవించటం కంటే ముఖ్యమైంది మరేదో ఉందని అనుకుంటే మరణమే వస్తుంది. మీరు వైద్య పరంగా చనిపోకపోయినా మీ చుట్టూ ఉన్న ప్రతీ దానికి సంబంధించి మీరు చనిపోయినట్లే. మీరు ఇప్పటికే జీవితం నుంచి మరణానికి చేరుకుంటే మళ్ళీ తిరిగి జీవితానికి చేరుకునే సమయం వచ్చింది. మరణం ఎలాగూ వస్తుంది – దానికి తొందరెందుకూ..

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1