మనం గురువుని ఎంచుకోవడం సాధ్యమేనా...?

 
 

ప్రశ్న: ఒక వ్యక్తి గురువుని ఎంచుకోడని, గురువు మాత్రమే వ్యక్తిని ఎంచుకుంటాడని మీరు ఒకసారి అన్నారు. దీనిని వివరించగలరా?


 సద్గురు : చూడండి, ఒక వ్యక్తి  ఏదయినా ఎంచుకుంటే, అతను ఏది ఎంపిక చేసుకుంటాడు? ఏదయితే అతనికి అనుకూలంగా ఉంటుందో, దానినే అతను ఎంచుకుంటాడు. శ్రద్ధగా పరిశీలించండి, మీ ఆహానికి మద్దతుగా ఉండేదానిని  మాత్రమే మీరు ఎప్పుడూఎంచుకుంటారు. మీరు స్నేహితుణ్ణి ఎంచుకుంటే, ఎలాంటి స్నేహితుణ్ణి ఎంచుకుంటారు? మీకు అండగా నిలబడే వారిని, మీ ఆహాన్ని ఊరించే వాళ్లని మాత్రమే మీరు ఎంపిక చేసుకుంటారు. మీ అహాన్ని వెక్కిరిస్తుండే వాడిని, మీ స్నేహితుడు కాదని అనుకుంటారు. అతన్ని మీ శత్రువుగా జమ కడతారు.

అందువల్ల మీరు ఆచి తూచి గురువును ఎంచుకోవడం ప్రారంభిస్తే, ఆయన మీకు గురువు కాలేరు. ఆయన ఎవరైనా కావచ్చుగాని, మీకు గురువు మాత్రం కాలేరు. కాబట్టి దయచేసి అర్ధం చేసుకోండి, ఆయన మీకు గురువు కాలేరని నేను చెప్పినప్పుడు, ఆయన స్థితిగతులగురించి మాట్లాడడం లేదు. మీ స్వీకార స్వభావం గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. గౌతమ బుద్ధుడు స్వయంగా ఇక్కడకూర్చోవచ్చు. జీసస్ క్రీస్తు కూడా ఇక్కడ కూర్చోవచ్చు. వారి జ్ఞానాన్ని మీరు సమంగా స్వీకరించలేని పక్షంలో, వారు మీకు చేయగలిగేదేమీ ఉండదు.

జీసస్ అవతరించినప్పుడు, ఎంత మంది జనం ఆయన్ని అర్ధం చేసుకున్నారు? కేవలం వేళ్ళమీద లెక్కించవచ్చు. మిగతావాళ్ళందరూ, ఆయన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన పట్టించకోవలసినంత గొప్పవాడు కాదనుకున్నారు. లేదా ఆయన్ని ప్రతికూల వైఖరితో చూసారు. ఆయన పట్ల ఆగ్రహం వెళ్లగక్కారు. ఆయన్ని చూసి తలకిందులైపోయారు. చాలా కొద్దిమంది జనంమాత్రమే ఆయన అందరిలాంటి వాడు కాదని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. ఇప్పటికీ అదే నిజమని నమ్ముతున్నారు. ఆ నమ్మకం చెక్కు చెదరకుండా ఎప్పటికీ అలాగే ఉంటుంది.

ఈ రోజు రెండు వేల సంవత్సరాల తర్వాత, ‘‘నేను జీసస్  ను ప్రేమిస్తున్నాను’’అని ప్రతివారు చెబుతారు. కాని ఆ మాటకు సార్థకతలేదు. నేను మీతో ఎప్పుడూ చెబుతున్నట్లుగానే, మీరెప్పుడూ చనిపోయిన వారినే ప్రేమిస్తారు. ఎందుకంటే, వాళ్ళు మీకేమీచెయ్యలేదు కాబట్టి. మీకు కావలసిన విధంగా వాళ్ళని మలుచుకోవచ్చు. చనిపోయిన వాళ్ళతో ప్రేమలో పడడమనేది ఎప్పుడయినా చాలా తేలిక పద్దతి. ఎందుకంటే మీరెన్నడూ వివాదాల్లోకి దిగరు. మీరు నిరంతరం ప్రేమ భావాన్ని కొనసాగించవచ్చు. అలాకాకుండా మీరు జీవించి ఉన్నవాళ్ళతో ప్రేమలో పడితే ఈ క్షణంలో ప్రేమ ఉంటుంది, మరు క్షణంలో వివాదం చోటు చేసుకోవచ్చు.ఆ తర్వాత క్షణం నిస్పృహ, తదుపరి క్షణం నైరాశ్యం. అందువల్ల ఎల్లప్పుడూ చనిపోయిన వారితో ప్రేమలో పడడం తేలిక. ఎందుకంటే అదెంతో సురక్షితమైనది, ఎంతో సంతృప్తి కలిగిస్తుంది అనుకుంటున్నారు. కాని, ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోండి.

జీసస్ కూడా ఎన్నడూ ‘‘నన్ను ప్రేమించండి’’ అని చెప్పలేదు. ‘‘మీ పొరుగు వానిని ప్రేమించండి’’అని మాత్రమే ఆయన చెప్పారు. 

జీసస్ కూడా ఎన్నడూ ‘‘నన్ను ప్రేమించండి’’ అని చెప్పలేదు. ‘‘మీ పొరుగు వానిని ప్రేమించండి’’అని మాత్రమే ఆయన చెప్పారు. ఎందుకంటే ఈ క్షణంలో తానెవరో తెలియకుండా మీ పక్కనుండే వ్యక్తిని ప్రేమించడం ఆషామాషీ వ్యవహారం కాదు.అతనెటువంటివాడో మీకెంతమాత్రం తెలియదు. అతని శక్తి సామర్ధ్యాలేమిటో మీకు తెలియదు. ఇతగాడు తన జీవితంలో ఎంతటి దారుణమైన చర్యలకు పాల్పడుతున్నాడో మీకు తెలియదు. లేదా అతని మనసులో ఎలాంటి ఘోరమైన చర్యలకు పథకాలు వేస్తున్నాడో కూడా మీకు తెలియదు. అయినప్పటికీ మీ పక్కన కూర్చున్న వ్యక్తిని మీరు ప్రేమించ గలుగుతున్నారు. అలాగని ఇలా జరిగే అవకాశాలున్న విషయం మీరు తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నారని కాదు. ఇవన్నీ జరగడానికి అవకాశాలున్నా వాస్తవం మీకు తెలుసు. అయినప్పటికీ మీ పక్కనున్న వ్యక్తిని అతని గుణ గణాలతోగాని, అతని అనుకూలతలు, ప్రతికూలతల గురించి గాని, అతనిలో ఉండే మంచి చెడుల గురించి గాని పట్టించుకోకుండానే ప్రేమించగల సుగుణం మీలో ఉంది.

అలా చేయగలిగినట్లయితే, మీ ఆధ్యాత్మిక కృషిలో తొంబై శాతం నెరవేరినట్లే. మిగతా పది శాతం చాలా సూక్ష్మంగా, సులభంగా  ఉంటుంది. ఇందుకోసం  మీరేమీ చెయ్యనవసరంలేదు. మీరు అలా చేయగలిగినట్లయితే, మీకోసం ఆ బాధ్యతను మేము తీసుకుంటాం.

‘‘మీ పొరుగు వానిని ప్రేమించండి’’ అనే నినాదాన్ని మీరు విస్మరించి, దానిని ‘జీసస్ ప్రేమించండి’’ గా తయారు చేసారు.ఇది చాలా సులభం ఈ పనిని ఎవరైనా చెయ్యగలరు. ఈ క్షణంలో ఇక్కడ లేనివారినెవరినైనా ప్రేమించడం ఎవరైనా చెయ్యగలరు. దురదృష్టవశాత్తు మనం ఇలా చెయ్యడానికే ఎంచుకున్నాం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1