కర్మ ఫలం

మనం సాధారణంగా ఆనందం మనం చేసే పనులలో ఉందనుకొని, దానిని పొందాలని ఏవేవో పనులు అంతులేకుండా చేస్తూనే ఉంటాం. మరి ఆనందం నిజంగా మనం చేసే పనులలో ఉందా? దీని గురించి సద్గురు ఏమంటున్నారో తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి.
 

మనం సాధారణంగా ఆనందం మనం చేసే పనులలో ఉందనుకొని, దానిని పొందాలని ఏవేవో పనులు అంతులేకుండా చేస్తూనే ఉంటాం. మరి ఆనందం నిజంగా మనం చేసే పనులలో ఉందా? దీని గురించి సద్గురు ఏమంటున్నారో తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి.


ఇప్పుడు మీరు మీ జీవితాన్ని పైపైనే జీవిస్తున్నారు, అందువల్ల మీ చుట్టూ జరిగే ప్రతి ప్రతికూల చర్య మీ అంతరంగాన్ని కలిచి వేస్తుంది. జీవం మిమ్మల్ని ఎంత ప్రగాఢ ఆనందంతో పోషిస్తోందంటే, మీరు మీ జీవమూలంలో నాటుకుని ఉంటే, మీమీద ఎటువంటి బాహ్య పరిస్ధితుల ప్రభావమూ ఉండదు.

మీరు మీ సామర్ధ్యం మేరకు మాత్రమే మీ బాహ్య పరిస్ధితులను అదుపు చేసుకోగలరు. కొన్ని విషయాలు మీకు కావలసినట్లు జరుగుతాయి, కొన్ని విషయాలు మీకు కావలసినట్లు జరగవు. అప్పుడు మీరు 'అందులో ఏముంది? జీవితం అలాగే ఉంటుంది' అని అనుకున్నట్లైతే, దానితో మీకే ఇబ్బంది ఉండదు. కొన్ని విషయాలు మీకు అనుకూలంగా జరుగుతాయి, కొన్ని విషయాలు మీకు ప్రతికూలంగా జరుగుతాయి. మీకు అనుకూలంగా జరగని విషయాలు మరేవరికో అనుకూలంగా జరుగుతాయి, అవునా, కాదా? ఇక అందులో సమస్య ఏముంది?

ఊరికే అలా ఉండటం వల్లనే కలిగే ఆనందం మీకు తెలియకపోతే, మీరు కర్మ ఫలం నుండి విడుదల చేయబడరు. ఎందుకంటే, అప్పుడు ఆ కర్మ ఫలమే మీ ఆనందానికి మూలం అవుతుంది.

మీరు కావాలనికున్నది జరగకపోతే మీరు దుఖంతో కృంగిపోతారు. మీరు ముందే ఆనందంగా ఉంటే, ఏది జరుగుతుందో, ఏది జరగదో అన్నది మీకు సమస్య కాదు. మీరు పని మొదలు పెట్టక ముందే ఆ కర్మ ఫలం నుండి విడుదల చేయబడతారు. ఇది మీరు దాని పట్ల వైరాగ్యం పెంపొందించుకున్నందు వల్లనో, పరిత్యాగం వల్లనో కాదు. అది కేవలం మీరు ఎంతో ఆనందంగా ఉన్నందువల్లనే. ఊరికే అలా ఉండటం వల్లనే కలిగే ఆనందం మీకు తెలియకపోతే, మీరు కర్మ ఫలం నుండి విడుదల చేయబడరు. ఎందుకంటే అప్పడు ఆ కర్మ ఫలమే మీ ఆనందానికి మూలం అవుతుంది. ఇక మీరు దాని నుండి స్వేచ్చగా ఎలా ఉంటారు? మీరు దాని నుండి స్వేచ్చగా ఉండలేరు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.

PC: photogram

 

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1