స్వాధిష్టాన,మూలాధార చక్రాల పర్యవసానమే మణిపూరక చక్రం. ఇది ఒక నిర్వహణ కేంద్రం. శరీరానికి మౌలికమైనవి ఇంకా పునరుత్పత్తికి సంబంధించిన అంశాలను, స్వాధిష్టాన, మూలాధార చక్రాలు కలిసి సృష్టిస్తాయి. ఈ అంశాలను మణిపూరకం కేవలం నిర్వహిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన పనే. ఎందుకంటే, మీరు సృష్టించిన దానిని, సరిగ్గా నిర్వహించలేకపోతే తర్వాత అది కనుమరుగై పోతుంది. ఎంత అందమైన తోట అయినప్పటికీ, దాన్ని ఒక నెలపాటు సరిగ్గా నిర్వహించకపోతే, మీరు దాన్ని తోట అనలేరు. అందుకని నిర్వహణ చాలా ముఖ్యమైనది. ఆ విధంగా మణిపూరక చక్రం ముఖ్యమైనది.

మణిపూర చక్రాన్ని కదపడం

72 వేల నాడులు కలిసి, తిరిగి విభజించబడే ఏకైక ప్రదేశం మణిపూరక చక్రం. దాని వల్ల, తమ మణిపూరక చక్రాన్ని వారు అనేక విధాలుగా కదపగలరు. ప్రతి చక్రాన్నీ కదపవచ్చు, కానీ ముఖ్యంగా మణిపూరక చక్రాన్ని మరింత తేలిగ్గా కదిలించవచ్చు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వారు, మణిపూరక చక్రాన్ని కదపడం చాలా ముఖ్యం. ఈ చక్రాన్ని కదపాలంటే, యుద్ధ విద్యలు - కదిలే స్థాయి నుంచి నిశ్చల స్థాయికి చేరాలి.  ఈ హింసాత్మక మరియు కష్టమైన యుద్ధ విద్యల కదలికలు అన్నీ మీరు ఏ కదిలికా లేకుండా ఉండే నిశ్చల స్థితికి చేర్చడానికే. వ్యవస్థలో నిశ్చలత ఉన్నప్పుడు, మణిపూరక చక్రాన్ని కదల్చగల సామర్థ్యం ఎంతో మెరుగుపడుతుంది. కొన్ని తూర్పు దేశ సినిమాల్లో ఈ విషయాన్ని మీరు గమనించవచ్చు.

ఓ ముసలాయన కూర్చుని ఉంటాడు. ఆయన హూఁ... అన్న వెంటనే అందరూ కింద పడిపోతారు. మణిపూరక చక్రాన్ని కదిలించే సామర్థ్యం, మీకు మరో స్థాయి శక్తిని అందజేస్తుంది. తూర్పు దేశాల యుద్ధకళా శైలిలో జరిగేదేమిటంటే, నిరంతరాయంగా మణిపూరక చక్రాన్ని అనేక విధాలుగా కొడుతూ ఉంటారు. అభ్యాసకులు పొట్టను బలపరచడానికి నిత్యం దానిమీద వందలాది పిడిగుద్దులను కొట్టించుకుంటూ ఉంటారు. దానివల్ల మంచి స్థిరత్వం ఏర్పడుతుందని అలా చేస్తారు. అది తగినంత స్థిరంగా ఉన్నప్పుడు, మీరు కావలసిన చోటకు దాన్ని కదల్చవచ్చు. మణిపూరక చక్రాన్ని నాభినుంచి దూరంగా జరిపిన కొలదీ,  ముఖ్యంగా దెబ్బల నుంచి గాయాల నుంచి తట్టుకుని నిలబడే సామర్థ్యం శరీరానికి అందుతుంది. ఇది మీ శక్తిని కదిపే అసాధారణ సామర్థ్యాన్ని అందిస్తుంది.

యుద్ధకళల్లో ఆరితేరిన వారు శక్తివంతమైన మార్గాల్లో మణిపూరక చక్రాన్ని ఉపయోగించుకునే విధానం గురించి, అనేక అద్భుతమైన కథలున్నాయి. మణిపూరక చక్రాన్ని దాని సహజ స్థానం నుంచి జరిపినప్పుడు, మీ శరీరాన్ని స్థిరంగా ఉంచడం చాలా ముఖ్యం. లేదంటే, మీరు ఎక్కువ సమయం కొనసాగలేరు. మీ ఆయుష్షు 35 నుంచి 36 సంవత్సరాలు దాటదు. మణిపూరక చక్రాన్ని దాని సహజ స్థానం నుంచి జరిపినప్పుడు, ఏదైనా కదలిక జరిగితే, మొత్తం నిర్వహణ కేంద్రమే గందరగోళానికి గురౌతుంది. నిర్వహణా కేంద్రం గందరగోళానికి గురైనప్పుడు, ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా, మీరు ఒక విచిత్రమైన మార్గంలో అంతమైపోతారు. మీ విషయంలో ఏం జరిగిందనేది ఎవ్వరూ కనిపెట్టలేరు.

ధ్వనిని విస్తరింప జేయడం

యుద్ధవిద్యలకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా శారీరక పరాక్రమాన్ని ఆశిస్తారు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తులు మాత్రం మణిపూర సాధనలో మణిపూరక చక్రానికి ధ్వనిని అందించేందుకు ప్రయత్నిస్తారు. మీరు మణిపూర చక్రానికి ఏదైనా ధ్వనిని అందిస్తే, అది శరీరం మొత్తం వ్యాపిస్తుంది. మీ వ్యవస్థలో భాగం కావాలని మీరు కోరుకుంటున్న శివ లేదా శంభో అనే శబ్ధాన్ని మనం ఉచ్ఛరించిన్నప్పుడు, మీ మణిపూర సాధనను ధ్వనితో కలిపి మీ శరీరంలోని ప్రతి భాగానికి వ్యాప్తి చేయగలరు. అప్పుడు మీ శరీరమే ఈ ధ్వనితో ప్రతిధ్వనిస్తుంది. పళని స్వామి విషయంలో ఇలాంటి సంఘటనే ఒకటి ఉంది. అయన ఎవరికీ తన పేరు చెప్పలేదు. పళని కొండల చుట్టూ అనేక అద్భుత రూపాల్లో ఆయన్ను చూసిన ప్రజలు ఆయన్ను పళని స్వామి అని పిలిచేవారు. ఏ పని చేయకుండా, ఒకే చోటు కూర్చుని, ఆయన ఎంతో మంది ఆకర్షించడాన్ని చూసి, పూజారులకు ఈర్ష్య కలిగింది. వారు ఆ ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రజలు తమ దగ్గరకు కాక, ఎమీ చేయకుండా... కనీసం తన ఆహారం కోసం కూడా బిక్షాటన చేస్తున్న ఓ మనిషి దగ్గరకు ప్రజలంతా వెళ్లడం వారికి చికాకు కలిగించింది. ఆయనకు వ్యతిరేకంగా ఏదో ఒకటి చేయాలని వారు అనుకున్నారు.

మీ మణిపూర చక్రం దగ్గరకు మీరు ధ్వనిని పంపిస్తున్నప్పుడు, అది వ్యవస్థలో పూర్తిగా వ్యాపిస్తుంది.
ఒక రోజు ఉదయం పళని స్వామి శంభో అంటూ కాలకృత్యాలు తీర్చుకున్నాడని వారు ఆరోపించారు. అది సరైనది కాదు అనేది వారి ఆరోపణ. అలాంటి సమయాల్లో శివ శబ్ధాన్ని సంబోధించకూడదని, దేవుడి పేరును ఆ విధంగా ఆయన సంబోధించి  అపచారం చేశారనే ఆరోపణను గ్రామ పంచాయితీ ముందుకు తెచ్చారు. ఆయన కళ్ళు, నోరు మూసుకుని అమాయకులైన ఆ న్యాయమూర్తుల ముందు కూర్చున్నారు. అంతలో శంభో అనే ప్రతిధ్వని  గట్టిగా బయటకు వచ్చింది. వారి విచారణ ప్రయత్నాలకు అది ముగింపునిచ్చింది. ఆ సంఘటనతో ఆయన అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించాడు. అయితే ఆయన కోరుకుంది అది కాదు కనుక, ఆయన ఆ స్థలాన్ని విడిచిపెట్టారు. మీ మణిపూర చక్రం దగ్గరకు మీరు ధ్వనిని పంపిస్తున్నప్పుడు, అది వ్యవస్థలో పూర్తిగా వ్యాపిస్తుంది. అంతే కాదు శరీరమంతా ఆ శబ్ధంతో ప్రతిధ్వనిస్తుంది. మీరు మీ నోటితో ఉచ్ఛరించినట్లయితే దానిని జపము అంటారు. మీరు మీ హృదయంతో ఉచ్ఛరిస్తే దాన్నే తపము అంటారు. దాన్ని మీరు మీ మణిపూర చక్రం దగ్గరకు తీసుకుపోతే దాన్ని అజపము అంటారు.

దాని అర్థం జపం చేయకుండానే, మీ నోరు తెరవకుండానే, మీ స్వర నాళాలు, గాలి ద్వారాలు ఉపయోగించకుండానే మీ శరీరం శబ్ధంతో ప్రతిధ్వనిస్తుంది. మూలాధార, స్వాధిష్టాన ఇంకా మణిపూరక అనే మూడు చక్రాలు, శరీర భౌతిక పరిమాణాన్ని అనేక విధాల్లో కలిగి ఉంటాయి. మిగిలిన నాలుగు చక్రాల స్వభావం వేరే. ఎవరైనా సరే భౌతికంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా లేదా శక్తివంతగా బాగా జీవించాలన్నా, లేదా తమ సామర్థ్యాలను మెరుగు పరచుకుకోవాలని కోరుకున్నా, మూలాధార, స్వాధిష్టాన మరియు మణిపూరక చక్రాలు చాలా ముఖ్యమైనవి. మొత్తం యోగ మార్గాలన్నీ చాలావరకు ఈ మూడింటి  కలయికలతోనే అభివృద్ధి చెందాయి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

Pixabay/Wortflow-2411121