మీ ఆలోచనా, అభిప్రాయాలకు మించినది జీవితం...

 

మనలో జరిగేదంతా మన కలే అని , మన సొంత ఆలోచన, భావాలలో మునిగిపోయి జీవితాన్ని జీవించడం లేదని సద్గురు అంటున్నారు. మనకి కావలసిన విధంగా జీవించడానికి ఒక సాంకేతికత ఉందని, దానికి కావాల్సిన సమయం ఇవ్వగలిగితే ఎవరైనా ఆ లాభం పొందవచ్చునని చెబుతున్నారు.

Sadhguruమీరు దేనినైతే, నా జీవితం అంటున్నారో, ప్రస్తుతం అది - మీ ఆలోచనా, మీ భావాలూ, మీ అభిప్రాయాలూ, మీ నిర్ధారణలూ - దీనినే మీరు జీవితం అంటున్నారు. ఇది జీవితం కాదు. ఇది కేవలం మీ ఆలోచనా ప్రక్రియ మాత్రమే..! జీవితం అనేది, అస్తిత్వానికి సంబంధించిన ప్రక్రియ. మీ మనస్సులో జరిగేది కేవలం ఒక కలే. మీ కల అయినా, మీకు కావాల్సినట్లు జరగాలి కదా..? నేను, మిమ్మల్ని కలలు కనవద్దు అని చెప్పడం లేదు. కనీసం మీ కల, మీకు కావలసినట్లు ఉండాలి కదా..? కానీ మీకు మీరు కోరుకున్న విధంగా కలలు రావడం లేదు. అందుకే, మీకు ఈ వత్తిడి, ఆందోళన, భయం, ద్వేషం. ఒకవేళ మీ కల గనుక మీకు నచ్చిన విధంగా జరుగుతోందనుకోండి, మీ జీవితం మీకు కావలసిన విధంగా జరగకపోయినా సరే మీ కల మీకు కావలసినట్లుగా జరిగితే, మీరు కనీసం సంతోషంగా ఉంటారు. అంటే, మీకు ఆకలేస్తూ ఉండి ఉండవచ్చు. కానీ, మీరు సంతోషంగానే ఉంటారు. మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేయవచ్చు కానీ, మీరు సంతోషంగానే ఉంటారు.

అందుకని, ఇది కేవలం ఒక ఆలోచనగా ఉండిపోకుండా ఉండాలంటే నేను ఏమి చెయ్యాలి? ఇది నేను, నాతో మొదలు పెట్టినప్పుడు అంతా నాకు ఒక గొప్ప పరిశోధనగా అనిపించింది. నేను, ఇది అందరికీ జరిగేలాగా చేయాలని, దానివైపు కృషి చెయ్యడం మొదలు పెట్టాను. ఈ సాంకేతికత అంతా, ఇది నాకు కావలసినట్లుగా ఉండాలి అన్నట్లు. ఆ తరువాత, నేను ఏమి తెలుసుకున్నాను అంటే - నేను అంతకు ముందే కనుక్కున్న విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్న మూర్ఖుడిని అని. ఇంతకు ముందర ఎన్నో వేల మంది ప్రజలకు ఈ విషయం తెలుసు. కానీ, నేను అది ఇప్పుడు తెలుసుకున్నాను. ఎందుకు అంటే నాకు ఎటువంటి ఆధ్యాత్మిక బోధనగానీ, ఎటువంటి సహకారం గానీ లేదు. ఇది,  ఉన్నపళంగా నాకు తెలిసింది. నేను, ఇదే మొదటిసారి అనుకున్నాను.

మీరు ఏమి అర్థం చేసుకోవాలంటే, మీ జీవితానుభూతి మీలో జరుగుతున్నదానికే పరిమితమైంది అని.

కానీ ఆ తరువాత కొన్ని కోట్లమంది ప్రజలకు తరాలుగా ఈ విషయం తెలుసు - అన్న విషయం నాకు అర్థం అయింది. అందుకని, దీని గురించిన ఒక పూర్తి విజ్ఞానమే ఉంది. కాకపోతే దీనిని మనం చేరుకోవాలి. నేను అంత:ప్రయాణం అన్నప్పుడు, మీరు మీలో ఉన్న సాంప్రదాయకపరమైన ఆలోచనలన్నీ తొలగించేయ్యండి. మీరు ఏమి అర్థం చేసుకోవాలంటే, మీ జీవితానుభూతి మీలో జరుగుతున్నదానికే పరిమితమైంది అని. దానిని బట్టి మీరు అనుభవపూర్వకంగా మీ దృష్టిని మీ వైపు మరల్చి, ప్రతిదాన్నీ నమ్మడం ఆపి తెలుసుకోవాలనుకుంటున్నారు అని అర్ధం. నమ్మడం నుంచి -  అంతర్ముఖులవ్వడానికి మీరు 28 నుంచి 30 గంటల జీవితాన్ని ఏకాగ్ర దృష్టితో నాకివ్వండి. అప్పుడు, మేము మీకు, ఇది తెలుసుకోవడానికి ఒక రకమైన యంత్రాన్ని ఇవ్వగలం. అది మీకు తెలుసుకొనే అవకాశాన్ని ఇస్తుంది. కానీ, అంతమాత్రం సమయం అవసరం. ఇంకా సాంకేతికత ఆ స్థాయిలోనే ఉంది. ఏదో ఒకరోజు నేను ఇది ఒక క్షణంలో జరిగిపోయే సాంకేతికతను కనుగొనగలిగినప్పుడు అదే చేద్దాం. మీరు ఎంతో సాధారణమైన మానవులైతే, నిజానికి నేను ఒక క్షణంలోనే చేయగలను. కానీ, ఇప్పుడు మీరు విద్యావంతులు. మేము విద్యావంతులకి 30 గంటలు తీసుకుంటాం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1