Sadhguruఈయన పేరు రాఘవేంద్రరావు. ఈయన మల్లాది హళ్లిస్వామిగా పిలువబడుతుండేవారు. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఈయన మా తాతగారింటికి వస్తూవుండేవారు. మా తాతగారు ఇలాంటి వాళ్లని పోషిస్తూ ఉండేవారు. ఈయన ఎప్పుడూ ప్రయాణాలు చేస్తూ యోగాని ప్రచారం చేస్తూ ఉండేవారు. ఈయన ఎంతో గొప్ప ఆయుర్వేద ఇంకా నాడీ వైద్యుడు కూడానూ. నాడీ వైద్యుడు అంటే మీ నాడి చూసి, వారు మీ సమస్యల్ని చెప్పగలరు.  ఇప్పుడు మీకున్న వ్యాధులే కాదు, మీకు రాబోయే పది పదిహేను సంవత్సరాల్లో ఎలాంటి జబ్బులు రావచ్చో కూడా ఆయన ఇప్పుడే చెప్పేయగలరు. మీకు వాటికి ఉపశమనం కలిగించే ప్రక్రియను మీరు చేయగలిగేవేమిటో ఆయన మీకు చెప్పేవారు.

మేముగనుక ఆయనతోపాటు కుస్తీకి వెళితే; మేము కనీసం ముగ్గురు వెళ్ళేవాళ్ళం... ఆయనకి ఎదురుగా;

నేను ఆయనని మొట్టమొదట కలసినప్పుడు ఆయనకి 81-82 సంవత్సరాలు ఉండేవి. నాకు 9-10 సంవత్సరాలు ఉండేవి. నేను ఆ సమయంలో ఏదైనా ఎక్కేయగలిగేవాడిని. మీకు ఈ విషయం తెలుసా...? గ్రామాల్లో బావులుంటాయి. మా తాతగారు ఉన్న గ్రామంలో బావులు ఉండేవి. దొడ్లో బావులుండేవి. ఐదు-ఆరు అడుగుల వైశాల్యంతో వుండేవి. ముప్ఫై అడుగుల లోతుల్లో నీళ్లు వుండేవి. అప్పట్లో నాకు ఇష్టమైన ఆట ఏమిటంటే ఇందులోకి దూకడం; మళ్ళీ వెనక్కి ఎక్కి వచ్చేయడం. ఈ గోడలని పట్టుకుని పైకి ఎక్కి వచ్చేయడం. దీనిని ఈ ఎనభైఒక్క సంవత్సరాల ముసలాయన నాకంటే బాగా చేయగలిగేవాడు. వేరే ఏ పిల్లలూ నా అంతా బాగా ఎక్కలేకపోయేవారు. కానీ ఈ ఎనభైఒక్క సంవత్సరాల ఆయన నాకంటే వేగంగా ఎక్కేసేవారు. నాకు ఇది ఎలాగో తెలుసుకోవాలి అనిపించింది. ఆయన, నువ్వు నాతో వచ్చి యోగా చెయ్యి – అన్నారు.

ఇది మొట్టమొదటిగా నన్ను ఆయన దగ్గరకు వెళ్ళి యోగ-సాధనలు నేర్చుకోడానికి ఉపకరించింది. ఈయన శరీర ధృఢత్వం కలిగిన వ్యక్తి. నేను కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్లినప్పుడు, నేను... అయిదారేళ్లపాటు జిమ్ముకి(Gym) వెళ్ళి కండరాలవీ పెంచుకుని ఉన్నాను. అప్పటికి ఆయనకి 84-85 సంవత్సరాలు. ఇంకా నాకంటే ఎంతో బలంగా ఉన్న యువకులు కూడా ఉండేవారు. మేముగనుక ఆయనతోపాటు కుస్తీకి వెళితే; మేము కనీసం ముగ్గురు వెళ్ళేవాళ్ళం... ఆయనకి ఎదురుగా; మేము ముగ్గురం ఆయన ఒక్కరు… మేమందరం కూడా యువకులం. ఎంతో బలంగా వుండేవాళ్లం. మేమేంతో కసరత్తు చేసేవాళ్లం. కానీ, కొన్ని సెకెండ్లలో ఆయన మా ముగ్గుర్నికూడా ఓడించేసేవారు. ఒక్కసారి కూడా, మేము ఒక్క నిముషం పాటు కూడా ఆయనతో కుస్తీ పట్టలేకపోయే వాళ్ళం.

ఆయన మీరు నాకేదైనా ఇవ్వదలచుకుంటే డబ్బులివ్వండి అని చెప్పేవారు...లేకపోతే వెళ్లిపొండి అనేవారు.

ఈయన ఎంతో అసాధారణమైన జీవనం గడిపారు. ఈయన డబ్బులు అడగటానికి అసలు భయపడేవారు కాదు. మీరు ఆయన ఆశ్రమానికి వెళితే, “మీరు నాకేదైనా ఇవ్వదలచుకుంటే, నాకు డబ్బులివ్వండి” అని బోర్డులు పెట్టేవారు.  ఎందుకంటే, ఆ రోజుల్లోనే ఆయన దగ్గర 3,500 వికలాంగ పిల్లలు ఉండేవారు. ఒకరిద్దరు పిల్లలుంటేనే మీరెంత కష్టపడి పని చేస్తున్నారు...? ఇంక 3,500 పిల్లలంటే ... ఆయన డబ్బులకోసం ఎంతో కష్టపడేవారు. ఎవరైనా సరే ఆయనని పొగడాలని నోరు తెరిస్తే చాలు; ఆయన మీరు నాకేదైనా ఇవ్వదలచుకుంటే డబ్బులివ్వండి అని చెప్పేవారు...లేకపోతే వెళ్లిపొండి అనేవారు. ఈయన ఎంత అద్భుతంగా జీవించారో తెలుసుకోవాలంటే ...ఆయనకి ఎనబ్ఘై రెండు  – ఎనభైమూడు సంవత్సరాలున్నపుడు; ఒక సంఘటన జరిగింది. ఆయన ఎక్కడున్నాసరే వారంలో ఆరు రోజులు ఆయన ప్రయాణాలు చేస్తూనే ఉంటారు.

ఈయన రోజంతా ఆయుర్వేద వైద్యం చేసేవారు. సోమవారం మూడున్నర – నాలుగింటికి గనక వైద్యం చేయడం మొదలు పెడితే ...ఇది ఇంక అలా సాగుతూనే వుండేది. ఒకసారి ఆయన కూర్చున్నారు అంటే అంతే, ఆయనకి సహకారం అందించడానికి వచ్చిన వాలంటీర్లు షిఫ్ట్ లలో వచ్చేవారు. ఆయన మాత్రం, పొద్దున్న ఒక్కసారి మూడున్నరకు కూర్చుంటే ... ఇంక అలా కూర్చోనే ఉండేవారు. వచ్చిన ప్రతివారికి ఏదో ఒక జోకు చెప్పేవారు. అది వైద్యం కోసం వచ్చినట్లు ఉండేదే కాదు. అది ఒక పండగలా వుండేది.

ఆయన రైల్వే ట్రాక్ మీద పరిగెట్టుకుంటూ వెళ్లారు. 83 సంవత్సరాల మనిషి రాత్రంతా పరిగెట్టుకుంటూ నాలుగింటికల్లా అక్కడికి వెళ్ళిపోయారు.

ఒక ఆదివారం రోజు రాత్రి ఏమి జరిగిందంటే ఆయన ఒక రైల్వే స్టేషనులో ఉన్నారు. ఇది ఆశ్రమం దగ్గర నుంచి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆశ్రమానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఇంకొక స్టేషన్ ఉంది. ఇది ట్రైన్లో గంటంపావు పట్టేది. అవి జార్జి ఫెర్నాండెజ్ రోజులు... ఎప్పుడైనా సరే వాళ్ళు పని-స్ట్రైక్ చేసేవాళ్ళు. రైల్వే వాళ్ళు స్ట్రైక్ లో వెళ్లారు. అప్పుడు ట్రైనులన్నీ కూడా ఆగిపోయాయి. అది అర్ధరాత్రి. ఈయన ఇద్దరు మనుషులతో  రైల్వే స్టేషన్ లో ఉన్నారు. ఇంకా వేరే ఎటువంటి వాహనం లేదు. ఆయన పని పట్ల ఎంత నిమగ్నులై ఉన్నారు అంటే, తనతోపాటు వచ్చిన ఇద్దరినీ ఆ ప్లాట్ఫార్మ్ మీద వదిలేసి; ఆయన రైల్వే ట్రాక్ మీద పరిగెట్టుకుంటూ వెళ్లారు. 83 సంవత్సరాల మనిషి రాత్రంతా పరిగెట్టుకుంటూ నాలుగింటికల్లా అక్కడికి వెళ్ళిపోయారు. ఆయన పేషెంట్లను చూడడానికి వచ్చేశారు. ఆశ్రమంలో ఉన్నవాళ్లకి ఈయన పరిగెత్తుకుంటూ వచ్చారని తెలియదు. ఎంతోసేపటి తర్వాత మిగతావాళ్ళిద్దరూ వచ్చినప్పుడే స్వామీజీ రైల్వే ట్రాక్ మీద పరిగెట్టారు అన్న విషయం తెలిసింది.

ఈయన శారీరికంగా అద్భుతమైన వ్యక్తి. ఏడు – ఎనిమిది సంవత్సరాల క్రితం మేము అక్కడ ఉన్నప్పుడు ఆయనతో హాస్యం ఆడుతూ వుండేవాళ్ళం... మీరెప్పుడు పోతారు ... అని, మీకంటే ముందర మేం పోయేలా వున్నాం... అని. ఆయనెప్పుడూ - నాకింకో నలభై ఏళ్ల పని వుంది. అది అయిపోయినతరువాత వెళతాను అనేవారు. అదేలాగ కనపడేదంటే, ఆయన నిజంగానే అలా జీవిస్తారేమో అన్నట్టుగా కనిపించేది. కానీ, ఆయనకి నూటఎనిమిది సంవత్సరాలు ఉండగా ఆయన చనిపోయారు. ఇప్పటికీ దాదాపు ఎనిమిది-తొమ్మిది సంవత్సరాలయ్యింది. ఆయన చనిపోయే మూడునెలల ముందర కూడాను ఆయన మైసూరులో ఒక లెక్చర్ ఇస్తున్నారు. ఆయనకి ఆ స్టేజీ మీద ఒక చిన్న హార్ట్ ఎటాక్ వచ్చింది. అక్కడ పడిపోయారు.  అప్పుడు వారాయనని తీసుకువెళ్లి ఒక నర్సింగ్ హోంలో చేర్చారు.  ఒక హాస్పిటల్...ఐ.సీ.యూ లో అట్టిపెట్టారు. అది  మొదటి అంతస్తు మీద ఉంది. ఆయనలో ట్యూబులూ, సూదులూ అన్నీ గుచ్చారు. ఎక్కడో మధ్య రాత్రి ఆయనకి మెలకువ వచ్చింది. ఆయనకి అవన్నీ నచ్చలేదు. అవన్నీ పీకేసి,  ఆయన మొదటి అంతస్తు నుంచి దూకి వచ్చేశారు. నూటఎనిమిది సంవత్సరాల మనిషి... ఒకటో అంతస్తు మీంచి దూకి మాయమైపోయారు. మూడు నెలల తర్వాత ఆయన చనిపోయారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు