Sadhguruమీరు నిజంగా శ్వాస తీసుకుంటున్నారా? దయచేసి చెక్ చేసుకోండి? అది ఎల్లకాలం ఉంటుందని అనుకోకండి. మీరు నిజంగా శ్వాస తీసుకుంటున్నారా? ఈ గాలి పీల్చుకోవడం, వదలటం, పీల్చుకోవడం, వదలటం, పీల్చుకోవడం, వ..ద..ల..డం. తరువాత పీల్చుకోవడం జరగలేదు. ఉఫ్… మీ పని అయిపోయింది. చూడండి, మీరెంత సున్నితంగా ఉన్నారో? ఈ ఒక్క శ్వాస లోపలికి వెళ్లకపోతే, మేమెక్కడ చూసినా, మీరు ఈ చుట్టుపక్కల కనిపించరు. ఒక పక్కేమో చాలా సున్నితమైనది మనిషి జీవితం. మరోపక్క అది ఎంత పటిష్టమైనది. మనిషి ఈ ప్రపంచంలో ఎన్ని పనులు చేయగలడు. ఒకవైపు అది చాలా సున్నితమైనదిగా కనిపిస్తుంది, పరిశీలించి చూడండి? అది తిరిగి రాకపోతే ఉఫ్... చాలా సున్నితమైనది కదా!

మీరు అది  ఎల్లకాలం ఉంటుందని అనుకుంటున్నారు. మీరు దాని పట్ల స్పృహతో లేరు. మీరు స్పృహతో ఉండి దాన్ని గమనించినట్టయితే అది చాలా సున్నితమైన జీవితం. మరోపక్క అది ఎంత పటిష్టమైనది. ఎన్ని పనులను చేయగలదు అది. ఇదే సృష్టి అందం. ప్రతిదీ సున్నితంగా బాలన్స్ చేయబడింది. ఎంత సున్నితంగా అంటే మీరు దాన్ని డిస్టర్బ్ చేయలేరు, అంత ఈజీ కాదు తెలుసా! సృష్టి మొత్తం ఇలానే ఉంది. అది సృష్టికర్త నైపుణ్యాన్ని తెలియజేస్తోంది. అది చాలా సున్నితంగా బాలన్స్ చేయబడింది. దానర్ధం అది సృష్టికర్త నైపుణ్యాన్ని తెలియజేస్తోంది.

మీ పక్కన కూర్చున్న వ్యక్తి  మీ చేతిని తాకినటైతే, ఆ వ్యక్తి స్పర్శ మీకు తెలుసు అని మీరు అనుకుంటారు. కానీ మీకు తెలీదు, మీకు కేవలం మీ శరీరంలో కలిగిన సెన్సేషన్స్ మాత్రమే తెలుసు.

ఒక్క శ్వాసను మీరు లోనికి తీసుకోకపోతే మీ పని అయిపోతుంది. కానీ సృష్టికర్తకు రూపకల్పనలో అంతటి ధీమా ఉంది. కనుక ఈ శ్వాస అనేది కేవలం ఆక్సిజన్, కార్బన్  డయాక్సైడ్ ల మార్పిడి గురించి కాదు. యోగాలో దీన్ని 'కూర్మనాడి ' అంటాము. శ్వాసను ‘కూర్మనాడి’ అంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని మీరు సాధారణంగా జరిగేదే, అదే మీ శ్వాసను గమనించమని అన్నట్లయితే, మీరు శ్వాసను గమనించలేరు. మీరు శ్వాసను గమనిస్తున్నామని అనుకుంటారు అంతే. కానీ మీరు శ్వాసను గమనించటం లేదు. మీరు కేవలం గాలి కదలిక వలన కలిగిన సెన్సేషన్స్(sensations)ను గమనించగలుగుతున్నారు అంతే. మీ పక్కన కూర్చున్న వ్యక్తి  మీ చేతిని తాకినటైతే, ఆ వ్యక్తి స్పర్శ మీకు తెలుసు అని మీరు అనుకుంటారు. కానీ మీకు తెలీదు, మీకు కేవలం మీ శరీరంలో కలిగిన సెన్సేషన్స్ మాత్రమే తెలుసు. అవతలి వ్యక్తి ఎలా భావిస్తాడు అనేది మీకు తెలీదు. మీ శరీరంలో ఎటువంటి సెన్సేషన్ కలిగిందనేది మాత్రమే  మీకు తెలుసు. నేను చెప్పేది మీకు అర్ధం అవుతోందా? కనుక ప్రస్తుతం మీకు శ్వాస తెలీదు. మీకు కేవలం శ్వాస వలన కలిగే సెన్సేషన్స్ మాత్రమే తెలుసు.

అయితే మేము కూర్మనాడి అన్నప్పుడు మేము సెన్సేషన్స్ గురించి మాట్లాడటంలేదు. మేము ఆ శ్వాస గురించే మాట్లాడుతున్నాము. కూర్మనాడిని ఒక తీగగా పేర్కొంటారు. అది ఒక తీగలాగా ఉంటుంది. ‘తెగిపోని’  తీగలాగ. అది అలా సాగుతూనే ఉంటుంది. ఈ తీగే మిమ్మల్ని, ఈ శరీరంతో ముడిపెడుతుంది. నేను మీ శ్వాసను తీసేస్తే మీరు, మీ శరీరం వేరైపోతాయి. మీరు ఏదయితే ఒకటి అనుకున్నారో అవి రెండు అవుతాయి. అది మొదటి మాయ. రెండున్నాయి, కానీ ఒకదానిలా ప్రవర్తిస్తున్నాయి. మాయ మొదలవుతుంది. కనుక నేను శ్వాసను లాగేస్తే మీరు, మీ శరీరం వేరైపోతాయి. మీరు అలా వేరైపోవాలని మేమనుకోవట్లేదు. అయితే మీ స్పృహ, శ్వాసతో పాటుగా ప్రయాణిస్తే మీ ‘జాగరూకత’  శ్వాస మార్గంలో ప్రయాణిస్తే తగినంత పరిశీలనగా, అప్పుడు ఈ రెండూ ఒకటి కాదని మీరు చూస్తారు. స్పష్టంగా చూస్తారు. మీరు, మీ శరీరం వేరవుతాయి. మీరు, మీ మనస్సు వేరవుతాయి.

ప్రస్తుతం మీ జీవితంలో, మీ ఆలోచన చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నది.

మీరు, మీ శరీరం, మీరు, మీ మనస్సు, ఒకదానితో ఒకటి దూరంగా ఉన్నట్లయితే అప్పుడు మీ శరీరాన్ని, మీ మనస్సును ఉపయోగించే మీ సామర్ధ్యం చెప్పలేనంత పెరగటం  మీరు చూస్తారు.ఒకటి నుంచి పది కొలమానంలో మీ సామర్ధ్యాన్ని గనక చుస్తే, మీరు ఈ శరీరంతో మమకారం పెంచుకున్నకొద్దీ, లేదా ముడిపడి ఉన్నట్లయితే మీరు ఒకటి కంటే తక్కువ. ఈ రెండు(మీరు, మీ శరీరం) వేరైతే సడన్ గా మీరు పది దాకా వెళ్ళవచ్చు. మనస్సును, శరీరాన్ని, ఉపయోగించే మీ సామర్థ్యం ఎంతగా పెరుగుతుందంటే మీరు వేరొకరికి దాదాపుగా "ఒక సూపర్ హ్యూమన్ గా" కనబడతారు. కానీ నేను చెప్పేదేంటంటే ఇది కేవలం మనిషిగా ఉండటంలోని విషయం. ఇది సూపర్ హ్యూమన్ గా ఉండటం గురించి కాదు, ఇది మనిషిగా ఉండటమే “సూపర్” అని గ్రహించేదాని గురించి. అవును, మనిషిగా ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు. ప్రస్తుతం మీ జీవితంలో, మీ ఆలోచన చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నది. అలాగే మీ శ్వాస "ప్రాణాధారం". వీటితో పాటు ‘జాగరూకత’ లేకుండా ప్రస్తుతం మీరిక్కడ ఉన్నారు అన్న విషయం కూడా మీకు తెలీదు.

మీరు జాగరూకులుగా లేకపోతే, మీరు సజీవంగా ఉన్నారా, మరణించారా, లేదా  మీరు అసలు ఉన్నారా? లేదా? అన్న విషయం కూడా మీకు తెలీదు. కనుక ఈ మూడు అంశాలు, “మీ ఆలోచన, మీ శ్వాస, మీ జాగరూకత”. వీటిని మీరు సరైన కాంబినేషన్ లో ఉపయోగిస్తే మెల్లిగా మీకు, మీ శరీరానికి మధ్య కాస్తంత దూరం ఏర్పడడం మీరు చూస్తారు. ఇప్పుడు మీరు చాలా స్పష్టంగా అసత్యం నుంచి సత్యానికి సాగుతారు. ఈశా క్రియలో ఇది జరుగుతుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు