ఆదిశక్తి యొక్క మహోజ్వల వ్యక్తీకరణే లింగభైరవి. లింగభైరవి ఒక గొప్ప శక్తిమంతురాలు, ఒక కరుణామయి, ఒక ఆనంద సాగరి. విశ్వంలోని సృజనాత్మకతకు, ఎదుగుదలకు ప్రతిరూపమైన ఆమె అన్నింటినీ తనలో ఇమడ్చుకుంటుంది. లింగరూపంలో సృష్టించబడటం ద్వారా లింగభైరవి ప్రత్యేకతను సంతరించుకున్నది. ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న దేవి ఘనీభవించిన పాదరసంతో ప్రాణ ప్రతిష్ఠ ద్వారా ప్రతిష్ఠీకరించబడిన ఒక శక్తి రూపం. ఒక రాయిని కూడా ఒక దేవతగా మార్చడానికి ప్రాణశక్తులను ఉపయోగించే అరుదైన ప్రక్రియే ప్రాణ ప్రతిష్ఠ.

ఒక రాయిని కూడా ఒక దేవతగా మార్చడానికి ప్రాణశక్తులను ఉపయోగించే అరుదైన ప్రక్రియే ప్రాణ ప్రతిష్ఠ

జీవితంలోని భౌతిక, ప్రాపంచిక విషయాల గురించి కోరుకున్నా లేదా వాటిని అధిగమించాలని కోరుకున్నా, దేవి మీ కోరికలను తప్పక తీరుస్తుంది
లింగభైరవి శక్తి మానవ శరీరంలోని మూడు ప్రాథమిక చక్రాలను శక్తివంతం చేస్తుంది. ఆ విధంగా దేవి శక్తి ఒక వ్యక్తిలోని శరీరం, మనస్సు, శక్తులను స్థిరపరుస్తుంది. ఆమె అనుగ్రహపాత్రులైన వారి జీవితం ఉజ్వలంగా, సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది.

మీ ఇంటిలోనే ఒక ప్రతిష్టింపబడిన ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకునేందుకు తోడ్పడేటట్లు సద్గురు లింగ భైరవి యొక్క వివిధ రూపాలను సృష్టించారు.

లింగ భైరవి యంత్రాలు 

సాంప్రదయంగా యంత్రాలనేవీ ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని పొందటానికి సహాయపడడానికై రూపొందించబడిన రూపాలు. లింగ భైరవి యంత్రం మీ పూర్తి శ్రేయస్సు కోసం అవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. యంత్రము యొక్క శక్తిని పొందినప్పుడు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అనేవి సహజంగానే సిద్ధిస్తాయి.

మీరు ఒక యంత్రమును స్వీకరించినప్పుడు, సద్గురు మీకు ఒక ప్రక్రియను ఉపదేశించి, తద్వారా దేవి యొక్క శక్తితో మిమ్మలిని అనుసంధానం చేస్తారు. అప్పుడు ఆ యంత్రం వ్యక్తిగతీకరించబడినది అవుతుంది

మీరు ఒక యంత్రమును స్వీకరించినప్పుడు, సద్గురు మీకు ఒక ప్రక్రియను ఉపదేశించి, తద్వారా దేవి యొక్క శక్తితో మిమ్మలిని అనుసంధానం చేస్తారు. అప్పుడు ఆ యంత్రం వ్యక్తిగతీకరించబడినది అవుతుంది. ఆ ప్రతిష్ఠించబడిన రూపాన్ని స్పర్శించడం ద్వారా మీరు దేవి యొక్క అనుగ్రహమును పొందుతారు. యంత్రాలను మీరు మీ కార్యాలయాలలో పెట్టుకొనవచ్చు. ఇది మీ వ్యాపారం సాఫీగా కొనసాగటానికి, సాధ్యమైనంత వృద్ధి చెందటానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

ప్రతి స్త్రీ, పురుషుడు, పిల్లలు ప్రతిష్ఠీకరించబడిన ప్రదేశంలో నివసించాలి అనేది సద్గురు ఆకాంక్ష.

భైరవి కృపను ఎవరైతే పొందుతారో, వారు ఇక జీవన్మరణాలు, పేదరికం లేదా వైఫల్యాల గురించి చింతతో గానీ, భయంతో గానీ జీవించనవసరం లేదు. దేవి కృప పొందినట్లయితే, ఒక మనిషి ఏదైతే శ్రేయస్సు అని అనుకుంటాడో అందంతా అతని సొంతమవుతుంది -సద్గురు

లింగ భైరవి యంత్రం సంవత్సరానికి రెండు సార్లు పౌర్ణమి రాత్రినాడు యోగి, మర్మజ్ఞుడు ఐన సద్గురు సమక్షంలో ఇవ్వబడుతుంది.వారి నుండి యంత్రాన్ని ప్రత్యక్షంగా అందుకునేటప్పుడు మీరు ఒక శక్తివంతమైన ప్రక్రియలోకి ఉపదేశింపబడుతారు.

లింగ భైరవి యంత్రం గురించి మరిన్ని వివరాలకు కింది మార్గాల ద్వారా సంప్రదించండి.

ఫొన్ +91 8300030555
Email: yantra@lingabhairavi.org